Samaira: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే.. రోహిత్ శర్మ కి మాస్ జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక రోహిత్ శర్మ స్పోర్ట్స్ మేనేజర్ గా వ్యవహరించిన రితికా సజ్దే తో ఆరేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలి 2015 డిసెంబర్ 13వ తేదీన ఆమెను పెళ్లి చేసుకున్నాడు. రితిక మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కి రాఖీ కడుతూ అన్నయ్య అంటూ ప్రేమగా పిలిచేది. అలా రితికపై రోహిత్ శర్మకు మంచి ఇంప్రెషన్ ఏర్పడింది.
Also Read: Mohammed Rizwan Haris Rauf: SRH ప్లేయర్ ను కెలికిన పాక్ క్రికెటర్లు.. మ్యాచ్ మధ్యలో గొడవ
ఆ తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్తా ప్రేమకు దారితీసి పెళ్లిదాకా వెళ్ళింది. ఇక ఈ జంటకు 2018 డిసెంబర్ 31 తేదీన కుమార్తె జన్మించింది. ఆమెకు “సమైరా” గా నామకరణం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 30 వ తేదీన రోహిత్ శర్మ గారాల పట్టి సమైరా {Samaira} ఆరవ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఇటీవల రోహిత్ శర్మ మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. రోహిత్ భార్య రితికా డిసెంబర్ 13వ తేదీన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కుమార్తె {Samaira} పుట్టిన ఆరు సంవత్సరాల తర్వాత కుమారుడు జన్మించడంతో వారసుడు వచ్చాడని రోహిత్ అభిమానులంతా సంబరాలు జరుపుకున్నారు.
ఇదిలా ఉంటే రోహిత్ శర్మ గారాల పట్టి సమీరా ముంబై ధీరుబాయ్ అంబానీ స్కూల్ లో డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. స్కూల్ వార్షిక దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలలో సమైరా {Samaira} పాల్గొంది. ఈ వేడుకలలో కిరాక్ స్టెప్పులతో అదరగొట్టింది. దీంతో ఈ వీడియోని రోహిత్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఐతే గత కొంతకాలంగా రోహిత్ శర్మ దారుణంగా విఫలం అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ లో రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా వరుసగా విఫలమవుతున్నాడు.
Also Read: Ravichandran Ashwin: అశ్విన్ రిటైర్మెంట్ పై తండ్రి సంచలన వ్యాఖ్యలు.. ఆ అవమానం వల్లే!
ఇక మూడవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో అవుట్ అయ్యాక రోహిత్ శర్మ చేసిన ఓ పని అతడి రిటైర్మెంట్ పై ఊహాగానాలకు తావిచ్చింది. తన గ్లౌజ్ ని డగౌట్ లోకి తీసుకు వెళ్ళలేదు. డగౌట్ ముందే వాటిని వదిలి వెళ్ళడంతో రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడేమోనని అభిమానులు సందేహం వ్యక్తం చేశారు. ఇలా దారుణంగా విఫలమవుతున్న రోహిత్ శర్మని జట్టులోకి తీసుకోవడాన్ని క్రికెట్ అభిమానులు తప్పుపడుతున్నారు. జట్టులో అతని స్థానాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక ముందైనా రోహిత్ శర్మ తన ఆట తీరుని మెరుగుపరుచుకుంటాడో..? లేక రిటైర్మెంట్ వైపు అడుగులు వేస్తాడో..? అనేది వేచి చూడాలి.
Princess Sammy’s dance in her school at Dhirubhai Ambani international during annual day function.🥹❤️😍
Our cutie growing up🥹🧿 pic.twitter.com/bR8q4bh0rL
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 19, 2024