BigTV English
Advertisement

Youtube Begging: యూట్యూబ్‌లో బెగ్గింగ్.. ఆన్‌లైన్‌లో కొత్త మార్గంలో డబ్బు సంపాదిస్తున్న యాచకులు

Youtube Begging: యూట్యూబ్‌లో బెగ్గింగ్.. ఆన్‌లైన్‌లో కొత్త మార్గంలో డబ్బు సంపాదిస్తున్న యాచకులు

Youtube Begging| డిజిటల్ ఇండియా పథకం దేశంలో మంచి ఫలితాలిస్తోంది. భారతీయులను ఆన్‌లైన్‌లో అనుసంధానం చేసి, కార్యాలయాలకు వెళ్లకుండా సేవలను అందించే లక్ష్యంతో ప్రారంభమైన ఈ పథకం అద్భుత విజయం సాధించింది. దేశంలో 95 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ఇంటర్నెట్ ఖర్చు తక్కువ కావడంతో యూజర్ల సంఖ్య వేగంగా పెరిగింది. దీనివల్ల యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలపై కంటెంట్ క్రియేటర్లు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నారు. అయితే, ఇటీవల యూట్యూబ్‌లో ఒక వింత ధోరణి కనిపించింది. కొందరు భిక్షం అడుగుతూ ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదిస్తున్నారు.


సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’లో వైరల్ అయిన ఒక వీడియోలో, ఒక వ్యక్తి యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ.. తన యుపిఐ క్యూ ఆర్ (UPI QR) కోడ్‌ను ఫోకస్ చేస్తూ కనిపించాడు. అతను ఎలాంటి క్రియేటివ్ టాలెంట్ ప్రదర్శించలేదు. కేవలం ఆన్‌లైన్‌ వీడియోలో స్క్రీన్ ముందు ఉండడం ద్వారా ప్రేక్షకులు అతడికి డబ్బు పంపారు. ఇది ఇలాంటి ఒక్క ఘటనే కాదు, యూట్యూబ్ షార్ట్స్‌లో ఇలాంటి అనేక వీడియోలు ఉన్నాయి. అందులో కనిపించే వ్యక్తులు ఏ మాత్రం సృజనాత్మకత లేకుండానే డబ్బు సంపాదిస్తున్నారు.

ఈ వీడియోను ఒక ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా.. ఇతర యూజర్లు కామెంట్ల ద్వారా తమ అనుభవాలను పంచుకున్నారు. “ఇలాంటిది నేను చాలా కాలం క్రితం చూశాను. ఒక వ్యక్తి రోజంతా స్క్రీన్ ముందు కూర్చొని, ఇంటి అద్దె కోసం 50 రూపాయలు అడుగుతాడు. అతను రోజూ UPI ద్వారా 5,000 నుండి 10,000 రూపాయలు సేకరిస్తాడు,” అని ఒకరు వ్యాఖ్యానించారు.


“ఇలాంటి యూట్యూబ్ ఖాతాలు చాలా ఉన్నాయి. ఒకసారి 50 ఏళ్ల వ్యక్తి UPSC శిక్షణ కోసం ఇంటి అద్దె అడుగుతూ మీమ్‌లో చూశాను,” అని మరొకరు చెప్పారు.

“ఇది ఇంకా ప్రారంభమే. కొందరు UPSC శిక్షణ కోసం డొనేషన్లు అడుగుతారు. మరికొందరు మీ పేరును మెహందీతో రాస్తారు, లేదా స్కెచ్ పెన్నులతో స్టైలిష్‌గా పేర్లు రాస్తారు. కొత్తగా వీడియోలో ఏమీ చూపించకుండా.. భిక్షాటన చేస్తున్నారు.” అని మరొక వినియోగదారు రాశారు.

Also Read: పోలీస్ ఉద్యోగ పరీక్షల్లో భారీ స్కామ్.. ఆధార్ కార్డ్‌తో గుట్టు రట్టు

డిజిటల్ ఇండియా ఇంటర్నెట్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చినప్పటికీ, కొందరు ఈ అవకాశాన్ని విచిత్రంగా ఉపయోగిస్తున్నారు. దీనిపై నెటిజెన్లు ఆసక్తికరంగా చర్చ సాగిస్తున్నారు. యూట్యూబ్ వంటి మాధ్యమాలు.. క్రియేటివిటీ కోసం ఉద్దేశించబడినప్పటికీ, ఇప్పుడు భిక్షం అడగడం వంటి కొత్త మార్గాలకు వేదికగా మారుతున్నాయి. ఇంటర్నెట్ సౌలభ్యం ఈ ధోరణిని మరింత వేగవంతం చేసింది. ఈ విధానం ఎంతవరకు సమాజంపై ప్రభావం చూపుతుందో భవిష్యత్తులో తెలుస్తుంది.

Related News

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేయండి

Moto G Stylus 5G: స్టైలస్‌తో స్టైలిష్‌గా.. మోటరోలా మోటో జి స్టైలస్ 5జి స్పెషల్‌ ఫీచర్లు ఇవే

Nokia X 5G: మళ్లీ దుమ్మురేపేందుకు సిద్ధమైన నోకియా ఎక్స్ 5జి.. 6000mAh బ్యాటరీతో ఎంట్రీ..

Redmi K80 Pro 5G: అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న రెడ్మీ కె80 ప్రో అల్ట్రా 5జి.. ఇది నిజంగా గేమ్‌ ఛేంజర్‌ ఫోన్‌!

iQOO 13 Review: ఐక్యూ 13 టెక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. ఒక్క ఫోన్‌తో మొత్తం ట్రెండ్ మార్చేసింది

Samsung Galaxy S25 Ultra: టెక్ ప్రపంచాన్ని షేక్ చేసే మోడల్.. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా కొత్త ఫీచర్లు లీక్

Big Stories

×