AIR Webseries: ఇండస్ట్రీలో రకరకాల కథాంశాలతో సినిమాలు వస్తున్నాయి. సినిమాలతో పాటు ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువైన సంగతి తెలిసిందే. క్రైమ్, కామెడీ అలాగే లవ్ ట్రాక్, హారర్, సస్పెన్స్ ఉన్న వెబ్ సిరీస్ కు ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి తగ్గట్టుగానే వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వచ్చిన వెబ్ సిరీస్ AIR. ఆల్ ఇండియా ర్యాంకర్స్ పేరుతో తాజాగా రిలీజ్ అయిన వెబ్ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆల్ ఇండియా ర్యాంకర్స్
రెండు రోజుల కిందట విడుదలైన ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్.. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ మొత్తం ఇంటర్మీడియట్ విద్యార్థుల చుట్టూ.. కొనసాగుతోంది. ఇంటర్మీడియట్ జీవితంలో విద్యార్థులు ఎలా ముందుకు వెళ్తారు.. వాళ్లు అక్కడ నేర్చుకునే విషయాలు.. తప్పటడుగులు… ఇతర అంశాల చుట్టూనే ఈ సినిమాను రూపొందించారు. దాదాపుగా మన రియల్ లైఫ్ లో జరిగిన అంశాలను ఇందులో అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు జోసెఫ్. 2012 సంవత్సరంలో జరుగుతున్నట్లుగానే ఈ వెబ్ సిరీస్ రూపొందించారు. పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ఇంటర్మీడియట్ వెళ్లిన తర్వాత విద్యార్థులు ఎలాంటి అంశాలు నేర్చుకుంటారు.. అలాగే విద్యార్థులు ఎలా చదువుతారు.. తమ పిల్లలు ర్యాంకులు ఎలా కొట్టాలి అని తల్లిదండ్రులు అనుకోవడం.. ఇలా ఏడు ఎపిసోడ్ లలో.. సినిమాను చిత్రీకరించారు.
AIR వెబ్ సిరీస్ లో చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంటే చాలామందికి ఇష్టం అన్న సంగతి తెలిసిందే. దీనికి ముఖ్య కారణం మహేంద్రసింగ్ ధోని. అయితే AIR వెబ్ సిరీస్ లో ఓ కుర్రాడు చెప్పే డైలాగ్.. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది. కాలేజీలో తన స్నేహితులందరికీ.. ఓ కుర్రాడు దాదాపు మూడు నిమిషాల పాటు మోటివేషనల్ స్పీచ్ ప్రయత్నం చేస్తాడు. ఇందులో… మనమందరం పసుపు సైన్యంలో ముందుకు వెళ్లాలని చెబుతాడు.
చిన్న ఫంక్షన్ అయినా.. ప్లేస్ ఎక్కడైనా… ఎవరు ఉన్నా లేకున్నా… పసుపు జెండా ఎగరాల్సిందే అంటూ ఈ సీన్ లో సదరు కుర్రాడు చెబుతాడు. దీంతో… ఎల్లో కలర్ అనే వ్యాఖ్య బయటకు…. రావడంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు.. తెగ పోస్టులు పెడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఉద్దేశించి దర్శకుడు ఆ డైలాగ్ పెట్టి ఉంటాడని.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే ఆస్ట్రేలియా టీం జెర్సీ కూడా ఎల్లో కలర్ అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జండా కలర్ కూడా పసుపు రంగు అన్న సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ కార్యకర్తలు కూడా ఇదే అంశాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వెబ్ సిరీస్ అందరినీ.. కదిలించిందని చెప్పవచ్చు.
C
How
DareMaa Side Main Gaa Krishna/Guntur Districts Few Colleges lo Jarigina Vishyalane Kallaki Kattanattu Chupinchina Director & Mee Team Ki @SandeepRaaaj Bro 🙏👏#Air#AironEtvwin pic.twitter.com/YTewuw6ltC
— gupta (@guptanagu8) July 5, 2025