Siraj vs Travis head: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా…. ఈ టోర్నమెంట్ జరుగుతోంది. అయితే టోర్నమెంట్లో… మొదటి టెస్ట్ గెలిచిన టీమిండియా… ప్రస్తుతం ఆస్ట్రేలియాతో రెండవ టెస్టు ఆడుతోంది. డిసెంబర్ ఆరవ తేదీన అంటే నిన్న… ఈ మ్యాచ్ ప్రారంభమైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే… టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా ( Team India)… అట్టర్ ఫ్లాప్ అయింది.
Also Read: Pink Ball vs Red Ball: పింక్ బాల్ వర్సెస్ రెడ్ బాల్… వీటి మధ్య తేడా ఇదే!
టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 180 పరుగులకు ఆల్ అవుట్ అయింది. టీమిండియా టాపార్డర్ బ్యాటర్స్ ఎవరు కూడా రాణించకపోవడంతో… దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటుంది టీమిండియా. బ్యాటింగ్ లో విఫలమైన టీమిండియా…. బౌలింగ్ లో కూడా పెద్దగా రాణించలేదు. టీమిండియాను ఆస్ట్రేలియా కట్టడి చేసినట్లు మన భారత బౌలర్లు… ఆ స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్లపై మాటల దాడి కూడా చేస్తున్నారు టీమిండియా బౌలర్లు. Siraj Siraj vs Travis head
ఈ లిస్టులో హైదరాబాది స్టార్ మహమ్మద్ సిరాజ్ ముందు వరుసలో ఉన్నాడు. ఆట మొదటి రోజునే లాబుశేన్ తో గొడవ పెట్టుకున్న మహమ్మద్ సిరాజ్… రెండో రోజు కూడా అదే అగ్రేసివుతో ముందుకు వెళ్లాడు. అయితే ఈ మ్యాచ్ లో 4 వికెట్లు పడగొట్టిన సిరాజ్… డేంజర్ హెడ్ వికెట్ తీశాడు. 140 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ను క్లీన్ బోల్డ్ చేశాడు మహమ్మద్ సిరాజ్. అయితే హెడ్ ను క్లీన్ బోల్డ్ చేయగానే… మహమ్మద్ సిరాజ్ పై… ఒక్కసారిగా సీరియస్ రియాక్షన్ ఇచ్చాడు హెడ్.
Also Read: IPL 2025: RCB లో ప్రకంపనలు..ఆ ప్లేయర్ రిటైర్మెంట్.. ఒంటరైన విరాట్ కోహ్లీ ?
సిరాజును బూతులు తిట్టినట్లు… హెడ్ వాలకం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. దీంతో ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై తాజాగా హెడ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. తనను అవుట్ చేశాక మహమ్మద్ సిరాజును తానేమి బూతులు తిట్టలేదని హెడ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మహమ్మద్ సిరాజును ఉద్దేశించి… ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్ అన్నారు.
తనను బోల్డ్ చేయగానే మంచి బంతి వేశావని మహమ్మద్ సిరాజును…. మెచ్చుకున్నట్లు ట్రావిస్ హెడ్ తెలిపాడు. కానీ సిరాజ్ కు అది అర్థం కానట్టు ఉంది… అతను వేరే లాగా అర్థం చేసుకున్నాడు అని వెల్లడించాడు హెడ్. దాంతో తనను పెవిలియన్ కు వెళ్ళిపో అంటూ సిరాజ్ హెచ్చరించినట్లు.. చెప్పుకొచ్చాడు హెడ్. వాళ్లు తప్పుగా అర్థం చేసుకొని… ఇలా రచ్చ చేస్తే… తామేమి చేయలేమని… అది టీమిండియా విధేయతకు వదిలేస్తామని హెడ్ చెప్పుకొచ్చాడు.
A sizeable crowd behind Australia…
A billion behind Siraj 💙#AavaDe | #AUSvIND— Gujarat Titans (@gujarat_titans) December 7, 2024