Harbhajan Sreesanth : సాధారణంగా క్రికెట్ లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కొంత మంది ఆటగాళ్లు చాలా ఫ్రెండ్లీగా ఉంటే.. మరికొందరూ ఆటగాళ్లు శత్రువుల్లా ప్రవర్తిస్తారు. ఇక ఐపీఎల్ లో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. వేర్వేరు టీమ్ ఆటగాళ్లు ఉప్పు-నిప్పులా వ్యవహరించారు. ముఖ్యంగా తొలి ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ బౌలర్ శ్రీశాంత్ ను ముంబై ఇండియన్స్ బౌలర్ హర్భజన్ సింగ్ చెంప దెబ్బ కొట్టడం తెలిసిందే. అయితే దాదాపు 18 సంవత్సరాల తరువాత ఈ Raw Footage ని ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోడీ రిలీజ్ చేశారు. బియాండ్23 క్రికెట్ పోడ్ కాస్ట్ లో ఆయన ఈ విషయం చెప్పారు. ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఫుటేజీ ఎవరి వద్దా లేదని.. ఇది తన సెక్యూరిటీ కెమెరాలో రికార్డు అయినట్టు తెలిపారు. శ్రీశాంత్ ను కొట్టడం పై హర్భజన్ చాలా సార్లు క్షమాపణలు చెప్పారు.
Also Read : ICC – Google : మహిళల క్రికెట్ కోసం రంగంలోకి గూగుల్… జై షాతో పెద్ద డీలింగే
హర్భజన్- శ్రీశాంత్ ఘటనతో క్రికెట్ ప్రపంచ ఆశ్చర్యం..
ఐపీఎల్ తొలి సీజన్ 2008 లో టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్-శ్రీశాంత్ మధ్య జరిగినటువంటి ఓ సంఘటన క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి. ప్రధానంగా గ్రౌండ్ లోనే హర్భజన్.. శ్రీశాంత్ ను చెంప దెబ్బ కొట్టడం అప్పట్లో పెను సంచలనమే సృష్టించింది. వీరిద్దరూ అప్పుడూ గొడవ పెట్టుకున్నప్పటికీ అది మరిచిపోయి మళ్లీ కలిసి పోయారు కూడా. అయితే ఈ వివాదాన్ని తాజాగా ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ గుర్తు చేశాడు. అంతేకాదు.. అప్పటి సంఘటన వీడియో ను రివీల్ చేశాడు. ” వాస్తవానికి మ్యాచ్ పూర్తయిన తరువాత ఆటగాళ్లు అంతా కరాచలనం చేసుకుంటూ పోయారు. అదే సమయంలో శ్రీశాంత్ ను చెంప దెబ్బ కొట్టినందుకు హర్భజన్ కి ఎనిమిది మ్యాచ్ లు ఆడకుండా నిషేదం విధించారు.
18 ఏళ్ల తరువాత ఒరిజినల్ వీడియో రివీల్..
ఈ సంఘటన జరిగి దాదాపు 18 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి ఐపీఎల్ క్రికెట్ లో ఇలాంటి తప్పు చేయాలంటే హర్భజన్ కి పడిన శిక్ష గుర్తుంచుకుంటారు” అని లలిత్ మోడీ వెల్లడించారు. వాస్తవానికి ఇది జరిగి 18 సంవత్సరాలు అవుతున్నా.. దీనికి సంబంధించిన ఒరిజినల్ వీడియో మాత్రం ఇప్పటివరకు బయటికి రాలేదు. అయితే అప్పట్లో శ్రీశాంత్ కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోలు మాత్రం బయటికి వచ్చాయి. అప్పట్లో టీవీల్లో కూడా ఈ వివాదానికి సంబంధించిన వీడియో టెలికాస్ట్ చేయలేదు. దీంతో తాజాగా లలిత్ మోడీ తాజాగా వీడియో రివిల్ చేయడంతో ఈ టాపిక్ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయంలో తాను ఇప్పటికీ చాలా సార్లు క్షమాపణలు చెప్పానని పలుమార్లు చెప్పుకొచ్చాడు హర్భజన్ సింగ్. ఇక ఇటీవల మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడిన హర్భజన్ సింగ్ ఆ ఘటనను మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఓ సమయంలో శ్రీశాంత్ కుమార్తె తన తండ్రిని కొట్టిన విషయం గురించి మాట్లాడిందని హర్భజన్ చెప్పాడు. ఆ మాటలు ఇప్పటికీ మరిచిపోలేదని తెలిపాడు.
https://twitter.com/SijuMoothedath/status/1961381725004513317