YouTube Videos Remove: యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు సురక్షితమైన అనుభవాన్ని అందించేందుకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య 95 లక్షలకుపైగా ఉన్న వీడియోలను తొలగించింది. అయితే ఈ వీడియోలను తొలగించడానికి గల ప్రధాన కారణం కంటెంట్ నియమాల ఉల్లంఘన. వీడియోలను అప్‌లోడ్ చేసిన సృష్టికర్తలు YouTube కంటెంట్ విధానాలను ఉల్లంఘించటంతో, వాటిని తొలగించాల్సి వచ్చింది. వీటిలో వివాదాస్పద కంటెంట్, ద్వేషపూరిత ప్రసంగం, వేధింపులు, పుకార్లు, పిల్లలకు హానికరమైన వీడియోలు సహా మరికొన్ని ఉన్నాయి.
YouTube ప్రకటించిన ప్రకారం ఈ 9.5 మిలియన్ల వీడియోలలో ఎక్కువ భాగం భారతీయ సృష్టికర్తల ద్వారా అప్‌లోడ్ చేయబడినవే. ఆ క్రమంలో భారతదేశంలో 3 మిలియన్ల వీడియోలు తొలగించబడ్డాయి. దీని ప్రధాన కారణం, అవి YouTube కంటెంట్ విధానాలకు విరుద్ధంగా ఉండటం.
YouTube తమ ప్లాట్‌ఫారమ్‌ను మరింత సురక్షితంగా, పారదర్శకమైన ఉంచడం కోసం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ వీడియోలను తొలగించడానికి AI ఆధారిత గుర్తింపు వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా అనుమానాస్పద వీడియోలను ముందుగానే గుర్తించి, వాటిపై తక్షణ చర్యలు తీసుకుంటారు. ఈ విధానం వేగంగా, సమర్ధవంతంగా అవాంఛనీయ కంటెంట్‌ను తొలగించడంలో సహాయపడుతోంది.
YouTube నుంచి తొలగించిన 5 మిలియన్ల వీడియోలలో చాలా వాటిలో పిల్లలను చూపించే కంటెంట్ ఉంది. ఈ వీడియోల్లో పిల్లలపై ప్రమాదకరమైన విన్యాసాలు, వేధింపులు, అసభ్యకరమైన కంటెంట్ ఉండటం వల్ల తొలగించారు. పిల్లల విషయంలో యూట్యూబ్ కీలక నియమాలను పాటిస్తోంది.
Read Also: Gold Duty Free: దుబాయ్ నుంచి గోల్డ్ కొనుగోలు చేస్తే ఎంత సేవ్ చేసుకోవచ్చు.. లిమిట్ ఎంత..
ప్రస్తుతం కేవలం వీడియోలను మాత్రమే కాదు, YouTube ఏకంగా 4.8 మిలియన్ల (48 లక్షల) ఛానెల్‌లను కూడా తొలగించింది. ఈ ఛానెల్‌లు స్పామ్, మోసపూరిత కంటెంట్ సహా పలు విషయాలతో సంబంధం ఉన్నవి. YouTube ప్లాట్‌ఫారమ్‌లో ఒక ఛానెల్ తొలగించబడితే, ఆ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన అన్ని వీడియోలు కూడా తొలగించబడతాయి. ఈ క్రమంలో మొత్తం 5.4 మిలియన్ల (54 లక్షల) వీడియోలు తొలగించబడ్డాయి.
ఇలాంటి సమయంలో మీరు YouTubeలో వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు, కంటెంట్ విధానాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. YouTube నియమాలు, విధానాలకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ వల్ల, ఆ వీడియోలు తొలగించబడే అవకాశం ఉంది. ఈ క్రమంలో యూట్యూబర్లు కంటెంట్ నియమాలను ఇప్పటికైనా పాటించడం ద్వారా తమ ఛానెళ్లను కాపాడుకునే అవకాశం ఉంటుంది.
Read Also: Smart watch: బోట్ స్మార్ట్‌వాచ్ పై 85% తగ్గింపు ఆఫర్.. హార్ట్ ట్రాకింగ్ సహా కీలక ఫీచర్లు