BigTV English
Advertisement

Aaron Jones: అందుకే ఓడిపోయాం.. అమెరికా కెప్టెన్ ఆరోన్ జోన్స్

Aaron Jones: అందుకే ఓడిపోయాం.. అమెరికా కెప్టెన్ ఆరోన్ జోన్స్

Aaron Jones Reacts after losing the South Africa vs USA Match T20 WC 2024 Super 8: టీ 20 ప్రపంచకప్ లో తొలి సూపర్ 8 మ్యాచ్ లో అమెరికా పోరాడి ఓడింది. సౌతాఫ్రికాను ఒక దశలో వణికించింది. అయితే మ్యాచ్ అనంతరం అమెరికా కెప్టెన్ ఆరోన్ జోన్స్ ఓటమికి కారణాలు వివరించాడు. నిజంగా మా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. కాకపోతే బౌలింగులో నియంత్రణ లేకపోవడమే, మా కొంప ముంచిందని అన్నాడు.


ఫస్ట్ ఓవర్ నుంచి సౌతాఫ్రికా ఓపెనర్లు మా బౌలింగుని ఒక ఆటాడుకున్నారని అన్నాడు. పవర్ ప్లే లో ఒక వికెట్ మాత్రమే పడింది. తర్వాత వారిని నియంత్రించలేక పోయామని అన్నాడు. మేం మరింత మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిందని అన్నాడు.

విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోతే ఆ బాధ చెప్పలేమని అన్నాడు. ఒకొక్కసారి మేం మంచి క్రికెట్ ఆడితే ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించగలమని కచ్చితంగా చెప్పగలనని అన్నాడు. వచ్చే మ్యాచ్‌లో బలంగా తిరిగొస్తాం” అని ఆరోన్ జోన్స్ అన్నాడు.


అనంతరం గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ కూడా ఇదే మాటన్నాడు. ఇక్కడ క్రమశిక్షణతో కూడిన బౌలింగు చాలా అవసరమని అన్నాడు. కరెక్టుగా పిచ్ మీద బాల్ ల్యాండ్ అయ్యేటప్పుడు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ ఉండాలని అన్నాడు. ఏమాత్రం చిన్న తేడా వచ్చినా, బాల్ చక్కగా బ్యాట్ పైకి వెళుతోందని అన్నాడు.

Also Read: ఆతిధ్య జట్టుకు షాక్, విండీస్‌‌పై 8 వికెట్ల తేడాతో నెగ్గిన ఇంగ్లాండ్

నిజానికి బ్యాటర్ కొట్టే స్ట్రోక్ లో తేడా వచ్చి క్యాచ్ అవుట్ అవ్వాలి తప్ప, లేదంటే అది కచ్చితంగా సిక్స్ వెళుతుందని అన్నాడు. అందుకే బౌలర్లు చాలా జాగ్రత్తగా బౌలింగు చేయాలని అన్నాడు. అయితే ఇంతచెప్పిన మారక్రమ్ మాత్రం మ్యాచ్ లో సెకండ్ ఓవర్ వేసి 13 పరుగులు ఇచ్చాడు. అంతే తర్వాత మళ్లీ తను బౌలింగు వేయలేదు. అందుకే తను బౌలింగ్ క్రమశిక్షణపై మాట్లాడాడు.  మరి ఇరు జట్ల కెప్టెన్లు ఒకే మాట మాట్లాడాటంతో మిగిలిన జట్లకు కనువిప్పు కలుగుతుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

Tags

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×