Mohammed Siraj : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ దుమ్ము లేపాడు. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… టీమిండియాలో అవకాశం కోల్పోయిన మహమ్మద్ సిరాజ్… పడి లేచిన కెరటం లాగా ఎగిసిపడుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో అద్భుతంగా రాణిస్తున్నాడు మహమ్మద్ సిరాజ్. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య… ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో… మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
Also Read: PBKS Fan Angry: పంజాబ్ ప్లేయర్లను బండ బూతులు తిట్టిన లేడి.. వీడియో వైరల్..!
సన్రైజర్స్ ప్లేయర్లను ఏకంగా నలుగురిని అవుట్ చేశాడు మహమ్మద్ సిరాజ్. ఈ తరుణంలోనే నాలుగు ఓవర్లు వేసిన మహమ్మద్ సిరాజ్… నాలుగు వికెట్లు తీయడమే కాకుండా 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే… సన్రైజర్స్ హైదరాబాద్ పై నాలుగు వికెట్లు తీసిన మహమ్మద్ సిరాజ్… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోనే తన కెరీర్ బెస్ట్ సాధించాడు. ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ పైన బెస్ట్ బౌలింగ్ రికార్డు ఉండేది. ఆ జట్టు పైన నాలుగు ఓవర్లు వేసిన మహమ్మద్ సిరాజు… నాలుగు వికెట్లు తీసి 21 పరుగులు ఇచ్చాడు. అయితే తాజాగా హైదరాబాద్ పై.. నాలుగు వికెట్లు పడగొట్టి.. ఐపీఎల్ కెరీర్లో బెస్ట్ స్పెల్ ఖాతాలో వేసుకున్నాడు.
Also Read: SRH VS GT: బ్యాటింగ్ చేయనున్న SRH.. కాటేరమ్మ కొడుకులు ఉంటారో… పోతారో
ముంబై ఇండియన్స్ పైన రోహిత్ శర్మ, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఫిల్ సాల్ట్ ఇలాంటి డేంజర్ ఆటగాళ్లను ఈ టోర్నమెంట్లో పెవిలియన్ ku పంపాడు మహమ్మద్ సిరాజ్. గుజరాత్ టైటాన్స్ తరఫున ఇప్పటివరకు కేవలం మూడు మ్యాచ్లు ఆడాడు మహమ్మద్ సిరాజ్. ఈ మూడు మ్యాచ్ల్లోనే ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున… ఆడిన మహమ్మద్ సిరాజ్.. అప్పుడు 83 వికెట్లు తీశాడు. తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. అప్పుడు 10 వికెట్లు తీశాడు మహమ్మద్ సిరాజ్. దీంతో ఇండియన్ ప్రీమియర్ టోర్నమెంట్లో మొత్తం 100 వికెట్లు పడగొట్టి చరిత్ర పూటల్లోకి ఎక్కాడు మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ).
డాట్ బాల్స్ లో కూడా మహమ్మద్ సిరాజ్ రికార్డ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో పవర్ ప్లే సమయంలో కూడా ఎక్కువ డాట్ బాల్స్ వేసిన ఫాస్ట్ బౌలర్గా రికార్డు లోకి ఎక్కాడు మహమ్మద్ సిరాజ్. ఇప్పటివరకు పవర్ ప్లే లో 40 డాట్ బాల్స్ వేశాడు. మహమ్మద్ సిరాజ్ తర్వాత ఖలీల్ అహ్మద్ 39 డాట్ బాల్స్ వేయడం జరిగింది. ఆ తర్వాత మూడో స్థానంలో మొహమ్మద్ షమీ 30 డాడ్ బాల్స్ వేశాడు.
100 IPL wickets for Mohammed Siraj!🔥🏏 pic.twitter.com/046pbo420m
— CricketGully (@thecricketgully) April 6, 2025
Mohammad Siraj bowled his best spell in his IPL career today.
– SALUTE TO SIRAJ..!!! 🫡 pic.twitter.com/RMS2tgc2yS
— Tanuj (@ImTanujSingh) April 6, 2025