Virender Sehwag Hitting 20 boundaries: టీమిండియా మాజీ ఆటగాడు, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag ) పేరు వింటేనే ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుడుతుంది. అతడు మైదానంలో దిగాడంటే బౌండరీలు లేదా సిక్సర్లు వెళ్లాల్సిందే. సింగిల్స్ అస్సలు తీయని ఏకైక ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ చరిత్ర సృష్టించాడు. టీమిండియా ఓపెనర్ గా బరిలోకి దిగి… ఎన్నో మ్యాచ్ లు ఫినిష్ చేసేవాడు. టెస్టులను కూడా టి20 లాగా ఆడి… మంచి ఎంటర్టైన్మెంట్ అందించాడు. అయితే అలాంటి వీరేంద్ర సెహ్వాగ్ ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అతడి పాత రికార్డు తెరపైకి వచ్చింది. వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ ప్రారంభించిన నుంచి చివరి వరకు హిట్టింగ్ చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలోనే దాదాపు 20 మ్యాచ్ లలో తొలి బంతికే బౌండరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అదే రికార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag ) సిక్సర్లతో పాటు బౌండరీలు కొట్టడంలో దిట్ట. బంతి ఎలా వచ్చినా కూడా బౌండరీకి పంపి ఎన్నో పరుగులు రాబట్టాడు. అయితే వన్డే క్రికెట్ లో గతంలో అందుకున్న మైల్ స్టోన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 50 ఓవర్ల మ్యాచ్ లలో మొదటి బంతికే ఎక్కువ సార్లు బౌండరీ కొట్టిన ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. అలా దాదాపు 20 మ్యాచ్ లలో తొలి బంతికే 20 బౌండరీలు కొట్టిన ప్లేయర్ గా నిలిచాడు. అంటే తొలి బంతికే ఇలా బౌండరీలు సాధించి మొత్తం 80 పరుగులు చేశాడన్నమాట. ఇలా ఇప్పటి వరకు ఏ ఒక్క క్రికెటర్ తొలి బంతికి బౌండరీ సాధించి అత్యధిక పరుగులు రాబట్టిన లిస్ట్ లో ఎవరూ లేరు. ఈ నేపథ్యంలోనే వీరేంద్ర సెహ్వాగ్ కు సంబంధించిన 20 బౌండరీల రికార్డు వైరల్ గా మారింది.
వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్ లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. టెస్టులు వన్డేలు టీ20లలో రాణించి ఇరగదీశాడు. ముఖ్యంగా టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన మొనగాడిగా కూడా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచ కప్ లలో మనోడు దుమ్ము లేపాడు. 2013 తర్వాత టీమ్ ఇండియాలో సరిగ్గా అవకాశాలు వీరేంద్ర సెహ్వాగ్ కు రాలేదు. ఈ క్రమంలో 2015లో రిటైర్మెంట్ ఇచ్చేశాడు. అటు ఐపిఎల్ ( IPL ) టోర్నమెంట్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఇప్పుడు కామెంటేటర్ గా, పని చేస్తూనే… కోచింగ్ సెంటర్ కూడా నిర్వహిస్తున్నాడు. అటు తన కొడుకును కూడా క్రికెట్ లోకి దించాడు. టీమిండియాలోకి తీసుకువచ్చేలా ట్రైనింగ్ ఇస్తున్నాడు.