BigTV English

AB de Villiers: ఏబి డివిలియర్స్ రీఎంట్రీ.. RCB కోసం రంగంలోకి?

AB de Villiers: ఏబి డివిలియర్స్ రీఎంట్రీ.. RCB కోసం రంగంలోకి?

AB de Villiers: ప్రపంచ క్రికెట్ లో పరిచయం అక్కర్లేని పేరు.. ఏబి డివిలియర్స్. ఈ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏబి డివిలియర్స్ తన 360 డిగ్రీ ఆటతో దశాబ్దానికి పైగా ప్రేక్షకులను విశేషంగా అలరించాడు. మైదానానికి నలువైపులా షాట్లు ఆడే ఆటగాడిగా తనదైన విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లో (ఏబిడి) విన్యాసాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.


Also Read: Jos Buttler: గ్రేట్… వీల్ చైర్ క్రికెటర్ ఆటోగ్రాఫ్ తీసుకున్న బట్లర్

అతడి అభిమానులు ముద్దుగా “మిస్టర్ 360” అని పిలుచుకుంటారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎన్నో ఏళ్లు సేవలు అందించాడు ఎబి డివిలియర్స్. 2004 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా తరపున డెబ్యూ చేసిన ఏబిడి.. 2018 మే లో అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు తన క్రికెట్ కెరీర్ ని కొనసాగించాడు. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, బిగ్ బాష్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఆడాడు. అయితే కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలో రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఏబీడీ.


ముఖ్యంగా అతడు ఒక్క ప్రపంచ కప్ టోర్నీ కూడా గెలవకుండానే రిటైర్మెంట్ ప్రకటించాడని ఫ్యాన్స్ ఎంతగానో బాధపడ్డారు. అయితే రిటైర్మెంట్ ప్రకటించే సమయంలో కుటుంబంతో గడిపేందుకు సమయం కోసమే ఆటకు దూరమైనట్లు వెల్లడించాడు. కానీ ఆ తర్వాత కొంతకాలానికి తన చిన్న కొడుకు కాలు తన ఎడమ కంటికి బలంగా తగలడంతో దృష్టి లోపించిందని.. ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకున్నానని వెల్లడించాడు. ఆటకి దూరంగా ఉండమని డాక్టర్లు సజెస్ట్ చేయడంతోనే రిటైర్మెంట్ ప్రకటించానని తెలియజేశాడు.

అయితే తాజాగా మరోసారి తన మనసులోని మాటని బయటపెట్టాడు ఏబీడీ. తాను ఇంకా క్రికెట్ ఆడవచ్చేమో అనే అనుభూతి తనకు కలుగుతున్నట్లు పేర్కొన్నాడు. “నా కళ్ళు ఇంకా పనిచేస్తున్నాయి. గ్రౌండ్ కి వెళ్లి బంతులను కొడుతూ మళ్లీ క్రికెట్ ని ఎంజాయ్ చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నాను” అని పేర్కొన్నాడు. దీంతో బంతిని ఊచకోత కోసే ఏబీడీ మళ్లీ గ్రౌండ్ లోకి అడుగు పెట్టాలనే నిర్ణయంతోనే ఇలా హింట్ ఇచ్చినట్లు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు త్వరగా రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

Also Read: Kohli- Army: వివాదంలో విరాట్ కోహ్లీ…ఆర్మీనే అవమానిస్తావా..ఎంత బలుపు ?

ఏబిడీ తన కెరీర్ లో సౌత్ ఆఫ్రికా జట్టు తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ-20 మ్యాచ్ లు ఆడాడు. 114 టెస్టుల్లో 50.7 సగటుతో 8,765 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 228 వన్డేలలో 53.5 సగటుతో 9,577 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 53 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 78 టీ-20 మ్యాచ్ లలో 26.1 సగటుతో 1,672 పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఏబీడీ ఐపీఎల్ లో 5 వేలకు పైగా పరుగులు చేయడం విశేషం. ఐపీఎల్ లో 184 మ్యాచ్ లు ఆడిన ఏబీడీ.. 170 ఇన్నింగ్స్ లలో 5,162 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

 

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×