E-Paper
Advertisement

జెట్ స్పీడ్‌లో ఛార్జ్ చేసే Xiaomi 20,000mAh కాంపాక్ట్ డీల్!

జెట్ స్పీడ్‌లో ఛార్జ్ చేసే Xiaomi 20,000mAh కాంపాక్ట్ డీల్!
Advertisement

Xiaomi compact power bank: ఈ రోజుల్లో.. ఫోన్ ఎంత ఇంపార్టెంటో, జర్నీల్లోనో లేదా బయట తిరుగుతున్నప్పుడో ఫోన్ డెడ్ అవ్వకుండా కాపాడే పవర్‌బ్యాంక్ కూడా అంతే ఇంపార్టెంట్. అయితే పవర్‌బ్యాంక్ ఉన్నా, దానికి మళ్లీ కేబుల్ విడిగా తీసుకెళ్లడం పెద్ద తలనొప్పి. ఈ ఇబ్బందికి పర్మనెంట్ చెక్ పెడుతూ టెక్ దిగ్గజం షావోమి (Xiaomi) ఇండియాలో ఇన్-బిల్ట్ కేబుల్‌తో ఒక క్రేజీ పవర్‌బ్యాంక్‌ను దించింది. అదే.. Xiaomi Compact Power Bank 20,000mAh. పాకెట్ సైజులో ఉంటూ.. అద్భుతమైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చే ఈ గ్యాడ్జెట్ ఫీచర్స్ , ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Xiaomi Compact Power Bank 20,000mAh.. ఫీచర్స్ :

టెక్ ప్రియులు సైజులో చిన్నగా ఉండి ఎక్కువ యూటిలిటీ (ఉపయోగం) ఇచ్చే వస్తువులను ఇష్టపడుతున్నారు. ఈ కొత్త పవర్‌బ్యాంక్ ఆ అవసరాలను వందశాతం తీరుస్తుంది.

Advertisement

1. ఇన్-బిల్ట్ టైప్-సి కేబుల్ :

ఈ పవర్‌బ్యాంక్ హైలైట్ ఫీచర్ ఏంటంటే.. దీనికి ఒక ఇంటిగ్రేటెడ్ టైప్-సి (USB-C) కేబుల్ అటాచ్ చేసి ఉంటుంది. దీని వల్ల మీ ఆండ్రాయిడ్ ఫోన్లు లేదా ఐఫోన్ 15, 16 సిరీస్ వంటి డివైజెస్‌ను ఛార్జ్ చేయడానికి విడిగా వైర్ మోయాల్సిన అవసరం లేదు. ఈ కేబుల్ టూ-వే ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంటే దీని ద్వారా పవర్‌బ్యాంక్‌ను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.

Advertisement

2. 22.5W ఫాస్ట్ ఛార్జింగ్:

ఇందులో 20,000mAh భారీ కెపాసిటీ కలిగిన హై-డెన్సిటీ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది. ఇందులో ఇన్-బిల్ట్ కేబుల్‌తో పాటు అదనంగా ఒక యూఎస్‌బీ-సి (USB-C) పోర్ట్,ఒక యూఎస్‌బీ-ఏ (USB-A) పోర్ట్ ఇచ్చారు.అంటే ఒకేసారి మీరు హ్యాపీగా 3 డివైజెస్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది గరిష్టంగా 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. దీని వల్ల మీ ఫోన్లు చాలా త్వరగా రీఛార్జ్ అవుతాయి.

3. లో-పవర్ డిశ్చార్జ్ మోడ్ :

బ్లూటూత్ ఇయర్‌బడ్స్, నెక్ బ్యాండ్స్ లేదా స్మార్ట్‌వాచెస్ లాంటి చిన్న గ్యాడ్జెట్లకు ఎక్కువ పవర్ ఇస్తే.. అవి పాడైపోయే ఛాన్స్ ఉంది. ఇందుకోసం షావోమి పవర్‌బటన్‌ను రెండుసార్లు.. ప్రెస్ చేస్తే ఆక్టివేట్ అయ్యే Low-Power Discharge Mode ని ఇందులో ఇచ్చింది. ఇది చిన్న డివైజెస్‌ను చాలా సేఫ్‌గా.. తక్కువ కరెంట్‌తో ఛార్జ్ చేస్తుంది.

4. 12-లేయర్ల పటిష్టమైన సేఫ్టీ ప్రొటెక్షన్:

బ్యాటరీ పేలుళ్లు, హీటింగ్ సమస్యలు రాకుండా ఉండటానికి ఇందులో 12-Layer Circuit Chip Protection ని అమర్చారు. ఇది ఓవర్ హెల్తీ హీటింగ్, షార్ట్ సర్క్యూట్, ఓవర్ వోల్టేజ్ , ఓవర్ ఛార్జింగ్ కాకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో స్మార్ట్‌గా ప్రొటెక్ట్ చేస్తుంది. పైగా ఇది ఎయిర్ ట్రావెల్ కూడా పూర్తిగా సేఫ్ అని కంపెనీ సర్టిఫై చేసింది.

Also Read: రూ.2వేలలోపు అమోలెడ్ డిస్‌ప్లే! 50%డిస్కౌంట్‌తో.. Redmi Watch Move

ధర:

షావోమి ఎప్పుడూ తన ప్రొడక్ట్స్‌ను బడ్జెట్ ఫ్రెండ్లీగా లాంచ్ చేస్తుంది. ఈ కాంపాక్ట్ పవర్‌బ్యాంక్ ధర కూడా జేబుకు అనుకూలంగానే ఉంది.

సాధారణ ధర: రూ.4,999

లాంచ్ ఆఫర్ ధర : ప్రస్తుతం Mi.com, ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలో ఇది ఏకంగా 58% భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ.2,099 కే అందుబాటులో ఉంది.

ఇది డార్క్ గ్రే (Dark Grey), ఐవీ గ్రీన్ (Ivy Green) అనే రెండు సూపర్ స్టైలిష్ మ్యాట్ ఫినిషింగ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిపై కంపెనీ 1 సంవత్సరం వారంటీ కూడా ఇస్తోంది.

మీరు తరచూ ప్రయాణాలు చేసే.. వారైతే లేదా ఆఫీస్ వర్క్ మీద బయట ఎక్కువగా తిరిగే వారైతే Xiaomi 20,000mAh Compact Power Bank మీకు బెస్ట్ ఛాయిస్. కేబుల్ ఇన్‌బిల్ట్‌గా రావడం, 22.5W స్పీడ్, పాకెట్ సైజ్ డిజైన్ దీనికి బిగ్ ప్లస్ పాయింట్స్. రూ.2,099 ధరలో 20,000mAh ప్రీమియం పవర్‌బ్యాంక్ దొరకడం సూపర్ లూట్ డీల్ అని చెప్పొచ్చు.

Related News

iPhone 18లో ఊహించని మార్పులు..చిన్నదైన డైనమిక్ ఐలాండ్, భారీగా ర్యామ్ పెరిగే ఛాన్స్!

ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షనా? బడ్జెట్‌లోనే.. పాకెట్ ఫ్రెండ్లీ పవర్ బ్యాంక్

ప్రతీ రోజూ 1.5GB డేటా ఇచ్చే.. రూ.330 లోపు జియో ప్లాన్స్.. ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్ ఫ్రీ!

6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్.. Vivo X300 FE కొత్త వేరియంట్ ధర, ఆఫర్ల పూర్తి వివరాలు!

BSNL బిగ్ ధమాకా ప్లాన్.. రూ. 319 కే 65 రోజుల వ్యాలిడిటీ.. ఇదేం ఆఫర్ బాబోయ్!

అమెజాన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న..హైయర్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ!

షాకింగ్ ప్రైస్ డ్రాప్.. ఏకంగా రూ.45,000 తగ్గిన Galaxy S25 Edge, ఆఫర్ ఎలా పొందాలంటే?

మార్కెట్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న ఇయర్‌బడ్స్..ఇప్పుడు ఆఫర్‌‌లో !

Big Stories

Advertisement
×