Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో ఇవాళ భారత్ వర్సెస్ ఒమన్ మధ్య నామమాత్రపు మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే గ్రూపు ఏ నుంచి టీమిండియా ఏ1, పాకిస్తాన్ ఏ2, గ్రూపు బీ నుంచి శ్రీలంక బీ1, బంగ్లాదేశ్ బీ2 మ్యాచ్ లు జరుగనున్నాయి. అయితే ఈ మ్యాచ్ లు రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి. తొలుత బీ1 శ్రీలంక వర్సెస్ బీ2 బంగ్లాదేశ్ మ్యాచ్ రేపు ఉండనుంది. మరోవైపు ఈనెల 21న ఏ1 భారత్, ఏఈ పాకిస్తాన్ మధ్య సూపర్ 4 లో మ్యాచ్ జరుగనుంది. ఇటీవలే సెప్టెంబర్ 14న లీగ్ దశలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ రిఫరీ ఆండి పైక్రాప్ట్ ప్రవర్తన పై పీసీబీ – ఐసీసీకి మధ్య తలెత్తిన వివాదం పరిష్కారం అయింది.
Also Read : Mohammad Nabi 5 Sixes : ఒకే ఓవర్ లో 5 సిక్సర్లు కొట్టిన నబీ… అంతలోనే అతడికి గుండెపోటు… పెను విషాదంలో శ్రీలంక
అయితే పాకిస్తాన్ ఆడే ఆసియా కప్ 2025 మ్యాచ్ ల నుంచి పైక్రాప్ట్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ.. పలు లేఖలు పంపించారు. ఆ తరువాత “అపార్థం” చేసుకున్నందుకు క్షమాపణలు తొలగించాలని డిమాండ్ చేస్తూ లేఖలు పంపించారు. వివాదం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. అయితే పైక్రాప్ట్ తో జరిగిన సమావేశంలో కొన్ని ప్రోటోకాల్ లను ఉల్లంఘించినందుకు పీసీబీ పై చర్యలు తీసుకోవాలని ఐసీసీ పరిశీలిస్తోంది. ముఖ్యంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గ్రూపు ఏ మ్యాచ్ సందర్భంగా పైక్రాప్ట్ టాస్ నిర్వహించడానికి ముందు ఏం జరిగిందో ఓ నివేదికక క్లియర్ గా వివరించింది. సరిగ్గా టాస్ వేయడానికి 4 నిమిషాల ముందు సూర్యకుమార్ యాదవ్, సల్మాన్ అలీ అఘా మధ్య హ్యాండ్ షేక్ లేదు. ప్రోటో కాల్ గురించి పైక్రాప్ట్ కి సమాచారం అందింది. పైక్రాప్ట్ మైదానంలోకి దిగే ముందు ఆసియా క్రికెట్ కౌన్సిల్ వేదిక మేనేజర్ హ్యాండ్ షేక్ లేదు సందేశాన్ని కలిగించమని అడిగాడు.
భారత ప్రభుత్వ ఆమోదంతో బీసీసీఐ నుంచి సందేశం వచ్చిన తరువాత ఏసీసీ వేదిక మేనేజర్ ఆదేశాలు వచ్చాయి. టాస్ కి ముందే కెప్టెన్ సూర్యకుమార్, సల్మాన్ అఘా కరచాలనం ఉండదు అని నిర్ణయించారు. పైక్రాప్ట్ నో హ్యాండ్ షేక్ ప్రోటోకాల్ గురించి ఐసీసీకి తెలియజేయాల్సిందని.. జింబాబ్వే రిఫరీకి అలా చేయడానికి తగినంత సమయం లేదని పీసీబీ పేర్కొంది. అయినప్పటికీ మళ్లీ ఈ వివాదాన్ని రెచ్చగొట్టింది పాకిస్తాన్. అప్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాగ్ లు సర్దుకొని హోటల్ కి వెళ్లారు. పాకిస్తాన్ వర్సెస్ అప్గానిస్తాన్ మధ్య మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభం అయింది. ఆ తరువాత టీమిండియా పై పాకిస్తాన్ నెగిటివ్ కామెంట్స్ చేస్తోంది. సెప్టెంబర్ 21న జరిగే మ్యాచ్ కి పాకిస్తాన్ ఎలాంటి వివాదాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.