Nitish Kumar Reddy : సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. గత ఏడాది ఐపీఎల్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ కలిసి చాలా మ్యాచ్ లను గెలిపించారు. మరోవైపు నితీశ్ రెడ్డి బౌలింగ్ కూడా బాగానే చేశాడు. దీంతో మరో హార్దిక్ పాండ్యా అని అందరూ పొగిడారు. కానీ ఈ సీజన్ లో మాత్రం అంతగా రాణించడం లేదు. నిన్న గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం 10 బంతుల్లో 21 పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించాడు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయింది.
Also Read : RCB Goodluck Donation: ఆర్సీబీ కోసం రూ.10 డొనేట్ చేయండి.. ఐపిల్ కప్ కొట్టాలని ప్లీజ్ ప్రార్థించండి
ప్రస్తుతం నితీశ్ కుమార్ రెడ్డి పై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొడుకు నితీశ్ రెడ్డి సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆడుతుంటే.. తండ్రి ముత్యాల రెడ్డి మాత్రం ఎవ్వరూ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆర్సీబీ జెర్సీ వేసుకొని జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ కనిపించడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. తన కొడుకు సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నప్పటికీ ఆర్సీబీ జెర్సీ వేసుకోవడం వైరల్ గా మారుతోంది. నితీశ్ కుమార్ రెడ్డితో పాటు వారి కుటుంబం మొత్తం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి పెద్ద ఫ్యాన్స్. ఐపీఎల్ లోకి రాకముందు నితీశ్ కుమార్ ఫ్యామిలీ అంతా కలిసి ఆర్సీబీకి సపోర్ట్ చేసేవారట. ఇప్పటికే నితీశ్ కుమార్ రెడ్డి విరాట్ కోహ్లీకి ఎంత పెద్ద అభిమానో చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. నితీశ్ రెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టక ముందే కోహ్లీ ని లైవ్ లో చూసేందుకు చాలా ఆసక్తి చూపించేవాడు.
ఇక తన టెస్ట్ ఆరంగేట్రం బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో జరిగింది. డెబ్యూ మ్యాచ్ ఆడే సమయంలో కూడా కోహ్లీ చేతుల మీదుగానే టెస్ట్ క్యాప్ అందుకున్నాడు. గత సీజన్ లో సన్ రైజర్స్ తరపున అద్భుతంగా ఆడాడు. ఈ సీజన్ లో మాత్రం ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడితే 173 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు ఈ సీజన్ లో ఆర్సీబీ చాలా అద్భుతంగా ఆడుతోంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ ల్లో 7 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ తో విజయం సాధించినట్టయితే ఆర్సీబీ మరోసారి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. లేదంటే.. అదే మూడో స్థానంలో కొనసాగుతోంది. నితీశ్ రెడ్డి తండ్రి ఆర్సీబీ జెర్సీ వేసుకుంటే.. కొందరూ కామెంట్స్ చేస్తున్నారు. సన్ రైజర్స్ ఆట చూడలేక అంకుల్.. జెర్సీని మార్చేశాడని సెటైర్లు వేస్తున్నారు. మీ అయ్య కూడా జెర్సీ మార్చేశాడు రెడ్డి అని పోస్టులు పెడుతున్నారు. ఈ సీజన్ లో నితీశ్ రెడ్డి దారుణ విఫలమయ్యాడు.