Arshdeep Singh Private Chat: టీమిండియా స్టార్, పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో… పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ప్రైవేట్ చాట్ లీక్ అయింది. ఓ అమ్మాయితో ఇంస్టాగ్రామ్ లో చాట్ ( Arshdeep Singh Private Chat) చేసినట్లు… అర్ష్‌దీప్ సింగ్ కు సంబంధించిన ఓ ప్రైవేట్ చాట్ లిస్ట్ బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో సదరు యువతి.. అర్ష్‌దీప్ సింగ్ చేసిన చాట్ లిస్ట్ బయట పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read : Kohli – Anushka Sharma : కోహ్లీకి అవమానం.. అనుష్క శర్మ ప్రైవేట్ పార్ట్స్ పై ట్రోలింగ్ !
వాస్తవంగా ఈ చాట్ లిస్టులో ఎలాంటి అసభ్యకరమైన మెసేజ్లు లేకపోవడంతో అర్ష్‌దీప్ సింగ్ బతికి బయటపడ్డాడు. అసలు అందులో ఏముందంటే… ఏం చేస్తున్నావు? మీ ఇల్లు ఎక్కడ అనే ప్రశ్నలను అర్ష్‌దీప్ సింగ్ అడిగాడు. అయితే వాటికి ఆ యువతీ సమాధానం కూడా ఇచ్చింది. అంతేకాదు అమ్మాయి ఫోటో సూపర్ అంటూ అర్ష్‌దీప్ సింగ్ సింబల్ కూడా పెట్టాడు. ఈ చాట్ లిస్ట్ ఇప్పుడు బయటపడింది. అయితే ఈ చాట్ లిస్ట్ బయటపడడంతో…టీమిండియా స్టార్, పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కు ప్రీతిజింటా వార్నింగ్ ఇచ్చినట్లు కూడా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఐపీఎల్ 2025 టోర్నమెంటు పైన దృష్టి పెట్టకుండా… అమ్మాయిలతో చాటింగ్ చేస్తే కుదరదని వార్నింగ్ ఇచ్చారట.
పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కు ప్రీతి జింటా వార్నింగ్
పంజాబ్ కింగ్స్ ఆటగాడు అర్సదీప్ సింగ్ చేసిన పనికి ప్రీతిజింతా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మ్యాచ్ ప్రాక్టీస్ చేయకుండా.. ఫోన్ పట్టుకొని… చాటింగ్ బంద్ చేయాలని ఆమె సీరియస్ అయ్యారట. పంజాబ్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్ కు చేరిన సంగతి గుర్తు చేసుకోవాలని… ముందు ముందు ముసళ్ళ పండుగ ఉందని… ఆమె ఫైర్ అయ్యారు. టోర్నమెంట్ పూర్తయిన తర్వాత చాటింగ్ కాదు ఇంకా ఏమైనా చేసుకోండి కానీ… టోర్నమెంట్ మధ్యలో ఇలాంటి పనులు చేసి అడ్డంగా దొరికిపోకూడదని చురకలు అంటించారట ప్రీతి జింటా. దీంతో ఆమె ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు హైలైట్ అయింది.
నెంబర్ వన్ పొజిషన్కు వచ్చిన పంజాబ్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య సోమవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ముంబై ఇండియన్స్ పై ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి నేరుగా మొదటి స్థానానికి వెళ్ళింది పంజాబ్ కింగ్స్. అంటే టాప్ 2 లో పంజాబ్ కింగ్స్ నిలిచింది అని చెప్పవచ్చు.
ALSO READ: Karun Nair : కరుణ్ నాయర్ గొప్ప మనసు… అంపైర్ కంటే ముందే సిక్స్ ఇచ్చాడు
Snappreet singh exposed 😭😭😭😭 pic.twitter.com/BGYp2H4JGL
— Simpman Sandhu (@cheersgayleee) May 23, 2025