E-Paper
Advertisement

వారెవ్వా.. సింగిల్ ఛార్జ్‌తో 50 గంటలు నడిచే ఇయర్‌బడ్స్ తెచ్చిన వివో, ధర ఎంతంటే?

వారెవ్వా.. సింగిల్ ఛార్జ్‌తో 50 గంటలు నడిచే ఇయర్‌బడ్స్ తెచ్చిన వివో, ధర ఎంతంటే?
Advertisement

Vivo TWS 5 Pro: ప్రముఖ టెక్ సంస్థ వివో చైనా మార్కెట్లో సరికొత్త ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ ‘వివో టిడబ్ల్యూఎస్ 5 ప్రో’ (Vivo TWS 5 Pro)ను లాంచ్ చేసింది. అద్భుతమైన ఆడియో క్వాలిటీ, వవర్‌ఫుల్ బ్యాటరీ లైఫ్‌తో వచ్చిన ఈ ఇయర్‌బడ్స్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతానికి చైనాలో విడుదలైన ఈ సరికొత్త ఇయర్‌బడ్స్ ధర, వాటిలోని ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూసేద్దాం రండి..

ధర, కలర్ ఆప్షన్స్:

చైనా మార్కెట్లో వివో టిడబ్ల్యూఎస్ 5 ప్రో ధరను రూ.13,000గా నిర్ణయించారు. ఈ ఇయర్‌బడ్స్ ప్రస్తుతం సైలెంట్ రియల్మ్ బ్లాక్, ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

నాయిస్ క్యాన్సిలేషన్:

Advertisement

ఈ ఇయర్‌బడ్స్‌లో 11mm డైనమిక్ డ్రైవర్లను అందించారు. ఇవి 16Hz నుండి 60kHz వరకు ఫ్రీక్వెన్సీని సపోర్ట్ చేస్తాయి. దీనివల్ల పాటలు వినేటప్పుడు బేస్, ట్రెబుల్ చాలా క్లియర్‌గా వినిపిస్తాయి. ఇందులో ఉన్న స్పెషల్ బోన్-కండక్షన్ మైక్రోఫోన్ సహాయంతో ఏకంగా 60dB వరకు బయటి శబ్దాలను అడ్డుకోవచ్చు (ఆక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్). ఫోన్ మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల వచ్చే గోలను దాదాపు 100dB వరకు తగ్గించేలా దీని సాంకేతికతను రూపొందించారు.

Also Read: ఆఫర్ అంటే ఇది కదా.. Amazon SAleలో బ్రాండెడ్ స్మార్ట్ టీవీలపై 65% డిస్కౌంట్.. ఏ మోడల్ ఎంతంటే?

కనెక్టివిటీ, గేమింగ్ ఫీచర్లు:

Advertisement

వివో టిడబ్ల్యూఎస్ 5 ప్రో బ్లూటూత్ 5.4 కనెక్టివిటీతో పనిచేస్తుంది. వీటిని ఒకేసారి మూడు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే వెసులుబాటు ఉండటం విశేషం. గేమింగ్ ఇష్టపడే వారి కోసం దీనిలో కేవలం 42ms లో-లేటెన్సీని అందించారు. తద్వారా గేమ్ ఆడేటప్పుడు ఆడియో లాగ్ అవ్వదు. ఇక దుమ్ము, నీటి చినుకుల నుండి రక్షణ కోసం దీనికి ఐపీ54 (IP54) రేటింగ్ ఇచ్చారు.

వారెవ్వా అనిపించే బ్యాటరీ లైఫ్:

ఈ ఇయర్‌బడ్స్ బ్యాటరీ లైఫ్ విషయంలో నిజంగానే అదరగొట్టాయి. నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి వాడితే, కేవలం ఇయర్‌బడ్స్ మాత్రమే 11 గంటల ప్లేబ్యాక్ ఇస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 50 గంటల పాటు వాడుకోవచ్చు. ఒకవేళ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే సింగిల్ ఛార్జ్‌పై 6 గంటలు, కేస్‌తో కలిపి 24 గంటల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. టైప్-సి పోర్ట్ ద్వారా ఇయర్‌బడ్స్ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి దాదాపు 58 నిమిషాల సమయం పడుతుంది.

Also Read: జులైలో లాంచ్ కానున్న మోస్ట్ అవేటెడ్ మొబైల్స్.. Oppo Reno 16 నుంచి Vivo V80 వరకు అదరగొట్టే లిస్ట్ ఇదే!

Related News

మార్కెట్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న ఇయర్‌బడ్స్..ఇప్పుడు ఆఫర్‌‌లో !

Whatsapp Webలో అదిరిపోయే అప్‌డేట్.. ఇకపై బ్రౌజర్‌ నుంచే గ్రూప్ వీడియో కాల్స్!

ఫోన్ వెనుక మరో డిస్‌ప్లేనా? టెక్నో నుంచి మైండ్ బ్లోయింగ్ 5G ఫోన్.. లాంచ్ డేట్ ఫిక్స్!

కిచెన్ జిడ్డుకు గుడ్‌బై చెప్పండి! అమెజాన్‌లో.. మోస్ట్ ట్రెండింగ్‌ చిమ్నీలు!

డిస్ట్రాక్షన్ ఫ్రీ హెల్త్ ట్రాకర్.. భారత్‌లోకి వచ్చేస్తున్న Google Fitbit Air, రేటు ఎంతంటే?

యాపిల్ iPhone Ultra రాకముందే.. ఫోల్డబుల్ మార్కెట్‌పై గూగుల్, శాంసంగ్ కన్ను!

లక్షల డాలర్లు తగలేసి ఇదేం డిజైన్ రా బాబు? Instagram కొత్త లోగోపై ఏకిపారేస్తున్న నెటిజన్లు!

రీచార్జ్ బాదుడుకి BSNL చెక్.. రూపాయికే సిమ్, 412 రోజుల వ్యాలిడిటీ!

Big Stories

Advertisement
×