BigTV English

Vinesh Phoghat: ఎప్పటికైనా నిజం గెలవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా: రెజ్లర్‌ వినేష్‌

Vinesh Phoghat: ఎప్పటికైనా నిజం గెలవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా: రెజ్లర్‌ వినేష్‌

Praying To God That Truth Always Wins Wrestler Vinesh: పారిస్ ఒలింపిక్స్‌ 2024లో భారత్‌కి చెందిన రెజ్లర్ వినేష్ ఫోగట్ ఫైనల్ కు చేరారు. అయితే ఆమె 50 కేజీల ఫైనల్‌కు వంద గ్రాములు ఎక్కువగా ఉండడంతో అనర్హత వేటు వేశారు. ఆమె దీనిపై పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఆమె అనర్హతపై వినేష్ చేసిన అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ తాత్కాలిక విభాగం కొట్టివేసింది. చివరికి పారిస్ నుంచి స్వదేశం తిరిగొచ్చిన వినేష్ ఫోగట్‌కి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు తోటి క్రీడాకారులు, అభిమానులు. అంతేకాకుండా వినేష్ కు మద్దతు తెలిపేందుకు వందలాది మంది మద్దతుదారులు దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ తర్వాత హర్యానాలోని వినేష్ స్వగ్రామానికి ఆమె వెళ్లింది.


హర్యానాలోని బలాలీకి వచ్చిన అనంతరం, వినేష్ తన మేనమామ, క్రీడా గురువు మహావీర్ సింగ్ ఫోగట్‌ను కలిసి చాలా సమయం వరకు మాట్లాడారు. అనంతరం ఇద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఒలింపిక్స్‌లో వినేష్ అనర్హత వేటు పడిన టైమ్‌లో మహావీర్ నిరంతరం వినేష్‌కు సపోర్ట్‌గానే నిలిచారు.అంతేకాదు వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లు, అభిమానులందరినీ చాలా ఎమోషనల్‌కి గురి చేసింది. ఆగష్టు 8న వినేష్ రెజ్లింగ్ నుంచి రిటైర్ అవుతున్నట్లు భావోద్వేగ అనౌన్స్‌మెంట్ చేసింది. ఆ తర్వాత నా తోటి ఇండియన్స్, నా గ్రామం, నా ఫ్యామిలీ నుంచి నాకు ప్రేమ లభించింది. ఈ గాయాన్ని మాన్పించడానికి నాకు కొండంత ధైర్యం వస్తుందని నేను భావిస్తున్నా. నేను బహుశా రెజ్లింగ్‌కు రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని మీడియాతో వినేష్ అన్నారు.

Also Read: అండర్ 19 టీ20 2025 మహిళల ప్రపంచకప్ షెడ్యూల్‌ విడుదల


అనంతరం ఒలింపిక్ పతకాన్ని కోల్పోవడం నా జీవితంలో తీరని ఒక గాయమని నేను చెప్పాలనుకుంటున్నా. ఈ గాయం మానడానికి ఎంత టైమ్ పడుతుందో నాకు తెలియదంటూ కన్నీరుమున్నీరు అయింది. నేను కుస్తీని కొనసాగిస్తానో లేదో కూడా నాకు తెలియట్లేదు. ఈరోజు నాకు లభించిన ధైర్యాన్ని నేను సరైన దిశలో ఉపయోగించాలనుకుంటున్నానని తెలిపింది వినేష్‌. ఆమె తోటి ఒలింపియన్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా గ్రాప్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఒక సంవత్సరానికి పైగా నిరసనలు చేస్తున్నారు. మా పోరాటం ఇంతటితో ఎండ్ కాలేదు. పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.అంతేకాకుండా ఎప్పటికైనా నిజం గెలవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని వినేష్ ఎమోషనల్‌గా ఈ వ్యాఖ్యలు చేశారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×