BigTV English
Advertisement

Sajeevan Sajana – Sivakarthikeyan: రియల్ లైఫ్ లో శివ కార్తికేయన్ హీరో అయ్యాడు.. ఆ మహిళా క్రికెటర్ కోసం ఏకంగా?

Sajeevan Sajana – Sivakarthikeyan: రియల్ లైఫ్ లో శివ కార్తికేయన్ హీరో అయ్యాడు.. ఆ మహిళా క్రికెటర్ కోసం ఏకంగా?

Sajeevan Sajana – Sivakarthikeyan: 2018లో కేరళ రాష్ట్రంలో వరదలు సృష్టించిన విధ్వంసం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రాష్ట్ర చరిత్రలో సంభవించిన ఆకస్మిక వరదలు చరిత్రలో అతి పెద్దది. ఈ వరదల్లో ఏకంగా 483 మంది మరణించారు. 3.91 లక్షల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. 1.40 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఈ వరదల కారణంగా నిరాశ్రయులైన కుటుంబాలలో.. ప్రస్తుత భారత మహిళా క్రికెటర్ సంజీవ్ సంజన కుటుంబం కూడా ఒకటి.


Also Read: Sri Lankan Team: శ్రీలంకను ఇక టచ్‌ చేయలేరు.. అక్కడ బాహుబలి ఉన్నాడు !

అయితే ఆ సమయంలో తాము కష్టాలలో ఉన్నప్పుడు సినీ నటుడు శివ కార్తికేయన్ చేసిన సాయాన్ని {Sajeevan Sajana – Sivakarthikeyan} తాజాగా సంజన గుర్తుచేసుకుంది. 2018 వయోనాడ్ వరదలలో తాము ఇంటిని కోల్పోయామని, ఆ వరదలలో తన ట్రోఫీలు, క్రికెట్ కిట్ అన్నీ కొట్టుకుపోయాయని తెలిపింది. ఆ సమయంలో శివ కార్తికేయన్ ఫోన్ చేసి హెల్ప్ కావాలా..? అని అడిగినట్లు చెప్పుకొచ్చింది. దీంతో వెంటనే కొత్త స్పైక్స్ కావాలని కోరితే.. అడిగిన వారం రోజులలోనే శివ కార్తికేయన్ అవి నా చెంతకు వచ్చేలా చేశారని తెలిపింది.


అప్పుడు తన చుట్టూ ఎంతమంది మద్దతు దారులు ఉన్నారో తనకు తెలిసిందని భావోద్వేగానికి గురైంది. సంజన 1995 జనవరి 4న జన్మించింది. ఆమె తండ్రి సంజీవన్ ఓ ఆటో డ్రైవర్. ఆమె తల్లి శారద మున్సిపాలిటీలో పనిచేసేది. ఎంతో కష్టపడి క్రికెటర్ గా ఎదిగింది సంజన. తన కెరీర్ లో 78 వన్డేలు ఆడిన సంజన 1,306 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 78 వన్డేల్లో 89 వికెట్లు పడగొట్టింది.

ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇలా గతంలో హీరో శివ కార్తికేయన్ చేసిన సహాయాన్ని {Sajeevan Sajana – Sivakarthikeyan} ఆమె బయట పెట్టడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో శివ కార్తికేయన్ నిజజీవితంలో కూడా హీరో అయ్యాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ఇక శివ కార్తికేయన్ విషయానికి వస్తే.. తాజాగా అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అతడి చేతిలో ప్రస్తుతం రెండు కేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో ఒక సినిమాకి ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read: Boycott RCB: మీకు ఎంత కొవ్వురా… మమ్మల్నే ’11’ అని ట్రోల్ చేస్తావా.. RCBపై గరం గరం

ఈ సినిమా టైటిల్ ఫిబ్రవరి 17న నటుడు శివ కార్తికేయన్ పుట్టినరోజున విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన రుక్మిణి వసంత నటిస్తోంది. ఈ సినిమాకి అని రైతు సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ తో పాటు సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి అనే సినిమా చేస్తున్నాడు శివ కార్తికేయన్. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ తోపాటు శ్రీలీల, అధర్వ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Related News

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వ‌రుస‌గా ఓడిన టీమిండియా

Womens World Cup 2029: వ‌చ్చే వ‌ర‌ల్డ్ క‌ప్ 2029పై ఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇకపై 8 కాదు 10 జ‌ట్లకు ఛాన్స్‌, ఫాకిస్తాన్ కు నో ఛాన్స్ !

IND VS AUS 5th T20I: నేడే చివ‌రి టీ20..టీమిండియాను వ‌ణికిస్తున్న గ‌బ్బా…సూర్య, గిల్‌ కు ఇక లాస్ట్ ఛాన్స్‌

Abhishek- Gill LV Bag: ఏంట్రా అభిషేక్‌…నీ సంచులు దేశం మొత్తం అమ్మేస్తున్నారా? లేడీస్ హ్యాండ్ బ్యాగులుగా కూడా

CP Sajjanar : వీళ్లేం సెల‌బ్రిటీలు?…రైనా, ధావన్‌లపై స‌జ్జ‌నార్ సీరియ‌స్‌

Big Stories

×