Kohli- Army: టీమిండియా మాజీ కెప్టెన్ , RCB స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli ) వివాదం లో చిక్కుకున్నాడు. ఏకంగా ఇండియన్ ఆర్మీ తోనే పెట్టుకున్నాడు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం ఫామ్ లేక సతమతం అవుతున్న విరాట్ కోహ్లీ… ఓ సెల్ఫీ ( Virat Kohli Selfi ) కారణంగా వివాదంలో చిక్కుకున్నాడు. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన CISF జవాన్ సెల్ఫీ అడిగితే ఇవ్వకుండా… ఓవరాక్షన్ చేశాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli ). దీంతో సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీని ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజెన్స్.
Also Read: 2025 Physical Disability Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన దివ్యాంగుల టీమిండియా
వెంటనే విరాట్ కోహ్లీ ( Virat Kohli ) క్షమాపణలు చెప్పాలని కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ముంబై లో ఉంటున్న విరాట్ కోహ్లీ… తాజాగా తాజ్ హోటల్ ముందు కారు ఆపి దిగి నడుచుకుంటూ వెళ్లడం జరిగింది. అయితే ఈ సందర్భంగా…. ఆర్మీ కి ( Army ) సంబంధించిన ఒక జవాన్…. విరాట్ కోహ్లీని సెల్ఫీ ( Virat Kohli Selfi ) అడిగాడు. దాంతో విసుగెత్తిపోయిన… విరాట్ కోహ్లీ… బుర్ర ఉందా నీకు? అన్నట్లుగా జవాన్ తో వాగ్వాదానికి దిగాడు. ఇక విరాట్ కోహ్లీ సీరియస్ కావడంతో ఆ జవాన్ తీవ్ర నిరాశకు గురయ్యాడు.
గప్ చుప్ గా అక్కడి నుంచి ఆ జవాన్ వెళ్లిపోవడం జరిగింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకేముంది విరాట్ కోహ్లీ అంటే పడని వారు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారందరూ ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇండియన్ ఆర్మీ అంటే విరాట్ కోహ్లీకి ( Virat Kohli ) ఏమాత్రం గౌరవం లేదని… ఒక ఆర్మీ జవాన్ తో ఇలా వ్యవహరిస్తారా ? అంటూ నిప్పులు జరుగుతున్నారు.
Also Read: ICC Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీలో ఇండియాను నిలబెట్టిన వీరులు ?
ఒక జాతీయస్థాయి క్రీడాకారుడు… ఆర్మీతో ఇలా వ్యవహరిస్తారా ? కొంచమైనా బుర్ర ఉండాలి కదా..? అంటూ విరాట్ కోహ్లీ ని ఏకిపారేస్తున్నారు. వెంటనే ఆ జవాన్ కు అలాగే ఇండియన్ ఆర్మీకి ( Indian Army)… విరాట్ కోహ్లీ ( Virat Kohli ) క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే విరాట్ కోహ్లీని వదిలి లేదంటున్నారు. ఇది ఇలా ఉండగా, విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీకి తిరిగి రాబోతున్నాడు. దేశీయ ఫస్ట్-క్లాస్ టోర్నమెంట్‌లో ఆడిన పన్నెండేళ్ల తర్వాత, ఇప్పుడు మరోసారి రంజీ ట్రోఫీ ఆడనున్నాడు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు రైల్వేస్‌తో జరిగే ఢిల్లీ గ్రూప్-ఫేజ్ మ్యాచ్‌ల చివరి రౌండ్‌లో ఆడేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ , RCB స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli ) సిద్ధం అయ్యాడు. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రధాన కోచ్ శరందీప్ సింగ్ ధృవీకరించారు.
Virat Kohli denied a selfie to a army man 💔
Chose your idol wisely ☹️pic.twitter.com/DMWMv3EhLH
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) January 20, 2025