BigTV English

OTT Movie : అబ్బాయిలని చూడగానే ఆ పార్ట్ సైజ్ చెప్పే టెక్నాలజీ… ఇలాంటి మూవీని ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : అబ్బాయిలని చూడగానే ఆ పార్ట్ సైజ్ చెప్పే టెక్నాలజీ… ఇలాంటి మూవీని ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : సై-ఫై సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఈ జానర్లో వచ్చే సినిమాలలో ఉండే విజువల్ వండర్స్ ను కలలో కూడా ఊహించడం కష్టమే. అందుకే కొంతమంది పిచ్చిగా ఇలాంటి సినిమాలను ఇష్టపడతారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమెరికన్ సైన్స్-ఫిక్షన్ డ్రామా సిరీస్ భవిష్యత్తులో డిజిటల్ ఆఫ్టర్‌లైఫ్‌లో జరిగే ఒక ఆసక్తికరమైన మిస్టరీతో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఈ సిరీస్ వినూత్నమైన కథాంశం, టెక్నాలజీ, కామెడీ, థ్రిల్లింగ్ కథనంతో ఆకట్టుకుంటుంది. ఒక యంగ్ ఇంజనీర్ తన మరణం వెనుక రహస్యాన్ని వెలికితీసే ప్రయత్నం ఒక అద్భుతమైన థ్రిల్‌ను అందిస్తుంది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే…
ఈ సిరీస్ కథ మొత్తం 2033లో జరుగుతుంది. ఇక్కడ టెక్నాలజీ అభివృద్ధి చెంది, మరణించిన వారు తమను డిజిటల్ ఆఫ్టర్‌లైఫ్‌లో “అప్‌లోడ్” చేసుకోవచ్చు. నాథన్ బ్రౌన్ (రాబీ అమెల్) అనే కంప్యూటర్ ఇంజనీర్, ఒక కారు ప్రమాదంలో మరణిస్తాడు. అతని రిచ్ స్నేహితురాలు ఇంగ్రిడ్ (అలెగ్రా ఎడ్వర్డ్స్) అతనిని లగ్జరీ డిజిటల్ ఆఫ్టర్‌లైఫ్ అయిన “లేక్‌వ్యూ”లో అప్‌లోడ్ చేస్తుంది. లేక్‌వ్యూలో నాథన్‌కు నోరా (ఆండీ ఆల్లో) అనే కస్టమర్ సర్వీస్ “ఏంజెల్” సహాయం చేస్తుంది. అతను ఈ వర్చువల్ ప్రపంచంలో ఎలాగోలా సర్దుకుంటాడు. చచ్చినా బతకడం అంటే ఇదేనేమో.

ఇక నాథన్ తన మరణం ఒక సాధారణ ప్రమాదం కాదని, దాని వెనుక ఒక కుట్ర ఉందని అనుమానిస్తాడు. నోరాతో కలిసి అతను తన మరణానికి సంబంధించిన రహస్యాలను వెలికితీసే ప్రయత్నంలో, డిజిటల్ – రియల్ ప్రపంచాల మధ్య ఉన్న కుట్రను ఛేదిస్తాడు. ఇంతకీ ఆ కుట్ర ఏంటి? నాథన్ కు జరిగిన ప్రమాదం వెనుక ఉన్నది ఎవరు? అసలు ఈ డిజిటల్ – రియల్ ప్రపంచాల మధ్య ఏం జరుగుతోంది? అనే విషయాలను తెలుసుకోవాలంటే మూవీని చూడాల్సిందే.


Read Also : చిన్న క్లూ కూడా వదలకుండా హత్యలు… వీడి తెలివికి దండంరా బాబూ… గ్రిప్పింగ్ కొరియన్ క్రైమ్ డ్రామా

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ మైండ్ బెండయ్యే థ్రిల్లర్ మూవీ పేరు ‘అప్‌లోడ్’ (Upload). 2020లో గ్రెగ్ డేనియల్స్ సృష్టించిన ఈ అమెరికన్ సైన్స్-ఫిక్షన్ డ్రామా సిరీస్. ఇందులో రాబీ అమెల్, ఆండీ ఆల్లో, అలెగ్రా ఎడ్వర్డ్స్, జైనబ్ జాన్సన్, కెవిన్ బిగ్లీ తదితరులు నటించారు. సీజన్ 1లో 10 ఎపిసోడ్‌లు (ఒక్కో ఎపిసోడ్ 24-32 నిమిషాలు) ఉన్నాయి. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video) లో విడుదలై, ఇంగ్లీష్ భాషలో హిందీ సబ్‌ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. ఒకవేళ సై-ఫై సినిమాలంటే పిచ్చి పిచ్చిగా చూసేవారు ఈ సినిమాపై వెంటనే ఓ లుక్కేయండి.

Related News

Coolie OTT: రజినీకాంత్ కూలీ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే!

OTT Movie : ఇదెక్కడి సినిమారా బాబూ… మొక్కలకు ప్రాణం వచ్చి మనుషుల్ని లేపేస్తే… సై -ఫై మాస్టర్ పీస్ థ్రిల్లర్

OTT Movie : 30 ఏళ్ల ఆంటీతో 23 ఏళ్ల కుర్రాడు… పెళ్ళైనా వదలకుండా… సింగిల్స్ డోంట్ మిస్

OTT Movie : తెల్లార్లూ అదే పని… ప్రతి రాత్రి ఒంటరిగా ఆ గదికి… ఏం చేస్తుందో తెలిస్తే ఫ్యూజులు అవుట్

OTT Movie : టీనేజ్ కుర్రాడికి ఇద్దరమ్మాయిల ఓపెన్ ఆఫర్… అందంగా ఉన్నారని సొల్లు కారిస్తే మైండ్ బెండయ్యే ట్విస్ట్

OTT Movie : ఓరి దీని వేషాలో… ఈ అమ్మాయేంటి భయ్యా ఇంత వయోలెంట్ గా ఉంది… పొరపాటున ముట్టుకుంటే మసే

Big Stories

×