E-Paper
Advertisement

ఇంట్లోని ఏసీ సోలార్‌పై నడవాలంటే.. ఎన్ని ప్యానెళ్లు అవసరం? ఇదే అసలైన లెక్క!

ఇంట్లోని ఏసీ సోలార్‌పై నడవాలంటే.. ఎన్ని ప్యానెళ్లు అవసరం? ఇదే అసలైన లెక్క!
Advertisement

Solar Panels for AC: ఒకప్పుడు వేసవి కాలానికే పరిమితమైన ఏసీలను ప్రస్తుతం అన్ని వేళలా ప్రజలు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు లేక.. తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత సమ్మర్ ను తలపిస్తోంది. దీంతో చాలా మంది తిరిగి ఏసీలను ఆన్ చేస్తున్నారు. అయితే ఏసీ వాడకం పెరిగేకొద్దీ కరెంట్ బిల్లులు కూడా చుక్కలు చూపిస్తాయి. ఈ నేపథ్యంలో చాలా మంది సోలార్ ప్యానెళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అసలు ఒక ఏసీ నడవడానికి ఎన్ని సోలార్ ప్యానెళ్లు కావాలి? ఏసీ ఎంత విద్యుత్‌ను వినియోగిస్తుంది? ఏ బ్యాటరీ బెస్ట్? వంటి పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం.

ఏసీ ఎంత విద్యుత్‌ను వినియోగిస్తుంది?

సోలార్ వ్యవస్థను ఫిక్స్ చేసుకునేముందు ఏసీ ఎంత కరెంటు వాడుతుంతో తెలుసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఏసీ సామర్థ్యాన్ని ‘టన్లలో’ (Tons) కొలుస్తారు. 1 టన్ ఏసీకి.. గంటకు దాదాపు 1000 వాట్ల (1 kW) విద్యుత్ అవసరమవుతుంది. అదే 1.5 టన్ ఏసీకి గంటకు 1500-2000 వాట్లు, 2 టన్ ఏసీకి గంటకు 2000-2500 వాట్ల వరకు విద్యుత్ ఖర్చవుతుంది. అదే ఇన్వర్టర్ ఏసీలైతే సాధారణ ఏసీల కంటే తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయని చెప్పవచ్చు.

ఎన్ని సోలార్ ప్యానెళ్లు అవసరం?

Advertisement

సాధారణంగా ఒక 1.5 టన్ ఏసీని పగటిపూట నేరుగా సోలార్‌పై నడపాలంటే కనీసం 2.5 kW నుండి 3 kW సామర్థ్యం గల సోలార్ సిస్టమ్ అవసరం. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 400 వాట్ల (400W) ఆధునిక ప్యానెళ్లను లెక్కలోకి తీసుకుంటే.. 1 టన్ ఏసీ కోసం 4 నుండి 5 ప్యానెళ్లు 400W చొప్పున అవసరం. 1.5 టన్ ఏసీ కోసమైతే 6 నుండి 8 ప్యానెళ్లు అవసరమవుతాయి. 2 టన్ ఏసీ కోసం 9 నుండి 11 ప్యానెళ్ల వరకు అమర్చాల్సి ఉంటుంది.

రోజువారీ వాడకం కీలకం?

అయితే ఏసీని రోజుకు ఎన్ని గంటలు వాడుతున్నారనేది కూడా సోనాల్ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. పగటిపూట మాత్రమే ఏసీ వాడే వారికైతే ఆన్-గ్రిడ్ (On-Grid) సోలార్ సిస్టమ్ సరిపోతుంది. దీనివల్ల పగలు తయారయ్యే విద్యుత్ నేరుగా ఏసీకి అందుతుంది. ఒకవేళ మీరు రాత్రిపూట కూడా 7-8 గంటల పాటు ఏసీని ఉపయోగించాలనుకుంటే పగటిపూట ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నిల్వ ఉంచుకోవడానికి అదనపు ప్యానెళ్లతో పాటు పెద్ద బ్యాటరీ బ్యాకప్ అవసరమవుతుంది.

ఏ సోలార్ ప్యానెల్ బెస్ట్?

Advertisement

ప్రస్తుతం మార్కెట్లో మోనోక్రిస్టలైన్, హాఫ్ కట్ ట్యాప్‌కాన్ సోలార్ ప్యానెళ్లు లభిస్తున్నాయి. ఇవి ఏసీల వాడకానికి బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇవి తక్కువ స్పేస్ లో ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు, ఎండ తక్కువగా ఉన్నప్పుడు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయని పేర్కొంటున్నారు.

Also Read: కరెంట్ ఉండదు.. బ్యాటరీతో పనిలేదు.. కానీ ఈ ‘మాయా దీపాలు’ ఎలా వెలుగుతాయి?

బ్యాటరీ బ్యాకప్.. ఏది బెటర్?

రాత్రిపూట ఏసీని నడపడానికి, విద్యుత్ కోతలు ఉన్నప్పుడు బ్యాకప్ కోసం లిథియం-అయాన్, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలు బెస్ట్ ఛాయిస్ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి సాంప్రదాయ లెడ్-యాసిడ్, ట్యూబులర్ బ్యాటరీల కంటే వేగంగా ఛార్జ్ అవుతాయని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ కాలంపాటు మన్నికగా కూడా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ఒక 1.5 టన్ ఏసీ రాత్రిపూట నడవాలంటే సమర్థవంతంగా పనిచేయాలంటే కనీసం 5kW నుండి 10kW సామర్థ్యం గల లిథియం బ్యాటరీ అవసరమవుతుందని నిపుణులు వివరిస్తున్నారు.

Also Read: బరువు సగం.. బలం డబుల్.. సౌర విద్యుత్ రంగంలో ‘తేనెపట్టు’ మ్యాజిక్!

Related News

రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!

క్షణాల్లోనే ఈజీగా కేకులు,పిజ్జాలు రెడీ.. పిజియన్ ఓటీజీ స్పెషల్స్ ఇవే!

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

Big Stories

Advertisement
×