Arshdeep Singh : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో ( Indian Premier League 2026 Tournament) ప్లే ఆఫ్స్ చేరకుండానే ఎలిమినేట్ అయిన పంజాబ్ కింగ్స్ జట్టుకు మరో ఊహించని షాక్ తగిలేలా కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ జట్టుకు ఎన్నో ఏండ్లుగా వెన్నముక్కలాగా ఉన్న స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ( Arshdeep Singh)… గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. పంజాబ్ కింగ్స్ యాజమాన్యంపై ఆయన అలిగాడా..? ఇతర ఏ కారణాలో ? తెలియదు కానీ.. 2027 ఐపీఎల్ ( IPL 2027) సమయానికి మాత్రం పంజాబ్ కింగ్స్ జట్టును ( Punjab Kings) వదిలి… వేరే జట్టులో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇతర ఫ్రాంచైజీలతో చర్చలు కూడా నిర్వహిస్తున్నాడట అర్ష్‌దీప్ సింగ్. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం కుదేలు అవుతోంది.
పంజాబ్ కింగ్స్ జట్టులో కొన్ని ఏళ్లుగా ఉంటున్న అర్ష్‌దీప్ సింగ్ సంచలన తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టు కాకుండా మరో ఫ్రాంచైజీకి ఆడేందుకు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నాడట. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఉన్న పంజాబ్ కింగ్స్ పోస్టులన్నీ డిలీట్ చేశాడు అర్ష్‌దీప్ సింగ్. కేవలం 24 గంటల వ్యవధిలో 234 పోస్టులు డిలీట్ చేసి పంజాబ్ టీమ్స్ జట్టుకు షాక్ ఇచ్చాడు. అంతకుముందు 278 పోస్టులు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 44 కు పడిపోయింది. అంతేకాదు గతంలో విరాట్ కోహ్లీతో కలిసి చేసిన వీడియోను కూడా అర్ష్‌దీప్ సింగ్ డిలీట్ చేశాడు. ఈ వీడియోకు 200 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ కూడా మార్చాడు. గతంలో పంజాబ్ కింగ్స్ జెర్సీతో ఉన్న ఫోటో పెట్టుకున్న అర్ష్‌దీప్ సింగ్.. ఇప్పుడు దాన్ని తొలగించి.. సాధారణ డీపీ పెట్టేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ జట్టును అర్ష్‌దీప్ సింగ్ వీడబోతున్నాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఐపీఎల్ 2026 ప్రారంభమైన నుంచి రీల్స్ చేస్తూ రచ్చ చేసిన అర్ష్‌దీప్ సింగ్, చాలా వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట. అయితే ఇది మనసులో పెట్టుకున్న అర్ష్‌దీప్ సింగ్ ఇప్పుడు పోస్టులన్నీ డిలీట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
అలాగే పంజాబ్ కింగ్స్ జట్టుకు గుడ్ బై చెప్పి, వేరే ఫ్రాంచైజీకి ఆడాలని డిసైడ్ అయ్యాడట. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. త్వరలోనే ఈ న్యూస్ బ్లాస్ట్ కానున్నట్లు కూడా చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా, 2019 నుంచి ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అర్ష్‌దీప్ సింగ్. మొదట్లో 20 లక్షలు తీసుకున్నాడు అర్ష్‌దీప్ సింగ్. 2026 ఐపీఎల్ మినీ వేలం సందర్భంగా రూ.18 కోట్లు పెట్టి రిటైన్ తీసుకుంది పంజాబ్ కింగ్స్. అయితే అర్ష్‌దీప్ సింగ్ బయటకు వెళ్లినా కూడా రూ.20 కోట్లకు ఏ మాత్రం తగ్గబోడని అంటున్నారు.
🚨 Arshdeep Singh to leave Punjab Kings?🚨
🔺Arshdeep Singh has changed his profile picture and even removed PBKS from his Instagram bio.❌
🔺He has also removed all PBKS-related posts. ❌
🔺He deleted over 234 posts in the last 24 hours. Yesterday, his overall post count was… pic.twitter.com/M9BXwJvK2l
— Indian Cricket (@IPL2025Auction) May 26, 2026