Glenn Maxwell Retirement: ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు, పంజాబ్ కింగ్స్ గ్లెన్ మాక్స్‌వెల్ ( Australian player Glenn Maxwell ) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ( Glenn Maxwell Retirement )ప్రకటిస్తూ… కీలక నిర్ణయం తీసుకున్నాడు మ్యాక్సీ మామ. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశాడు గ్లెన్ మాక్స్‌వెల్. టి20 లకు అందుబాటులో ఉంటానని… ఇకపై వన్డే క్రికెట్ ఆడ బోనానికి కూడా ఈ సందర్భంగా ప్రకటించాడు. ఏజ్ బార్ కావడం, వ్యక్తిగత సమస్యలు, ఇతర ఇష్యుల నేపథ్యంలో… వన్డే క్రికెట్ కు గ్లెన్ మాక్స్‌వెల్ రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
ఇక అంతర్జాతీయ వన్డే క్రికెట్ కు గ్లెన్ మాక్స్‌వెల్… రిటైర్మెంట్ ప్రకటించడంతో… ఆయన అభిమానులు ఒక్కసారిగా కంగు తిన్నారు. ఇలాంటి ప్రకటన తాము ఊహించలేదని… ఇంకోన్నాళ్ళూ క్రికెట్ ఆడితే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే గ్లెన్ మాక్స్‌వెల్ టి20 లో ఆడతానని ప్రకటించడంతో కాస్త కూల్ అయ్యారు అభిమానులు.
మాక్సి మామ వ్యక్తిగత రికార్డులు, పరుగులు
ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు మ్యాక్సీ మామ ( Australian danger player Glenn Maxwell )… తన కెరియర్లో అనేక రికార్డులు.. చేరుకున్నాడు. 2012 నుంచి ఇప్పటివరకు… అన్ని ఫార్మాట్స్ లో అద్భుతంగా రాణించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2013 మార్చి రెండవ తేదీన ఇండియాతో జరిగిన… టెస్ట్ మ్యాచ్ తోనే.. మ్యాక్సీ మామ కెరియర్ మొదలైంది. ఇక చివరి టెస్టు 2017 సెప్టెంబర్ 4వ తేదీన బంగ్లాదేశ్ జట్టుతో ఆడేశాడు. ఇక 2012 ఆగస్టు 25వ తేదీన తొలి వన్డే మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ తో జరిగింది. అప్పుడు మాక్సిమామ ఎంట్రీ ఇచ్చాడు. ఇక.. 2023 సెప్టెంబర్ 27వ తేదీన టీమిండియాతో చివరి వన్డే ఆడేశాడు. టి20 లో విషయానికి వస్తే… 2012 సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన పాకిస్తాన్ తో జరిగిన టి20లో అరంగేట్రం చేశాడు. 2022 నవంబర్ 4వ తేదీ ఆఫ్ఘనిస్తాన్తో చివరి t20 మ్యాచ్ కూడా ఆడాడు. టి20లో.. మాక్సి మామ కొనసాగుతున్న నేపథ్యంలో… ఫ్యాన్స్ కాస్త… రిలాక్స్ అయ్యారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మాక్సిమామ ప్రయాణం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో మ్యాక్సీ మామ అద్భుతంగా రాణించేవాడు. ఈమధ్య ఫాం కోల్పోయిన మ్యాక్సీ మామ… అంతకుముందు మాత్రం రెచ్చిపోయేవాడు. 2012, 2018 సంవత్సరాలలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహించాడు. 2013 సంవత్సరంలో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడాడు మ్యాక్సీ మామ. ఆ తర్వాత 2014 నుంచి 2017 వరకు అలాగే 2020లో… పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2021 నుంచి 2024 ఐపిఎల్ వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడాడు. 2025 టోర్నమెంట్ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు మళ్ళీ వెళ్ళాడు.
Also Read: Priyansh Arya football: వాళ్ళు తన్నడం, వీడు తన్నించుకోవడం…అందరూ సరిపోయారు.. పిల్ల బచ్చాను చేసి
🚨 GLENN MAXWELL ANNOUNCED HIS RETIREMENT FROM ODI CRICKET.
🏆 2015 Cricket World Cup Winner
🏆 2023 Cricket World Cup Winner
🔥 Played the greatest knock in ODI history (201* vs Afghanistan, 2023)Thank you, Maxi, for the memories ❤️🫡pic.twitter.com/IFUIZtBvD8
— junaiz (@dhillow_) June 2, 2025