BigTV English
Advertisement

Anant Ambani – RCB : భారీ ధరకు RCBని కొంటున్న అంబానీ కొడుకు.. ఎన్ని కోట్లు అంటే ?

Anant Ambani – RCB :  భారీ ధరకు RCBని కొంటున్న అంబానీ కొడుకు.. ఎన్ని కోట్లు అంటే  ?

Anant Ambani – RCB : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు  ఐపీఎల్ 2025 వ సీజన్ లో టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 18 సీజన్ల నుంచి టైటిల్ రేస్ లో ఉండి.. మూడు సార్లు రన్నరఫ్ గా నిలిచింది. చివరికీ 18వ సీజన్ లో టైటిల్ సాధించింది. వాస్తవానికి ముంబై ఇండియన్స్ జట్టును తొలి సీజన్ లో విజయ్ మాల్యా కొనుగోలు చేయాలని భావించాడట. అయితే అయితే అప్పటికే అంబానీ కూడా బిడ్ వేయడంతో అధిక ధరకు కొనుగోలు చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేశాడు విజయ్ మాల్యా. ఒకవేళ విజయ్ మాల్యా ముంబై జట్టును కొనుగోలు చేస్తే.. మాత్రం రాయల్ ఛాలెంజర్స్ ముంబై అని నామకరణం చేయాలని భావించాడట. అయితే తాజాగా భారత అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడైన అనంత్ అంబానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని కొనుగోలు చేయనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.


Also Read : Tiger Shroff : 6 ప్యాక్ తో క్రికెట్ ఆడిన బాలీవుడ్ హీరో.. టీమిండియాలోకి తీసుకురండి !

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జూన్ 03న జరిగిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 బీసీసీఐ జేబులను నింపడమే కాకుండా జియో హాట్ స్టార్ వంటి ప్రసారకర్తలను కూడా డబ్బుతో నింపుతుంది. ఈ ఏడాది 64.3 కోట్ల మంది ప్రేక్షకులు ఫైనల్ మ్యాచ్ ను ఆస్వాదించాడు. గత ఏడాది 60.2 కోట్ల మంది క్రికెట్ ప్రేమికులు జియో సినిమాలో ఐపీఎల్ మ్యాచ్ చూశారు. ఈ సారి గత ఏడాది రికార్డు కూడా బద్దలైంది. జియో సినిమా, హాట్ స్టార్ విలీనం తరువాత ఈ ఏడాది కోట్లాది మంది జియో హాట్ స్టార్ లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ ను ఆస్వాదించారు. ఈ మ్యాచ్ ముఖేష్ అంబానీ జేబులను నింపింది. హాట్ స్టార్, జియో సినిమా విలీనం తరువాత ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో హాట్ స్టార్ లో 63.16 శాతం వాటా కలిగి ఉన్నది. ఇక ఇందులో 46.82 శఆతం వయాకామ్ 18 ద్వారా.. 16.34 శాతం ప్రత్యక్ష వాటా.. ఫైనల్ మ్యాచ్ సమయంలో వీక్షకుల సంఖ్య కారణంగా కంపెనీ షేర్లు పెరిగాయి.


విజయ్ మాల్యా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించాడు. ముంబై ఇండియన్స్ జట్టుతో సహా మూడు ఫ్రాంచైజీలకు బిడ్ వేసినట్టు తెలిపాడు. అయితే ముంబై ఇండియన్స్ ని కొని రాయల్ ఛాలెంజర్స్ ముంబై అని పెట్టాలనుకున్నట్టు తెలిపాడు. అయితే ముఖేష్ అంబానీ అత్యధిక ధరను కోట్ చేయడంతో కొనలేకపోయినట్టు చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ని అతి తక్కువ తేడాతో కోల్పోయిన తరువాత విజయ్ మాల్యా చివరికీ 112 మిలియన్ల యూఎస్ డాలర్ల కి ఆ సమయంలో ఆర్సీబీ ని కొనుగోలు చేశాడు. 2008లో 112 మిలియన్ల అమెరికన్ డాలర్ల విలువ సుమారు రూ.600-700 కోట్లు.. ఆర్సీబీ ని కొనుగోలు చేయడం వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం తన విస్కీ బ్రాండ్ రాయల్ ఛాలెంజ్ ని ప్రోత్సహించడమే అని చెప్పుకొచ్చాడు విజయ్ మాల్యా. ఇదిలా ఉంటే.. భారీ ధరకు అనంత్ అంబానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ని కొనాలనుకోవడం వార్త విని అందరూ ఆశ్యర్యపోవడం విశేషం. దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Related News

IND VS SA: ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, షెడ్యూల్‌, బ‌లాబ‌లాలు ఇవే..ఉచితంగా ఎలా చూడాలంటే

Hong Kong Sixes 2025 : హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టిన పాకిస్తాన్..ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా

IPL 2026: SRH జ‌ట్టులో ఫిక్సింగ్..అంబానీతో చేతులు క‌లిపి ద‌గా, కావ్యపాప స్కెచ్ చూడండి !

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్‌, వేదిక‌లు ఇవే…హైద‌రాబాద్, విశాఖ‌కు అన్యాయం ?

Cricket players : ఇప్ప‌టి క్రికెట‌ర్లు ఆ వైట్ క్రీమ్ ను ఎందుకు వాడ‌టం లేదో తెలుసా..?

IPL 2026-SSMB 29 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు చిచ్చులు పెడుతున్న మహేష్-జక్కన్న, వేలం ఎప్పుడంటే?

Hong Kong Sixes 2025 Final: హాంకాంగ్‌ సిక్సెస్ 2025 విజేత‌గా పాకిస్తాన్..6వ సారి ట్రోఫీ, ప్రైజ్ మ‌నీ ఎంతంటే

IPL 2026: సంజు ఎఫెక్ట్‌..జ‌డేజా అకౌంట్ పై బ్యాక్‌, ఐపీఎల్ 2026కు ముందే సంచ‌ల‌నం !

Big Stories

×