Ashwin On Ms Dhoni Stumping: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (Ms Dhoni ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007 సమయంలో టీమిండియా జట్టులోకి వచ్చిన మహేందర్ సింగ్ ధోనీకి వెంటనే కెప్టెన్సీ ఇచ్చింది బీసీసీఐ. ఈ క్రమంలో 2007 టీ20 ప్రపంచ కప్ గెలిపించిన మహేంద్రసింగ్ ధోని.. ఆ తర్వాత మూడు ఫార్మాట్లకు కెప్టెన్ అయిపోయాడు. అనంతరం 2011 వన్డే వరల్డ్ కప్ (2011 ODI World Cup) తీసుకువచ్చిన ధోని, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా జట్టుకు అందించాడు. కెప్టెన్ గా సక్సెస్ కావడమే కాకుండా వికెట్ కీపర్ గా ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు మహేంద్రడు.
కెప్టెన్ గానే కాకుండా వికెట్ కీపర్ గా అద్భుతంగా రాణించిన మహేంద్ర సింగ్ ధోనిపై ( MS DHoni) తాజాగా రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రశంసల వర్షం కురిపించారు. మహేంద్ర సింగ్ ధోనీ లాంటి ఆటగాడు టీమిండియా కు కెప్టెన్ గా కొనసాగడం అదృష్టం అన్నారు. అతని శకం మహాద్భుతం అంటూ కితాబు ఇచ్చారు. ధోని కెప్టెన్సీ లోనే మూడు ట్రోఫీలు రావడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. కెప్టెన్ గానే కాకుండా ధోని వికెట్ కీపర్ గా అద్భుతంగా రాణించాడని ప్రశంసించారు. స్టంపింగ్ విషయంలో ధోనీని కొట్టే మొనగాడు లేడని కొనియాడారు.
బౌలర్ కు ముందే హింట్ ఇచ్చి మరీ… స్టంప్ ఔట్ చేస్తాడని వెల్లడించారు. ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( IND VS ENG) మధ్య గతంలో మ్యాచ్ జరిగిందని గుర్తు చేసిన అశ్విన్.. ఆ సందర్భంగా ధోని చేసిన స్టంపింగ్ గురించి కూడా తెలిపాడు. తాను బౌలింగ్ చేస్తున్నప్పుడు వైడ్ బాల్ వెయ్యాలని ధోని తనకు చెప్పాడని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో బ్యాటర్ క్రీజు వదిలి బయటకు రావడంతో స్టంపింగ్ (Dhoni stumping) చేశాడని వెల్లడించారు. మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనకాల ఉంటే… బ్యాటర్ ప్యాంట్లు తడుపుకోవాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గానే కాకుండా వికెట్ కీపర్ గా కూడా రాణించాడు. ఇప్పటి వరకు వన్డేలలో 123 స్టంపింగులు చేసి ప్రపంచంలోనే మొట్ట మొదటి వికెట్ కీపర్ గా రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో 38 మాత్రమే స్టంపింగ్స్ చేశాడు. టి20 లలో 34 చేసిన ధోని… మొత్తం ఎనిమిది వందల ఇరవై తొమ్మిది డిస్మిస్ లు చేశాడు. ఇప్పటి వరకు మార్క్ బౌచర్ 998 డిస్మిస్ లతో మొదటి స్థానంలో ఉండగా గిల్ క్రిస్ట్ 905 డిస్మిస్లు చేశాడు. ఆ తర్వాత మూడో స్థానంలో ధోనినే ఉన్నాడు.