Sara Gurpal On Team India: టీమిండియా క్రికెటర్ల పై ప్రముఖ నటి, మోడల్ సారా గుర్పాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చాలామంది టీమ్ ఇండియా క్రికెటర్లు తనను వేధిస్తున్నారని ఎమోషనల్ అయ్యారు. అర్థ రాత్రులు మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేస్తూ విసిగిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు అరడజన్ మంది తనను వేధింపులకు గురి చేస్తున్నారని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. వీరేంద్ర సెహ్వాగ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్ సీజన్ 2 కు మోడల్ సారా గుర్పాల్ ప్రత్యేక గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా టీమిండియా క్రికెటర్ల ప్రస్తావన రావడంతో… తను వేధిస్తున్నారని సారా ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
వీరేంద్ర సెహ్వాగ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్ సీజన్ 2 కు మోడల్ సారా గుర్పాల్ ప్రత్యేక గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ అడిగిన ప్రతి ప్రశ్నకు ఆమె అనుసరించారు. ఈ తరుణంలోనే మిమ్మల్ని కొంతమంది టీమిండియా క్రికెటర్లు వేధిస్తున్నారని నేను విన్నాను ? ఇది నిజమేనా? వట్టి ప్రచారమేనా? అంటూ నటి సారాను ప్రశ్నించారు వీరేంద్ర సెహ్వాగ్.
ఈ క్రమంలో గుక్క తిప్పుకోకుండా… చక చక ఆన్సర్స్ ఇచ్చేసింది సారా. తనను చాలా మంది టీమిండియా క్రికెటర్లు వేధిస్తున్నారని ఫైర్ అయింది. సోషల్ మీడియాలో తన అకౌంట్లకు మెసేజ్లు కూడా పెడుతున్నారని పేర్కొంది. ఇంత వద్దని చెప్పినా కూడా.. ఆ దుర్మార్గులు వినడం లేదని వెల్లడించింది సారా. అర్థ రాత్రులు కూడా వీడియో కాల్స్ చేసే వాళ్ళని షాకింగ్ ఆరోపణలు చేశారు. అంతేకాదు తన మొబైల్ తీసి మరి వీరేంద్ర సెహ్వాగ్ కు ఆధారాలు మొత్తం చూపించారు.
సారా గుర్పాల్ చేసిన ఆరోపణల నేపథ్యంలో అనుమానం వచ్చిన వీరేంద్ర సెహ్వాగ్… టీమిండియా క్రికెటర్లు వేధిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయా? ఉంటే చూపియండి ? అని నిలదీశారు. దీంతో తన మొబైల్ ఇచ్చి టీమిండియా ప్లేయర్లో బాగోతం మొత్తం బయట పెట్టింది సారా. అయితే ఆమె మొబైల్ తీసుకున్న వీరేంద్ర సెహ్వాగ్… అందులో ఉన్న మెసేజ్ లు చూసి కంగు తిన్నాడు. లెఫ్ట్ హ్యాండర్, రైట్ హ్యాండర్, వికెట్ కీపర్ అబ్బో చాలామంది ఉన్నారు అంటూ వాపోయాడు వీరేంద్ర సెహ్వాగ్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. అయితే సారాకు మెసేజ్ చేసిన వాళ్లలో రియాన్ పరాగ్, రిషబ్ పంత్, ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు నెటిజెన్స్.
Punjabi actor Sara Gurpal revealed there are many current cricketers who slide her into Instagram DMs.
Sehwag then playfully asks her to share her mobile phone to see those messages.
"Ohh, this is why he isn't scoring runs."
"This lefty, righty, and a wicket keeper is also… pic.twitter.com/hMqcAJ0uZR
— Brutal Truth (@sarkarstix) September 27, 2026