BigTV English

Nitish Rana : నితీష్ రాణా అరాచకం.. 42 బంతుల్లోనే సెంచరీ.. 15 సిక్సర్లు బాదాడు

Nitish Rana : నితీష్ రాణా అరాచకం..  42 బంతుల్లోనే సెంచరీ.. 15 సిక్సర్లు బాదాడు

Nitish Rana : ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే లీగ్ లో భాగంగా వెస్ట్ ఢిల్లీ లయన్స్ కెప్టెన్ నితీశ్ రాణా సిక్సర్ల పిడుగుల మెరిశాడు. ముఖ్యంగా సౌత్ ఢిల్లీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నితీశ్ రాణా 42 బంతుల్లోనే సెంచరీ బాదాడు. మొత్తానికి  55 బంతుల్లో 15 సిక్సర్లు, 8 ఫోర్లతో 134 పరుగులు చేశాడు. నితీశ్ ఊచకోత కోయడంతో వెస్ట్ ఢిల్లీ జట్టు 202 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్ లోనే ఛేదించింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన సౌత్ ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. నితీశ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో వెస్ట్ ఢిల్లీ లయన్స్ కి విజయం సునాయసం అయింది. ఈ విజయంతో క్వాలిఫయర్ 2 కి దూసుకెళ్లింది వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు. ఇవాళ క్వాలిఫయర్ 2లో ఈస్ట్ ఢిల్లీ రైడర్ తో తలపడనుంది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఈ సారి అత్యంత రసవత్తరంగా మారనుంది.


Also Read :  Harbhajan- Sreesanth : హర్భజన్, శ్రీశాంత్ మధ్య పుల్ల పెట్టిన లలిత్ మోడీ.. 18 ఏళ్ల గాయాన్ని తెరపైకి తీసుకువచ్చి

నితీశ్-దిగ్వేష్ మధ్య వివాదం.. 


ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో అరుణ్ జైట్లీ స్టేడియయం వేదికగా  జరిగిన ఎలిమినేటర్  మ్యాచ్ లో నితీశ్ రాణా, దిగ్వేశ్ రతి తీవ్రంగా గొడవ పడ్డారు. నితీశ్ రాణా బ్యాటింగ్ చేస్తుండగా.. దిగ్వేష్ బాల్ వేయబోయి ఆగిపోయాడు. అందుకు కౌంటర్ గా తరువాత బంతిని నితీశ్ మధ్యలో ఆపేశాడు. ఆ తరువాత బంతిని బౌండరీ బాది బ్యాట్ కి కిస్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఒకరి పైకి ఒకరు దూసుకెళ్లారు. ఇక అంపైర్లు, మిగతా ఆటగాళ్లు కలుగ జేసుకోవడంతో కాస్త శాంతించారు. ఈ మ్యాచ్ లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ పై 7 వికెట్ల తేడాతో వెస్ట్ ఢిల్లీ గెలుపొందింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

నితీశ్ విధ్వంసకర సెంచరీ.. 

ఇక సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్ బ్యాటర్లలో అన్మోల్ శర్మ (55), తేజస్వి దహియా (60) అర్ద సెంచరీలు చేశారు. సుమిత్ మాథుర్ 48 పరుగులతో చివర్లో మెరుపు ఇన్నంగ్స్ ఆడాడు. వెస్ట్ ఢిల్లీ బౌలర్లలో హృతిక్ షోకీన్ 2 వికెట్లు తీశాడు. శుబమ్ దూబె, శివాంక్, అనిరుద్ చౌదరీ తలో వికెట్ సాధించారు. 202 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్ట్ ఢిల్లీ 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలోనే వెస్ట్ ఢిల్లీ కెప్టెన్ నితీశ్ రాణా విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్ల పై నితీశ్ రాణా ఎదురుదాడికి దిగాడు. రాణా కేవలం 42 బంతుల్లోనే తన సెంచరీ చేశాడు. ఓవరాల్ గా 55 బంతులు ఆడిన నితీశ్.. 15 సిక్స్ లు,, 8 ఫోర్ల సాయంతో 134 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  మరోవైపు  ఈ మ్యాచ్ లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. 

Related News

Tesla – Team India : టీమిండియా స్పాన్సర్ గా టెస్లా… రంగంలోకి ఎలాన్ మాస్క్ ?

RCB: ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు.. చిన్న స్వామి ఘటనపై RCB మరో షాకింగ్ పోస్ట్

Shami Wife Hasin: ‘పిచ్చి కుక్కలు’ అంటూ షమీ మాజీ భార్య వివాదాస్పద పోస్ట్

Sreesanth wife : మీకు కొంచెం కూడా సిగ్గులేదు… లలిత్ మోడీని కడిగిపారేసిన శ్రీశాంత్ భార్య.. 18 ఏళ్ళ గాయం అంటూ

Nitish – Digvesh : దిగ్వేష్ కు నరకం చూపించిన నితీష్ రాణా.. ఇది మామూలు ర్యాగింగ్ కాదు.. వీడియో చూస్తే పైసా వసూలే

Big Stories

×