BigTV English

Travis head: ఆస్ట్రేలియా కుట్రలు…. ట్రావిస్ హెడ్ ఔట్ లో సరికొత్త వివాదం

Travis head: ఆస్ట్రేలియా కుట్రలు…. ట్రావిస్ హెడ్ ఔట్ లో సరికొత్త వివాదం

Travis head: బ్రిడ్జ్ టౌన్ లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా – వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ జరుగుతోంది. ఈ తొలి టెస్ట్ లో టాస్ గెలిచిన ప్యాట్ కమీన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా తొలి రోజు ఇన్నింగ్స్ లో 180 పరుగులకే ఆల్ అవుట్ అయింది. వెస్టిండీస్ బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటర్స్ విలవిలలాడారు. ప్రపంచ క్రికెట్ ని ఆస్ట్రేలియా భయపెడుతుంటే.. ఆసీస్ కి వెస్టిండీస్ దడ పుట్టించింది.


Also Read: varsha bollamma: కోహ్లీ అంటే మోజు… RCB జట్టులోకి టాలీవుడ్ హీరోయిన్.. బ్యాట్ పట్టిమరీ

ముగ్గురు, నలుగురు ఆస్ట్రేలియా బ్యాటర్లు మినహా మిగతా అందరూ సింగిల్ డిజిట్ కే పెవిలియన్ బాట పట్టారు. మెరుపు వేగంతో దూసుకు వస్తున్న బంతులను టచ్ చేయడానికి కూడా ఆస్ట్రేలియా బ్యాటర్లు భయపడ్డారు. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ పై గత 30 ఏళ్లలోనే అత్యల్ప స్కోర్ ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో ట్రావీస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా ఇన్నింగ్స్ ని కాసేపు నిలబెట్టారు.


వీరిద్దరూ 4 వ వికెట్ కి 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ 11 పరుగుల వద్ద ఉస్మాన్ ఖవాజా కూడా అవుట్ కావడంతో.. ఆ తరువాత 69 పరుగుల వ్యవధిలోనే ఆస్ట్రేలియా జట్టు మిగతా వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో శామ్ కోన్స్టాస్ 3, ఉస్మాన్ ఖవాజా 47, కామెరున్ గ్రీన్ 3, జోస్ ఇంగ్లీస్ 5, ట్రావీస్ హెడ్ 59, డ్యూ వెబ్స్టర్ 11, అలెక్స్ క్యారీ 8, ప్యాట్ కమీన్స్ 28, మిచెల్ స్టార్క్ 0, నాథన్ లయన్ 9, హేజిల్ వుడ్ 4 పరుగులు చేశారు.

ఇక వెస్టిండీస్ జట్టులో జేడెన్ సీల్స్ 5 వికెట్లు పడగొట్టగా.. షమార్ జోసెఫ్ నాలుగు వికెట్లు తీశాడు. జస్టిన్ గ్రీవ్స్ కి ఒక వికెట్ దక్కింది. అయితే ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో ట్రావీస్ హెడ్ అవుట్ అయిన విధానం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. జస్టిన్ గ్రీవ్స్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు హెడ్. కానీ బంతి బ్యాట్ అంచున తగిలి కీపర్ వైపు వెళ్ళింది. ఆబంతి నేలపై పడ్డాక కీపర్ హోప్ క్యాచ్ తీసుకున్నాడని.. హెడ్ ని కావాలనే ఔట్ గా ప్రకటించారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Also Read: Suryakumar Yadav: సూర్యకు ప్రమాదకరమైన వ్యాధి… టీమిండియా కెప్టెన్ గా సర్పంచ్ సాబ్

హెడ్ ని అవుట్ గా ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు క్రీడాభిమానులు. ఇక వెస్టిండీస్ బ్యాటింగ్ మొదలుపెట్టిన వెంటనే ఆస్ట్రేలియా బౌలర్లు దాడికి దిగారు. స్టార్క్, ప్యాట్ కమీన్స్, హేజిల్ వుడ్ దెబ్బకు ప్రత్యర్ధులు కూడా పెవిలియన్ బాట పట్టారు. ఈ నేపథ్యంలో స్టార్క్ బ్రాత్ వైట్, జాన్ క్యాంప్ బెల్ ని అవుట్ చేయగా.. కమీన్స్ కార్టీని, హేజిల్ వుడ్ జోమెల్ వారికన్ వికెట్ పడగొట్టాడు. దీంతో వెస్టిండీస్ ప్రస్తుతం 57 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయింది.

Related News

Hardik Pandya: ఒక‌టి కాదు రెండు కాదు, ఏకంగా 8 మందిని వాడుకున్న‌ హార్దిక్ పాండ్యా?

INDW vs AUSW: స్నేహ రాణా క‌ల్లుచెదిరే క్యాచ్‌…టీమిండియాకు మ‌రో ఓట‌మి.. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి ఆసీస్‌

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న రికార్డులు…ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఇక ర‌చ్చ ర‌చ్చే

Thaman: ముర‌ళీధ‌ర‌న్ ను మించిపోయిన త‌మ‌న్.. 24 ప‌రుగుల‌కే 4 వికెట్లతో తాండ‌వం

Virat Kohli: RCBకి ఎదురుదెబ్బ.. కోహ్లీ షాకింగ్ నిర్ణయం… అగ్రిమెంట్ రద్దు!

Rahkeem Cornwall Helmet: జ‌స్ట్ మిస్‌… బుల్లెట్ లా దూసుకొచ్చిన బంతి…హెల్మెట్ లో ఇరుక్కుని మ‌రి..!

Smriti Mandhana: స్మృతి మందాన 28 ఏళ్ల‌ చ‌రికొత్త రికార్డు..1000 ప‌రుగులు క్రాస్, ఆసీస్ పై భారీ స్కోర్‌

Ind vs WI: 5 వికెట్ల‌తో చెల‌రేగిన‌ కుల్దీప్…మొద‌టి ఇన్నింగ్స్ లో విండీస్ ఆలౌట్‌..స్కోర్ వివ‌రాలు ఇవే

Big Stories

×