Starlink Flight Wifi| ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, బిలయనీర్ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ ఇంటర్నెట్ వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు. మస్క్‌కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఇప్పటికే పలు దేశాల్లో విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తోంది. దీంత స్టార్ లింక్ భారతదేశంలో కూడా అడుగుపెట్టబోతోంది. ఈ క్రమంలో ఎలన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. 2 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో విమానంలో హై స్పీడ్ వైఫైని మస్క్ హైలైట్ చేశారు. వైఫైతో విమాన ప్రయాణికులు ఆన్ లైన్ గేమింగ్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
విమానంలో హై స్పీడ్ వైఫై కనెక్టివిటీ.. స్టార్ లింక్ నెట్ వర్క్‌తో సాధ్యమైందని.. ఇంటర్నెట్ స్పీడుగా ఉండడంతోనే ప్రయాణికులు రియల్ టైమ్ వీడియో గేమ్స్ ఆడుతున్నారని మస్క్ వీడియో చూపించారు.
ఈ వీడియోలో చూపినట్లు విమానంలో హై స్పీడు నెట్ వర్క్ అందుబాటులో ఉంటే ప్రయణికులు ఏ అడ్డంకి లేకుండా వీడియో కాల్స్, ఆన్ లైన్ మీటింగ్స్ లాంటివి ప్రయాణ సమయంలో సునాయాసంగా చేసుకోవచ్చు. మిగతా వైర్ బ్రాండ్‌బ్రాండ్ తో పోలిస్తే.. స్టార్ లింక్ ఇంటర్నెట్ స్పీడు 250Mbps to 300Mbps రేంజ్ లో ఉంటుంది.
Also Read: ఎడారిలో చిక్కుకున్నారా?.. భయమెందుకు స్పెషల్ ఊబర్ సవారీ మీ కోసం!
ఇండియాలో కూడా శాటిలైట్ బ్రాండ్‌బాండ్ ఇంటర్నెట్ సర్వీసు త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మేరకు భారత ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం స్టార్ లింక్ కంపెనీ ప్రక్రియలో ఉంది. ఇండియాలో శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ స్పెక్ట్రం కేటాయింపుల తరువాతే స్టార్ లింక్ కు అనుమతి లభించే అవకాశాలున్నాయని జాతీయ మీడియా రిపోర్ట్.
శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ రంగంలో ఎయిర్ టెల్ వన్‌వెబ్, జియో శాట్ కామ్, అమెజాన్ కుయిపర్ గా ఉన్నారు. ఈ కంపెనీలన్నీ భారత దేశ శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్ కోసం పోటీపడుతున్నాయి. అయితే వీటన్నికంటే ముందుగా స్టార్ లింక్ బ్రాడ్‌బ్యాండ్ 2025 సంవత్సరం ప్రథమార్థంలోనే కార్యకలాపాటు ప్రారంభయ్యే అవకాశాలున్నాయి.
అయితే ఇండియాలో కార్యకలాపాటు ప్రారంభించేందుకు స్టార్ లింక్ సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటోంది. భారత దేశ చట్టాల ప్రకారం కావాల్సిన కొన్ని కీలక డాకుమెంట్స్ స్టార్ లింక్ ఇంతవరకు సమర్పించలేదు. దీనివల్ల దేశంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు స్టార్ లింక్ కంపెనీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసి) ఆలస్యమవుతోంది. మరోవైపు ఎయిర్ టెల్, జియో సంస్థలు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి ఎన్ఓసి పొందాయి. ఈ రెండు కంపెనీలు ప్రస్తుతం స్పెక్ట్రమ్ కేటాయింపుల కోసం ఎదురుచూస్తున్నాయి.
అయితే అనధికారికంగా స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ని ఉక్రెయిన్ యుద్ధంలో, ఇండియాలోని మణిపూర్ లో ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు ఎలన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో హ్యాష్ ట్యాగ్స్ ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు. మస్క్ కు చెందిన గ్రోక్ ఏఐ చాట్ బాట్‌ని సోషల్ మీడియా ఎక్స్ లో ఇంటిగ్రేట్ చేశాక.. ఈ హ్యాష్ ట్యాగ్స్ విధానాన్ని రద్దు చేయాలనే మస్క్ భావిస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్స్ వల్ల చాలా పోస్ట్ లు అందరికీ చేరువకావడం లేదని విజిబులిటీ పై ప్రభావం పడుతోందని మస్క్ అభిప్రాయపడ్డారు.
Path of Exile 2, Arbiter of Ash.
Played over @Starlink in an airplane.
Starlink is so good that you can play real-time video games while airborne! pic.twitter.com/DEpRJYfU6y
— Elon Musk (@elonmusk) December 17, 2024