Amaravati Crda office: ఏపీ రాజధాని అమరావతిలో శాశ్వత భవనాల పనులు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి రెడీ అయ్యింది. తొలుత ఆగష్టు 15 నాటికి ప్రారంభించాలని భావించినప్పటికీ అనుకోకుండా వెనక్కి వెళ్లింది. ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో పడ్డాయి. వీలైనంత త్వరగా వాటిని పూర్తి పూర్తి చేయాలని భావిస్తోంది.
అందుకు సంబంధించి పనులు జోరందుకున్నాయి. రాయపూడిలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఈ భవనం నిర్మాణం జరుగుతోంది. ఈ భవనాన్ని దాదాపు మూడున్నర ఎకరాల్లో నిర్మిస్తున్నారు మొత్తం ఏడు అంతస్తులతో అందులో ఉంటున్నాయి. ఈ కార్యాలయం కోసం ఏకంగా రెండున్నర చదరపు అడుగులు స్థలాన్ని కేటాయించారు.
గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉండనుంది. అందులో అమరావతి సిటీతోపాటు ట్రాఫిక్, భద్రత, పారిశుద్ధ్యం, వరదలు వంటి అంశాలపై రివ్యూ చేయనున్నారు. ఈ కార్యాలయ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం విజయవాడలోవున్న ఆఫీసును మెప్మాకు అప్పగించాలని డిసైడ్ అయ్యారు అధికారులు.
అమరావతిలో తొలి శాశ్వత భవనం ప్రారంభానికి సిద్ధమైంది. గతేడాది అక్టోబరు 19న సీఎం చంద్రబాబు అమరావతి పునర్నిర్మాణ పనులను అక్కడి నుంచే మొదలుపెట్టారు. ఈ భవనాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. తొలుత ఆగష్టు 15న సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించాలని భావించినప్పటికీ ఆ రోజు ఉచిత బస్సు ప్రారంభం కార్యక్రమాల నేపథ్యంలో వెనక్కి వెళ్లింది.
ALSO READ: వేగంగా భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు.. బీచ్ కారిడార్‌పై ఫోకస్
వినాయక చవితి తర్వాత దసరా నాటికి అంతా రెడీ కావచ్చని అంటున్నారు. దీనికి సంబంధించి వీడియో బయటకు వచ్చింది. లోపల చూస్తే చైనా భవనాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో కనిపిస్తోంది. పతీ ఫ్లోర్‌లో విశాలమైన గదులు, కాన్ఫరెన్సు హాలు పరిశీలించినవారు చైనాలో నిర్మించే భవనాలకు ఏ మాత్రం తగ్గదని అంటున్నారు.
ఒక్క సీఆర్ఢీయే భవనం ఈ స్థాయిలో ఉంటే మార్చి నాటికి ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉంటాయోనని అంటున్నారు. అన్నట్లు మార్చి నాటికి ఎమ్మెల్యే గృహాలను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యింది ప్రభుత్వం. ఇలా ఒకొక్కటిగా భవనాలు పూర్తి కానుండడంతో ఆ ప్రాంతవాసుల్లో ఆనందం మిన్నంటాయి.
CRDA భవనం లోని లోపలి దృశ్యాలు…
ఆగస్ట్ 15 న CRDA భవనం కొన్ని పనుల వల్ల వాయిదా వేయడం జరిగింది.. #ChandrababuNaidu #TDPTwitter #Naralokesh #AndhraPradesh pic.twitter.com/NvN5SCVeta
— 𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀 (@Trends4TDP) August 19, 2025