Virat Kohli: భారత్ – ఇంగ్లాండ్ మధ్య నాగపూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన మొదటి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ కి దూరమయ్యాడు. భారత ప్లేయింగ్ ఎలెవెన్ లో విరాట్ కోహ్లీ పేరు కనిపించలేదు. దీంతో ఫిట్ గా ఉన్న విరాట్ కోహ్లీని ఎందుకు ఆడించలేదనే చర్చలు మొదలయ్యాయి. అతడిని కావాలనే ఆడించలేదా..? కెప్టెన్ రోహిత్ శర్మ – కోచ్ గౌతమ్ గంభీర్ ప్లాన్ ఏంటి..? అంటూ ఇలా రకరకాల చర్చలు జరిగాయి.
Also Read: Virat Kohli: కండలు, 6 ప్యాక్ పెంచాడు.. కానీ అన్ని దండగే.. కోహ్లీ ఫిట్‌నెస్‌పై సెటైర్లు !
కానీ మోకాలి నొప్పి కారణంగా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ కి దూరమయ్యాడని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. మొదటి వన్డే టాస్ సమయంలో జట్టును ప్రకటించిన రోహిత్.. విరాట్ కోహ్లీ మ్యాచ్ లో ఆడడం లేదని క్లారిటీ ఇచ్చాడు. బీసీసీఐ కూడా విరాట్ కోహ్లీ మొదటి వన్డేకి అందుబాటులో ఉండడం లేదని ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. విరాట్ కోహ్లీ స్థానంలో యంగ్ బ్యాటర్ యశస్వి జైష్వాల్ ని రీప్లేస్ చేశారు. ప్రతిష్టాత్మక ఛాంపియన్ ట్రోఫీ 2025 కి ముందు భారత జట్టు సన్నద్ధం కావడానికి ఇదే చివరి సిరీస్ కావడం, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు జట్టు నుంచి దూరం కావడం ఆశ్చర్యానికి గురిచేసింది.
ఏది ఏమైనా ఈ తొలి వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ని చిత్తుచిత్తుగా ఓడించింది. కేవలం 38.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి.. తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఫిబ్రవరి 9 ఆదివారం రోజున కటక్ లో ఇంగ్లాండ్ – భారత్ మధ్య రెండో వన్డే జరగబోతోంది. ఈ రెండవ వన్డేలో విరాట్ కోహ్లీ జట్టులోకి తిరిగి వస్తాడని టీమిండియా యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్ అభిమానులకు హామీ ఇచ్చాడు.
అతడు మోకాలి గాయం కారణంగా నాగపూర్ లో జరిగిన తొలి వన్డేకి దూరమయ్యాడని.. ప్రస్తుతం కోలుకొని జట్టులోకి తిరిగి వస్తున్నాడని స్పష్టం చేశాడు. మొదటి వన్డే కు ముందు రోజు ప్రాక్టీస్ సెషన్ లో విరాట్ కోహ్లీ బాగానే ఉన్నాడని, మ్యాచ్ రోజు ఉదయం అతడి మోకాలిలో కొంత వాపు కనిపించడంతో మ్యాచ్ కి దూరమయ్యాడని పేర్కొన్నాడు. ఇక తొలి మ్యాచ్ లో హర్షిత్ రానా తన బౌలింగ్ ప్రతిభను చూపించాడని చెప్పుకొచ్చాడు.
ఇక స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఛాంపియర్స్ ట్రోఫీ లోపు అందుబాటులో ఉంటాడా..? లేదా..? అనే విషయం భారత్ ని ఆందోళనకు గురిచేస్తుంది. ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీ గాయం మరింత గందరగోళాన్ని పెంచుతుంది. తొలి వన్డే కి ముందు గురువారం రోజు షటిల్ స్ప్రింట్ చేయడానికి బయటకి వచ్చినప్పుడు విరాట్ కోహ్లీ కుడి మోకాలికి బ్యాండేజ్ కనిపించింది.
Also Read: SA20 final: మరోసారి ఫైనల్ కు చేరిన సన్ రైజర్స్..జోష్ లో కావ్యా పాప !
కానీ విరాట్ కోహ్లీ అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించలేదు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో అనేక రికార్డులు సాధించిన విరాట్ కోహ్లీ.. వన్డే క్రికెట్ లో 14 వేల పరుగులకు దగ్గరగా ఉన్నాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి విరాట్ కోహ్లీకి ఇంకా 94 పరుగులు అవసరం. ఇంగ్లాండ్ తో జరిగే రెండో వన్డేలో విరాట్ కోహ్లీ ఫామ్ లోకి తిరిగి వస్తే ఈ రికార్డ్ ని అందుకోవడం సాధ్యమే.
🚨 KING KOHLI WILL PLAY 2ND ODI vs ENGLAND 🚨
– A team insider confirms Virat Kohli will play the 2nd ODI match against England at Cuttack in all likelihood. (TOI). pic.twitter.com/kPXcSWpSei
— Tanuj Singh (@ImTanujSingh) February 7, 2025