BigTV English

Ravichandran Ashwin : రాజ్ కోట్ టెస్టు.. అశ్విన్ రికార్డుల మోత..

Ravichandran Ashwin : రాజ్ కోట్ టెస్టు.. అశ్విన్ రికార్డుల మోత..

Ravichandran Ashwin New Record (latest sports news)


37 ఏళ్ల రవిచంద్రన్ అశ్విన్.. టీమ్ ఇండియాలో సీనియర్ క్రికెటర్. క్రీజులోకి దిగాడంటే చాలా సీరియస్ గేమ్ ఆడతాడు. చాలా కమిట్ మెంట్ తో ఆడతాడు. ఆటపై ప్రేమ, గౌరవం, అభిమానం, అంకిత భావం ఉన్న అతికొద్దిమంది ఆటగాళ్లలో తను కూడా ఒకడంటే అతిశయోక్తి కాదు.

అంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ లో ఒక ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ క్రాలేను అవుట్ చేసి టెస్టు క్రికెట్ లో 500 వికెట్ల క్లబ్ లో చేరాడు. రాజ్ కోట్  మైదానంలో మూడో టెస్ట్ లో ఈ మైలురాయిని దాటాడు.


అంతేకాదు టెస్టుల్లో 500 వికెట్లు వేగంగా తీసిన భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు.  98 టెస్టుల్లో ఈ మార్క్ ని అశ్విన్ చేరుకుంటే, తనకన్నా ముందు అనిల్ కుంబ్లే ఉన్నాడు. తనకి 500 వికెట్లు తీయడానికి 105 టెస్టులు పట్టింది.

read more : వావ్ ! కేన్ మామా.. టెస్టుల్లో వేగంగా 32 సెంచరీలతో చరిత్ర!

500 వికెట్లతో పాటు పలు రికార్డులు ఒకదాని వెంట ఒకటి అశ్విన్ ఖాతాలో చేరాయి. భారత్ తరఫున అత్యంత వేగంగా 500 వికెట్లు తీస్తే, అంతర్జాతీయంగా చూస్తే శ్రీలంక స్పిన్ దిగ్గజం మురళీధరన్  87 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు. సీరియల్ ప్రకారం చూస్తే టాప్ లో మురళీధరన్ (87), అశ్విన్ (98), అనిల్ కుంబ్లే (105), షేన్ వార్న్ (108), మెక్‌గ్రాత్ (110) ఉన్నారు.

ఇక బంతుల పరంగా చూస్తే వేగంగా 500 వికెట్లు సాధించిన రికార్డులో భారత్ తరఫున అగ్రస్థానంలో ఉన్నాడు. తక్కువ బంతుల్లోనే 500 వికెట్లు తీశాడు. కానీ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇక్కడ కూడా రెండో స్థానంలో నిలిచాడు.

 ఇక్కడ ఎవరంటే ఆస్ట్రేలియా పేసర్ మెక్‌గ్రాత్ టాప్‌లో ఉన్నాడు. అతడు 25,528 బంతుల్లో 500 వికెట్లు తీశాడు. ఆ తర్వాత స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ (25,714)  ఉన్నాడు. కాకపోతే  కేవలం 186 బంతులు మాత్రమే వెనుకపడి ఉన్నాడు. లేదంటే తనే నెంబర్ వన్ గా నిలిచేవాడు.

వీరి తర్వాత మూడో స్థానంలో జేమ్స్ అండర్సన్ (28150), స్టువర్ట్ బ్రాడ్ (28430), కోర్ట్నీ వాల్ష్ (28833) ఉన్నారు. ఇండియన్ క్రికెట్ లో రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్ ను చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. మరో రెండు టెస్టులు ఆడితే 100 టెస్టులు ఆడిన క్లబ్ లో కూడా చేరతాడు. అదొక మధురానుభావం ఇంగ్లాండ్ తోనే తీరనుంది.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×