BigTV English

AUS vs PAK 2nd Test : 16 పరుగులకే 4 వికెట్లు .. లడ్డూ లాంటి క్యాచ్ మిస్ చేసిన పాక్.. పట్టు సాధించిన ఆసీస్..

AUS vs PAK 2nd Test :  16 పరుగులకే 4 వికెట్లు .. లడ్డూ లాంటి క్యాచ్ మిస్ చేసిన పాక్.. పట్టు సాధించిన ఆసీస్..
AUS vs PAK 2nd Test

AUS vs PAK 2nd Test : ఆసిస్ – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రసకందాయంలో పడింది. అసలు ఆస్ట్రేలియా బ్యాటర్లకు లైఫ్ లిస్తే, పరిస్థితెలా ఉంటుందో తాజా వరల్డ్ కప్ లో చూశాం. డేవిడ్ వార్నర్ క్యాచ్ ను ఉసామా మిర్ మిస్ చేయడంతో ఆ మ్యాచ్ లో తగిన ఫలితం అనుభవించింది పాక్. 10 పరుగుల వద్ద అవుట్ కావల్సిన వార్నర్ 163 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక సెమీఫైనల్ లో సౌతాఫ్రికా దాదాపు ఆరు క్యాచ్ లు వదిలేయడంతో హాయిగా ఊపిరి పీల్చుకుని వారిని ఓడించి ఫైనల్ లో అడుగుపెట్టింది.


ఇప్పుడదే సీన్ ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో రిపీట్ అయ్యింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 318 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అందుకు బదులుగా పాకిస్తాన్ 264 పరుగులు చేసి 54 పరుగులు వెనుకపడింది. మూడోరోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా అనూహ్యంగా 16 పరుగులకు 4 వికెట్లు పోయి, దిక్కుతోచని స్థితిలో గిలగిల్లాడింది.

ఈ సమయంలో మార్ష్ 20 పరుగుల మీద ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్ ని స్లిప్‌లో అబ్దుల్లా షఫీక్ చేజార్చాడు. పక్కనే ఉన్న మరో ఫీల్డర్ చేతుల్లోకి బంతి వెళ్లినప్పటికీ అతడు కూడా ఆ క్యాచ్ ని నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మార్ష్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. స్మిత్ (50) కూడా అండగా నిలిచాడు. చివరికి 96 పరుగులు చేసి సరిగ్గా సెంచరీకి నాలుగు పరుగుల ముందు మార్ష్ అవుట్ అయిపోయాడు. కాకపోతే  వీరిద్దరూ ఐదో వికెట్‌కు 153 పరుగులు జోడించారు. ఆస్ట్రేలియాను పటిష్ట స్థితిలో నిలబెట్టారు.


చివరికి మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 187 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని  241 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక నాలుగో రోజు మరో 60 పరుగులు చేయగలిగితే.. ఈ టెస్టుపై ఆస్ట్రేలియా పూర్తిగా పట్టు సాధించినట్లే.

ఇప్పటివరకు మెల్ బోర్న్ పిచ్ పై సెకండ్ ఇన్నింగ్స్ లో 300 స్కోరుని ఛేజ్ చేయలేదు. అందుకే పాకిస్తాన్ కి ఈరోజు కూడా నిద్ర పట్టదు. 16 పరుగులకే  4 వికెట్లు, మార్ష్  వికెట్టు కూడా తీసి ఉంటే ఆసిస్ కథ మరోలా ఉండేది. పాకిస్తాన్ కథ ఒకలా ఉండేది. నిజమే కదా…క్యాచ్ మిస్ చేస్తే మ్యాచ్ పోయినట్టే అనే మాట మరోసారి రుజువైంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×