Aamir Khan : భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ 2021లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ఏప్రిల్ ఈ జంటకు పాప జన్మించింది. పెళ్లి అయిన నాలుగేళ్ల తరువాత వీరికి బిడ్డ పుట్టింది. అయితే తాజాగా వీరి కుమార్తె కి నామకరణ వేడుక నిర్వహించారు. ఈ వేడుక కి బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ హాజరై నామకరణం చేశారు. ఇక ఈ సందర్భంగా గుత్తా జ్వాల ఎమోషనల్ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక గా పంచుకున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హైదరాబాద్ వచ్చి మరీ వారి పాప కి “మిరా” అని పేరు పెట్టారు. మిరా అంటే.. ప్రేమ, శాంతి అని అర్థం.
Also Read : CM Revanth : రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కపిల్ దేవ్ భారీ డీల్ !
పెళ్లి.. పాప.. ఒకేరోజు
దీంతో నటుడు విష్ణు విశాల్ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. “అమీర్ ఖాన్ సార్ మీతో ప్రయాణం మాకు ప్రత్యేకం. మా పాపకు అద్భుతమైన పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు” అని విశాల్ పోస్ట్ చేశారు. 2021 ఏప్రిల్ 22న వీరు వివాహం చేసుకోగా.. వారికి ఏప్రిల్ 22, 2025న పాప పుట్టడం విశేషం. వీరి పెళ్లి రోజు.. వీరి పాప పుట్టిన రోజు ఒకటే కావడం గమనార్హం. FIR, లాల్ సలామ్ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు విష్ణు విశాల్. సితారే జమీన్ పర్ విజయోత్సాహంలో ఉన్న అమీర్ ఇటీవలే హైదరాబాద్ కి వచ్చారు. శనివారం రోజు నందిగామలోని శాంతి వనాన్ని సందర్శించిన ఆయన.. ఆదివారం విష్ణు విశాల్-గుత్తా జ్వాల ఫ్యామిలీని కలిశారు. వీరి కుటుంబంతో అమీర్ ఖాన్ కి మంచి అనుబంధం ఉంది. గతంలో తన తల్లికి చికిత్స చేయించే క్రమంలో అమీర్ ఖాన్.. విష్ణు విశాల్ ఇంట్లో కొద్ది రోజులు ఉన్నట్టు కోలీవుడ్ లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అమీర్ కి విష్ణు హెల్ప్..
వాస్తవానికి అమీర్ ఖాన్ తల్లి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటంతో ట్రీట్ మెంట్ తీసుకోవడం కోసం 2023లో చెన్నై కి వచ్చారు. ఇక ఆ సమయంలో తీవ్రమైన సైక్లోన్ మిచౌంగ్ చెన్నై పట్టణాన్ని ముంచెత్తింది. దీంతో పలు ప్రాంతాలు వరదల్లో నీటిలో మునిగాయి. అమీర్ ఖాన్ తల్లితో కారపాక్కం అనే ఏరియాలో బస చేశాడు. అతను స్టే చేసిన ఇల్లు విష్ణు ఇంటి పక్కనే ఉంది. ఆ ఇంట్లోకి కూడా నీళ్లు రావడంతో హీరో విష్ణు రెస్క్యూ టీమ్ కి కాల్ చేసి బోట్లను వారిని బయటకు తీసుకొచ్చి కాపాడాడు. ఇక ఆ తరువాత వారింట్లో బస ఏర్పాటు చేసాడు. చెన్నై లో పరిస్థితి నార్మల్ అయ్యేంత వరకు అమీర్ ఖాన్ తో పాటు ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ల అమ్మను కూడా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇక ఆ తరువాత కొద్ది రోజులకు అమీర్ ఖాన్ ఈ విషయాలను మీడియా కి కూడా వివరించాడు.