E-Paper
Advertisement

8000mAh బ్యాటరీ, ఇన్‌-బిల్ట్ ఫ్యాన్‌తో రెడ్‌మి కొత్త ఫోన్.. ఫీచర్లు అరాచకం బాబోయ్!

8000mAh బ్యాటరీ, ఇన్‌-బిల్ట్ ఫ్యాన్‌తో రెడ్‌మి కొత్త ఫోన్.. ఫీచర్లు అరాచకం బాబోయ్!
Advertisement

Redmi K90 Ultra: ప్రముఖ టెక్ సంస్థ షావోమికి సబ్ బ్రాండ్ అయిన రెడ్‌మీ నుండి సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ మార్కెట్‌లోకి రావడానికి సిద్ధంగా ఉంది. గత నెలలోనే చైనాలో Redmi K90 Maxను విడుదల చేసిన సంస్థ, ఇప్పుడు ఆ సిరీస్‌లో అత్యంత పవర్‌ఫుల్ మోడల్ అయిన Redmi K90 Ultra లాంచ్‌ను అధికారికంగా ఖరారు చేసింది. జూన్ నెలలోనే ఈ ఫోన్ చైనా మార్కెట్లో సందడి చేయనుంది. ఇప్పటికే అక్కడ ఈ ఫోన్ కోసం ప్రీ-ఆర్డర్లు కూడా మొదలయ్యాయి.

గేమింగ్ పెర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్:

ఈ కొత్త ఫోన్‌ను కంపెనీ ‘3K గేమింగ్ పెర్ఫార్మెన్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రమోట్ చేస్తోంది. అంటే గేమర్లకు ఇదొక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని చెప్పకనే చెబుతోంది. దీనిలో క్వాల్కమ్ కంపెనీకి చెందిన అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడేటప్పుడు లేదా ఎక్కువ సమయం ఫోన్ వాడేటప్పుడు వేడెక్కకుండా ఉండేందుకు, ఇందులో ప్రత్యేకంగా ఒక ‘యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్’ను కూడా అమర్చినట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: యాపిల్‌కు చెమటలు పట్టిస్తున్న శాంసంగ్.. డిస్‌ప్లే మడతను మాయం చేసే భారీ ప్లాన్ ఇదేనా?

కళ్లు చెదిరే డిప్‌ప్లే.. భారీ బ్యాటరీ:

Redmi K90 Ultraలో 6.89 ఇంచుల పెద్ద స్క్రీన్‌ను అందిస్తున్నారు. ఇది 1.5K రిజల్యూషన్ కలిగిన ఎల్‌టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో రానుంది. అంతేకాదు.. స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా సాగడం కోసం 165Hz రీఫ్రెష్ రేట్‌ను దీనిలో జోడించారు. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే.. వినియోగదారులకు అసలు తిరుగుండదు. ఎందుకంటే దీనిలో ఏకంగా 8,000mAh అంతకంటే పెద్ద బ్యాటరీని ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

డిజైన్, అదనపు రక్షణ:

Advertisement

ఈ ఫోన్ లుక్ పరంగా చాలా స్టైలిష్‌గా ఉండబోతోంది. వెనుక వైపు ఫ్లాట్ ప్యానెల్‌తో పైన కెమెరా మాడ్యూల్‌ను అమర్చారు. కుడి వైపున పవర్, వాల్యూమ్ బటన్స్ ఉంటాయి. భద్రత కోసం డిస్‌ప్లే పైనే పనిచేసే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను ఇచ్చారు. ఇక నీరు, దుమ్ము నుండి ఫోన్‌కు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు దీనికి ఐపీ68 రేటింగ్‌ను కూడా అందించినట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గత ఏడాది వచ్చిన K80 అల్ట్రాకు అప్‌గ్రేడ్‌గా వస్తున్న ఈ ఫోన్ మార్కెట్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Also Read: ల్యాప్‌టాప్ చరిత్రలోనే మొదటిసారి.. 96GB గ్రాఫిక్స్ మెమరీతో Lenovo Yoga Pro 7!

Related News

ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటికీ సపోర్ట్ చేసే JioTag 2 వచ్చేసింది.. ధర, ఫీచర్ల వివరాలు!

పవర్‌ఫుల్ ప్రాసెసర్, 50MP కెమెరా ఉన్న Oppo ఫోన్‌పై ఏకంగా రూ.12,000 తగ్గింపు!

50MP జైస్ కెమెరా, 6000mAh బ్యాటరీ ఉన్న ఆ ఫోన్‌పై దిమ్మతిరిగే ఆఫర్.. ఛాన్స్ మిస్ కావద్దు!

రూ.8,000 లోపే స్టైలిష్ లుక్.. పవర్‌ఫుల్ బ్యాటరీ లైఫ్‌తో CMF Watch 3 Pro!

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన టాప్ 5 పవర్ బ్యాంక్స్..మీ ఫోన్‌కు ఏది బెస్ట్?

స్క్రీన్‌తో వస్తున్న Apple HomePod.. వాయిస్ కంట్రోల్‌కి గుడ్‌బై చెప్పాల్సిందేనా?

కొత్త ఐఫోన్ తీసుకున్నారా? ఆండ్రాయిడ్ నుంచి వాట్సాప్ చాట్స్ ఇలా మూవ్ చేసుకోండి!

సగం ధరకే..బెస్ట్ స్మార్ట్‌వాచ్, వెంటనే కొనేయండి

Big Stories

Advertisement
×