BigTV English

OTT Movie : భూమిని ఢీ కొట్టే శకలం … కళ్ళముందే వినాశనం … యుగాంతం ఆరంభం

OTT Movie : భూమిని ఢీ కొట్టే శకలం … కళ్ళముందే వినాశనం … యుగాంతం ఆరంభం

OTT Movie : సైన్స్ ఫిక్షన్ సినిమాలు డిఫరెంట్ స్టోరీలతో లో తెరకెక్కుతుంటాయి. ఈ సినిమాలు ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో భూమి మీద ఒక తోకచుక్క పడుతుంది. ఆ తర్వాత మానవాళికి పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇందులో ఇద్దరు సైంటిస్టులు మానవాళిని హెచ్చరించే ప్రయత్నం చేస్తారు. చివరి వరకు ఈ మూవీ ఉత్కంఠంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులోస్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ సైన్స్ ఫిక్షన్ బ్లాక్ కామెడీ మూవీ పేరు ‘డోంట్ లుక్ అప్’ (Don’t Look Up). 2021 లో వచ్చిన ఈ మూవీకి ఆడమ్ మెక్‌కే దర్శకత్వం వహించారు. ఇందులో లియోనార్డో డికాప్రియో, జెన్నిఫర్ లారెన్స్, రాబ్ మోర్గాన్, జోనా హిల్, మార్క్ రిలాన్స్, టైలర్ పెర్రీ, తిమోతీ చలామెట్, రాన్ పెర్ల్‌మాన్, అరియానా గ్రాండే, కిడ్ కుడి, కేట్ బ్లాంచెట్ నటించారు. ఈ సినిమా స్టోరీ ఒక విపత్తు సంఘటన చుట్టూ తిరుగుతుంది. భూమిని నాశనం చేసే ఒక తోకచుక్క గురించి, మానవాళిని హెచ్చరించడానికి ఇద్దరు ఖగోళ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

కేట్ డిబియాస్కీ అనే ఖగోళ శాస్త్ర విద్యార్థి, భూమి వైపు వేగంగా దూసుకొస్తున్న ఒక భారీ తోకచుక్కను కనుగొంటుంది. ఆమె ప్రొఫెసర్ డాక్టర్ రాండాల్ మిండీతో కలిసి, ఈ తోకచుక్క ఆరు నెలల్లో భూమిని ఢీకొట్టి మానవాళిని నాశనం చేసే సామర్థ్యం కలిగి ఉందని అంచనా వేస్తారు. వారు ఈ విషయాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నిస్తారు. వారు మొదట అమెరికా అధ్యక్షురాలు జానీ ఓర్లీన్, ఆమె కుమారుడు, చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాసన్ ని కలుస్తారు. కానీ అధ్యక్షురాలు ఈ సమస్యను సీరియస్‌గా తీసుకోకుండా, రాజకీయ ప్రయోజనాలు ఎన్నికల గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి కేట్, రాండాల్ ఒక టీవీ షోలో పాల్గొంటారు. కానీ అక్కడ కూడా వారి హెచ్చరికలను ఎవరూ పట్టించుకోరు. బదులుగా వినోదం రేటింగ్స్‌పై దృష్టి పెడతారు.

ఇంతలో, ఒక టెక్ బిలియనీర్ పీటర్ ఇషర్‌వెల్ ఈ తోకచుక్క ఖనిజ సంపద కోసం, దానిని నాశనం చేయకుండా స్వాధీనం చేసుకోవాలని ప్రతిపాదిస్తాడు. ఇది ప్రభుత్వానికి కూడా  చాలా ఆసక్తిని కలిగిస్తుంది. కానీ అతడు చేసే ఈ ప్రయత్నం విఫలమవుతుంది. ఆ తరువాత తోకచుక్క భూమిని ఢీకొట్టే సమయం దగ్గరపడుతుంది. చివరికి ఆకులు కాలాక చేతులు పట్టుకున్నట్లు, సమాజంలోని వివిధ వర్గాల విజ్ఞానవేత్తలు, రాజకీయ నాయకులు, మీడియా, సాధారణ ప్రజలు ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో విఫలమవుతారు. చివరికి ఈ తోకచుక్క భూమిని ఢీ కొడుతుందా ? మానవాళి అంతం అవుతుందా ? అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైన్స్ ఫిక్షన్ బ్లాక్ కామెడీ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

OTT Movie : ఈ వారం ఓటీటీలోకి అడుగు పెట్టిన సిరీస్ లు… ఒక్కోటి ఒక్కో జానర్ లో

OTT Movie : తలపై రెడ్ లైన్స్… తలరాత కాదు ఎఫైర్స్ కౌంట్… ఇండియాలో వైరల్ కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

OTT Movie : పిల్లోడిని చంపి సూట్ కేసులో… మైండ్ బెండయ్యే కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : రెంటుకొచ్చి పక్కింటి అమ్మాయితో… కారు పెట్టిన కార్చిచ్చు… దిమాక్ కరాబ్ ట్విస్టులు సామీ

OTT Movie : అమ్మాయి ఫోన్ కి ఆ పాడు వీడియోలు… ఆ సౌండ్ వింటేనే డాక్టర్ కి దడదడ… మస్ట్ వాచ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పిల్లల ముందే తల్లిపై అఘాయిత్యం… సైతాన్ లా మారే కిరాతక పోలీస్… క్లైమాక్స్ లో ఊచకోతే

Big Stories

×