Viral Video: సమయం, సందర్భం ఏంటో తెలీదు. యువకుడ్ని ఓ పాము కరిచింది. దాన్ని పట్టుకుని సంచిలో వేసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ పాముని సిబ్బందికి చూపించాడు. పాము బయటకు తీసేసరికి సిబ్బంది పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
రాజస్థాన్‌లోని జైపూర్ సిటీకి చెందిన ఓ యువకుడికి పాము కరిచింది. అది ఏ తరహా స్నేక్ అనేది తెలీదు. ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు రకరకాల ప్రశ్నలు వేస్తారని ఊహించాడు. వారికి తగ్గట్టుగానే కరిచిన పామును పట్టుకుని బ్యాగ్‌లో వేసుకుని రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి వెళ్లాడు. ఆ వ్యక్తి కనిపించగానే పేషెంట్‌కి చెందిన వ్యక్తి అని భావించారు.
ఇంకేముందు వెంటనే తన బ్యాగ్‌లో ఉన్న స్నేక్‌ని బయటకు తీశాడు. వెంటనే అక్కడ సిబ్బంది పరుగులు తీశారు. ఆ పాము తనను కరిచిందని, అద విషపూరితమైనదా? కాదా? సిబ్బందితోపాటు డాక్టర్లను ప్రశ్నించాడు. దాదాపు ఆరు అడుగుల పైనే ఉంది. ఆ తర్వాత తేరుకున్న సిబ్బంది ఆ వ్యక్తి నుంచి డీటేల్స్ తీసుకున్నారు.
తనను ఈ పాము కరిచిందని, విషపూరితమైనదైతే వెంటనే ట్రీట్‌మెంట్ చేయాలని కోరాడు. విషపూరితమైనదా కాదా అని ఇంకా అధికారులు గుర్తించలేదు. చివరకు ఆవ్యక్తికి చికిత్స చేశారు. ఆ సమయంలో ఆసుపత్రిలో రోగులు వద్ద నున్న కొంతమంది ఈ సన్నివేశాన్ని తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేశారు.
ALSO READ: కారుతో రైలు పట్టాలపైకి దూసుకొచ్చిన యువతి, హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన
ఈ వ్యవహారం ఆన్‌లైన్‌లో విస్తృత చర్చకు దారి తీసింది. గుర్తింపు కోసం పాముని తీసుకురావడంలో ఆ వ్యక్తి చూపిన ధైర్యాన్ని చాలామంది మెచ్చుకున్నారు. మరికొందరు మాత్రం తప్పుబట్టారు. ఈ ఘటన నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ మంగళ్ ఈ విషయాన్ని ధృవీకరించారు.
ఓ వ్యక్తి తనతో పాటు పామును ఆసుపత్రికి తీసుకువచ్చాడని తెలిపారు. ఆ తర్వాత అతడి కుటుంబసభ్యులు పామును తీసుకెళ్లారని మరొక అధికారి తెలిపారు. ఈ తరహా ఘటనలు జరగడం ఇదేం కొత్తకాదు. గతేడాది బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఇదే విధంగా జరిగింది.
ప్రకాష్ మండల్ అనే వ్యక్తి మెడకు ప్రాణాంతకమైన పాముని మెడలో వేసుకుని ఆసుపత్రికి వచ్చాడు. అతడ్ని చూసి వైద్య సిబ్బంది షాకయ్యారు. చికిత్స సమయంలో స్నేక్‌ని వదలడానికి నిరాకరించాడు. ప్రాణాలు కాపాడాలంటే పాము వదిలివేయడం ఒక్కటే మార్గమని నచ్చజెప్పడంతో వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత డాక్టర్లు అతడికి ట్రీట్‌మెంట్ చేశారు.
जयपुर के RUHS अस्पताल में एक अनोखा वाकया सामने आया, जब सांप के डसने के बाद एक युवक इलाज के लिए अस्पताल पहुंचा लेकिन साथ में जिंदा सांप भी ले आया। युवक ने इमरजेंसी के बाहर अपने बैग से सांप निकालकर स्टाफ को दिखाया, जिससे अस्पताल में अफरातफरी मच गई। #Jaipur #jaipurviralvideo #snake pic.twitter.com/vyS3aFz7uc
— Viral News Vibes (@viralnewsvibes) June 26, 2025