E-Paper
Advertisement

Tanveer Ahmed: న్యూజిలాండ్-శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్‌..పాకిస్తాన్ ను ఇంటికి పంపేందుకే ఈ కుట్ర‌లు

Tanveer Ahmed: న్యూజిలాండ్-శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్‌..పాకిస్తాన్ ను ఇంటికి పంపేందుకే ఈ కుట్ర‌లు
Advertisement

Tanveer Ahmed: టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  నేపథ్యంలో బుధవారం రోజున న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక ( New Zealand vs Sri Lanka) మధ్య కీలక మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన శ్రీలంక ఓడిపోయింది. న్యూజిలాండ్ చేతిలో ఏకంగా 61 పరుగుల తేడాతో దారుణ ఓటమి చవి చూసింది. ఈ దెబ్బకు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి శ్రీలంక ఎలిమినేట్ అయింది. అయితే నిన్నటి మ్యాచ్ లో శ్రీలంక గెలిచి ఉంటే, పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు సజీవంగానే ఉండేవి. కానీ శ్రీలంక దారుణంగా ఓడిపోవడం, పాకిస్తాన్ చావుకు వచ్చింది. అద్భుతం జరిగితే తప్ప ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్ సెమీ ఫైనల్ వెళ్లడం కష్టమే.

Also Read: Gautam Gambhir: ఎవ్వ‌డికి ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిల మైకంలోనే ఉంటున్నారు.. డ్రెస్సింగ్ రూంలో క్లాస్ పీకిన గంభీర్‌

శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఫిక్సింగ్.. పాకిస్తాన్ కొత్త డ్రామాలు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament )  భాగంగా నిన్న న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓడిపోయింది. దీంతో శ్రీలంక ఎలిమినేట్ కావడమే కాకుండా పాకిస్తాన్ ను కూడా వెంటబెట్టుకొని వెళ్లే లాగా కనిపిస్తోంది. అయితే ఈ న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక కావాలనే ఓడిపోయిందని బాంబు పేల్చారు. ఈ రెండు జ‌ట్ల మధ్య ఫిక్సింగ్ ( Match Fixing) జరిగిందని ఆరోపణలు చేశారు తన్వీర్ అహ్మద్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా ఈ కుట్ర వెనుక ఉన్నాడని మండిపడ్డారు. పాకిస్తాన్ ను ఇంటికి పంపించేందుకే.. అందరూ ఆడిన డ్రామా అంటూ ఫైర్ అయ్యారు. న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓడిపోవడంతో సెమీ ఫైనల్ రేసు నుంచి పాకిస్తాన్ తప్పుకోవాల్సి వస్తోందని దీనంతటికి ఇండియా నే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో తన్వీర్ అహ్మాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ సెమీస్ కు వెళ్లే ఛాన్స్ ఉందా ?

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ సెమీస్ కు ( PAKISTAN SEMI-FINAL QUALIFICATION SCENARIOS ) వెళ్లే ఛాన్స్ ఒకే ఒక్క శాతం ఉంద‌ని అంటున్నారు. ఈ టోర్న‌మెంట్ సూప‌ర్ 8 లో భాగంగా, న్యూజిలాండ్ ను ఇంగ్లాండ్ చిత్తుగా ఓడించాలి. ఒక వేళ న్యూజిలాండ్ పై 15 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిస్తే, శ్రీలంక పైన 55 ప‌రుగుల తేడాతో పాకిస్తాన్ విజ‌యం సాధించాల్సి ఉంటుంది. అలాగే, న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ ఒకే ఒక్క ప‌రుగు తేడాతో విజ‌యం సాధిస్తే, శ్రీలంక పైన 69 ప‌రుగుల తేడాతో పాకిస్తాన్ విజ‌యం సాధించాలి. అలా అయితే, పాకిస్తాన్ సెమీస్ కు వెళుతుంది. ఒక‌వేళ ఇంగ్లాండ్ పై న్యూజిలాండ్ గెలిస్తే, శ్రీలంక‌తో పాటు పాక్ ఇంటికి వెళ్లాల్సిందే. అప్పుడు ఇంగ్లాండ్ తో పాటు కివీస్ సెమీస్ కు వెళుతుంది.

Advertisement

 

Also Read: Salman Agha: నీ పెళ్లాన్ని రేప్ చేస్తాం, కొడుకును చంపేస్తాం…పాక్ కెప్టెన్ స‌ల్మాన్ ఫ్యామిలీకి వేధింపులు

 

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×