E-Paper
Advertisement

బ్రేకప్ చెప్పిన ప్రియుడికి నరకం చూపించే అమ్మాయి… కామెడీతో కేకలు పెట్టిస్తున్న సినిమా

బ్రేకప్ చెప్పిన ప్రియుడికి నరకం చూపించే అమ్మాయి… కామెడీతో కేకలు పెట్టిస్తున్న సినిమా
Advertisement

Romantic Comedy OTT : వెరైటీ సినిమాలు ఇష్టపడే వాళ్ళకు ఒక అదిరిపోయే హాలీవుడ్ మూవీ ఓటీటీలో ఉంది. గత ఏడాది వచ్చిన ఈ సినిమా కామెడీతో ఆకట్టుకుంది. ఇది ఒక మోడరన్ డేటింగ్ రిలేషన్షిప్‌లోని పిచ్చితనాన్ని వెటకారంగా చూపిస్తుంది. సినిమా అంతా ఒకే లొకేషన్‌లో సాగుతూ వింతైన అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా షూటింగ్ కేవలం కొద్ది రోజుల్లోనే, తక్కువ బడ్జెట్‌తో పూర్తి చేశారు. సినిమాలోని డైలాగులు కూడా చాలా నేచరల్ గా, నేటి యువత మాట్లాడుకునే భాషలో ఉంటాయి. ఒక ప్రేమ జంట వీకెండ్ ట్రిప్‌కు వెళ్ళక కథ మొదలవుతుంది. బ్రేకప్ చెప్పాలనుకునే ప్రియుడికి, ప్రియురాలు చుక్కలు చూపిస్తుంది. సినిమా అంతా కామెడీతో చాలా సరదాగా సాగుతుంది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ అమెరికన్ డార్క్ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘ఓ, హాయ్!’ (Oh, Hi!). 2025లో వచ్చిన ఈ సినిమాకు సోఫీ బ్రూక్స్ దర్శకత్వం వహించగా, ఈ చిత్రంలో మోలీ గోర్డాన్, లోగాన్ లెర్మాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో మోలీ గోర్డాన్ నటన మాత్రం అదిరిపోతుంది. ప్రేమ కోసం ఎంతకైనా తెగించే సైకో ప్రేమికురాలిగా ఆమె పండించిన కామెడీ, ఎమోషన్స్ హైలైట్. ఇక లోగాన్ లెర్మాన్ భయపడుతూ, బందీగా ఉండి చేసే యాక్టింగ్ కూడా బాగుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియో (Prime Video), ఆపిల్ టీవీ (Apple TV)లలో రెంటల్ పద్దతిలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఐరిస్ అనే అమ్మాయికి ఐజాక్ అనే యువకుడు అంటే పిచ్చి ప్రేమ. వీళ్లిద్దరూ కలిసి ఒక రొమాంటిక్ వీకెండ్ కోసం ఒక ఊరికి వెళ్తారు. ఐరిస్ ఏమనుకుంటుందంటే, ఐజాక్ తనకి ప్రపోజ్ చేస్తాడని, జీవితాంతం కలిసుంటామని తెగ కలలు కనేస్తుంది. తీరా అక్కడికి వెళ్ళాక అతను మెల్లగా నోరు విప్పి, నువ్వంటే నాకు ఇష్టమే కానీ, పెళ్లి గిల్లి అంటే నాకు పడదు, మనం జస్ట్ క్యాజువల్ ఫ్రెండ్స్‌లా ఉందాం అని బాంబు పేలుస్తాడు. వాడి మాటలు వినగానే ఐరిస్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. నేనేమో నీకోసం ఇంత చేస్తుంటే, నువ్వు నన్ను వదిలేస్తావా అని పీక్స్ రేంజ్ లో కోపం వస్తుంది. అంతే ఇంక ఆలస్యం చేయకుండా వాడిని గదిలో బంధించేసి, చేతులకి బేడీలు వేసేస్తుంది. నువ్వు నా ప్రేమను ఒప్పుకునే వరకు నిన్ను ఇక్కడి నుండి కదలనివ్వను అంటూ ఐజాక్ ను టార్చర్ పెట్టడం స్టార్ట్ చేస్తుంది. వాడు భయపడి చస్తుంటే, ఈమె మాత్రం వాడిని తన దారికి తెచ్చుకోవడానికి రకరకాల ప్లాన్లు వేస్తుంది.

ఆ తర్వాత కథ అంతా ఒక వింత కామెడీగా మారుతుంది. ఐరిస్ తన ఫ్రెండ్స్‌ని కూడా అక్కడికి పిలుస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళ మధ్య జరిగే గొడవలు, డార్క్ కామెడీ సీన్లు భలే నవ్విస్తాయి. ఐరిస్ తన ప్రేమను గెలవడానికి చేసే పిచ్చి పనులు, ఐజాక్ అక్కడి నుండి తప్పించుకోవడానికి పడే పాట్లు చూస్తుంటే ప్రేమ ఇంత డేంజరా అనిపిస్తుంది. చివరికి ఆ గొడవ ఎలా సెటిల్ అయ్యింది ? ఐజాక్ ఈమె ప్రేమను ఒప్పుకున్నాడా ? అనే విషయాలను మాత్రం ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also :  ఫార్మా కంపెనీల మాయ… లెక్కే లేని పేదోడి ప్రాణం… దిమ్మ తిరిగే దారుణాలు

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×