E-Paper

Adi Reddy: హనుమంతుడిలాగా శ్రీలంక‌ను వైభ‌వ్ సూర్య‌వంశీ త‌గ‌ల‌బెడ‌తాడు

Adi Reddy: హనుమంతుడిలాగా శ్రీలంక‌ను వైభ‌వ్ సూర్య‌వంశీ త‌గ‌ల‌బెడ‌తాడు
Advertisement

Adi Reddy:  టీమిండియా ( Team India), శ్రీలంక అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ట్రై సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 9వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నమెంట్ జూన్ 21వ తేదీతో ముగియనుంది. ఓకే సోమవారం రోజున టీమిండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi Sri Lanka A Players Clash) గొడవపడ్డాడు. సూపర్ ఓవర్ ముగిసిన నేపథ్యంలో డ్రెస్సింగ్ రూమ్ వైపు వైభవ్ సైలెంట్గా వెళుతున్న నేపథ్యంలో, శ్రీలంక క్రికెటర్లే రెచ్చగొట్టారు. దీంతో రెచ్చిపోయిన వైభవ్, కాలర్లు పట్టుకొని సీరియస్ అయ్యాడు. అయితే ఈ సంఘటనపై శ్రీలంక మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వైభవ్ పైన బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Shoaib Akhtar On Ind vs Pak Women’s T20 World Cup 2026 : మీ ఆట చూస్తే విర‌క్తి పుడుతోంది…కామెంట్రీ ప్యానెల్ లో కూర్చోలేక‌పోతున్నాం

హనుమంతుడిలాగా శ్రీలంక‌ను వైభ‌వ్ సూర్య‌వంశీ త‌గ‌ల‌బెడ‌తాడు

Advertisement

ట్రై సిరీస్ సందర్భంగా శ్రీలంక క్రికెటర్లతో వైభవ్ సూర్యవంశీ గొడవ పెట్టుకున్న సంఘటనపై బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశీ ని కావాలని ఇరికించారని మండిపడ్డారు. ట్రై సిరీస్ ప్రారంభమైన నుంచి ప్రతి మ్యాచ్ తాను.. చూస్తున్నానని వెల్లడించిన ఆదిరెడ్డి, శ్రీలంక ప్లేయర్లే కావాలని వైభవ్ ను రెచ్చగొట్టారని ఆగ్రహించారు. మ్యాచ్ పూర్తయ్యే వరకు స్లెడ్జింగ్ చేశారని బాంబు పేల్చారు. కానీ చివరికి సహనం కోల్పోయిన వైభవ్… స్ట్రాంగ్ గా రియాక్ట్ అయినట్లు ఆదిరెడ్డి షాకింగ్ నిజాలను పంచుకున్నారు. అందుకే కాలర్లు పట్టుకొని, వైభవ్ తన ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేసినట్లు వివరించారు. ఈ సంఘటనలో శ్రీలంక క్రికెటర్ల పై బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు. అనవసరంగా గ్రూప్ స్టేజిలో వైభవ్ రెచ్చగొట్టారని.. దీని ఫలితం ఫైనల్స్ లో ఉంటుందని వ్యాఖ్యానించారు ఆది రెడ్డి.

కచ్చితంగా శ్రీలంక వర్సెస్ టీమిండియా ఏ జట్ల మధ్య ట్రై సిరీస్ ఫైనల్ ఉంటుందని అంచనా వేశారు ఆదిరెడ్డి. ఇక ఆ ఫైనల్ మ్యాచ్లో వైభవ్ భయంకరంగా బ్యాటింగ్ చేయడం గ్యారెంటీ అన్నారు. అప్పుడు టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందని కూడా స్పష్టం చేశారు. వాస్తవంగా లిస్ట్ ఏ క్రికెట్ ఎవరూ ఇంత ఇంట్రెస్ట్ గా చూడబోరని, కేవలం 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ ఉన్నాడని చాలామంది ఎగబడి చూస్తున్నట్లు వివరించారు. అందుకే వైభవ్ సంఘటనను బాగా హైలెట్ చేస్తున్నట్లు గుర్తు చేశారు. వైభవ్ లేకపోతే అసలు లిస్టు ఏ క్రికెట్ ఎవరూ చూడబోరని కుండబద్దలు కొట్టి చెప్పారు ఆదిరెడ్డి. ఇక ఫైనల్స్ లో హనుమంతుడు లంకను తగలబెట్టినట్లే… శ్రీలంకకు నరకం చూపిస్తాడని వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Also Read:  Ind vs Pak Women’s T20 World Cup 2026 : పాక్ ప్లేయ‌ర్ల‌పై దీప్తి శర్మ మర్డర్ అటెమ్ట్ ? జేబులో స్ప్రే బాటిల్ పెట్టుకుని ప్లాన్

?igsh=MWF1aGUzYmZ2cnN6eQ==

Related News

వార్నీ ఇదేందిర‌య్యా.. వ‌ర్షం వ‌స్తుంటే డైవ్ లు కొడుతూ లేడీ క్రికెట‌ర్ల ర‌చ్చ‌, ఏకంగా 26 ఏళ్ల త‌ర్వాత‌

ఇక చాలు ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్లి, ఐపీఎల్ ఆడుకో…వైభ‌వ్ కు లంక మాజీల వార్నింగ్

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌తో డ్రెస్సింగ్ రూం పంచుకోనున్న అశ్విన్

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు WPLలో ఛాన్స్ ఇవ్వండి..అప్పుడే టీమిండియా భ‌ర‌తం ప‌డ‌తారు

బుడ్డోడు, బుడ్డోడు అంటూ వైభ‌వ్ ను రెచ్చ‌గొట్ట‌ద్దు…లంక ప్లేయ‌ర్ల‌కు సంగ‌క్క‌ర హెచ్చ‌రిక‌

మైదానంలో కాల‌ర్ ప‌ట్టుకున్నాడు…బ‌య‌ట కాళ్లు మొక్కాడు, వీడు మామూలోడు కాదురా

ఇది మీ ఐపీఎల్ కాదమ్మా..ఎక్కువ చేస్తే లంక‌లోనే పాత‌రేస్తారు, వైభ‌వ్ కు త‌న్వీర్ వార్నింగ్

×