BigTV English

WTC Final 2025: సఫారీల వేట మొదలు…WTC ఫైనల్ లో చేతులెత్తేసిన ఆస్ట్రేలియా…!

WTC Final 2025: సఫారీల వేట మొదలు…WTC ఫైనల్ లో చేతులెత్తేసిన  ఆస్ట్రేలియా…!

WTC Final 2025: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఇవాళ ప్రారంభమైన సంగతి తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ మైదానంలో కాసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన… ఆస్ట్రేలియా తడబడుతోంది. సఫారీల బౌలింగ్ దెబ్బకు.. కంగారులు కంగారెత్తిపోతున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో తొలిరోజు లంచ్ సమయానికి… నాలుగు వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. లంచ్ సమయానికి 23.2 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా… 67 పరుగుల చేసి, 4 వికెట్లు కోల్పోయింది.


Also Read: Tino Best: 650 మంది మహిళలతో శృ***గారం.. ఆ వెస్టిండీస్ క్రికెటర్ టినో బెస్ట్ అరాచకాలు

ప్రస్తుతం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 26 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నా. అటు ఖవాజా డక్ అవుట్ కాగా లబు షేన్ 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గ్రీన్ నాలుగు పరుగులు చేయగా హెడ్ 11 పరుగులు చేసి దారుణంగా విఫలమయ్యారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో రబడ, జాన్ సెన్ చిరు రెండు వికెట్లు తీశారు. మొత్తానికి లంచ్ సమయానికి ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది.


ఆస్ట్రేలియా కెప్టెన్ అరుదైన రికార్డులు

ఆస్ట్రేలియా ప్రస్తుత కెప్టెన్ కమీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని కెప్టెన్సీలో… ఆస్ట్రేలియా జట్టు ప్రతి ఫైనల్ గెలుస్తూ వస్తోంది. ఇప్పటికే చాలా టైటిల్లు ఆస్ట్రేలియా జట్టుకు అందించాడు కమీన్స్. అప్పట్లో రికీ పాంటింగ్ ఎలా అయితే జట్టుకు విజయాలను అందించాడు ఇప్పుడు బౌలర్గా రాణిస్తూనే… ఆస్ట్రేలియా జట్టును విజయతీరాలకు చేర్చుతున్నాడు ఫ్యాట్ కమిన్స్. తనకంటే సీనియర్లు అలాగే జూనియర్లు ఉన్నప్పటికీ… జట్టును సమతుల్యంగా నడిపిస్తూ ముందుకు సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ దాకా ఆస్ట్రేలియా వచ్చింది.

వణికిస్తున్న టెంబ బావుమా

దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబ బావుమా ఆధ్వర్యంలో ఆ జట్టు ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ కూడా ఓడిపోలేదు. ఇప్పుడు ఇదే విషయం ఆస్ట్రేలియా ప్లేయర్లను వణికిస్తోంది. అత్యంత ప్రమాదకరంగా.. దక్షిణాఫ్రికా జట్టును తయారుచేశాడు బావుమా. అతడు ఉన్న హైట్ తక్కువ అయినప్పటికీ.. జట్టుకు మాత్రం చాలా విజయాలను అందించి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఇదే విషయం.. ఆస్ట్రేలియాను వణికిస్తోంది. అందుకే ప్రస్తుతం ఉన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబ బావుమా ఆధ్వర్యంలో టైటిల్ గెలుస్తుందని అక్కడి అభిమానులు అంచనా వేస్తున్నారు. లండన్ లోని లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్… ఇద్దరికీ చాలా కీలకము కావడంతో రెండు జట్లు కూడా చాలా బలంగా ముందుకు వెళ్తాయి. ఇవాల్టి మొదటి ఇన్నింగ్స్ లో… ఆస్ట్రేలియా తక్కువగా ఆడిందని ఎప్పుడూ కూడా అంచనా తక్కువ వేసుకోకూడదు. రేపు పొద్దున దక్షిణాఫ్రికాను తక్కువ పరుగులకే… ఆల్ అవుట్ చేసే దమ్ము అలాగే ధైర్యం ఆస్ట్రేలియా సొంతం. కాబట్టి దక్షిణాఫ్రికా ప్లేయర్లు జాగ్రత్తగా ఉంటూనే ఆస్ట్రేలియాను ఎదురు దాడి చేయాలి.

Also Read: MS Dhoni: MS ధోనికి గొప్ప గౌరవం.. ఐసీసీ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు.. ఇప్పుడే అసలు గౌరవం

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×