E-Paper
Advertisement

Psychological Thriller movie: తెల్ల పిల్ల కోసం నల్ల పిల్లాడి తపన… 2100 కోట్ల మూవీ… ఆకట్టుకుంటున్న థ్రిల్లర్

Psychological Thriller movie: తెల్ల పిల్ల కోసం నల్ల పిల్లాడి తపన… 2100 కోట్ల మూవీ… ఆకట్టుకుంటున్న థ్రిల్లర్
Advertisement

Psychological Thriller movie : సైకలాజికల్ హారర్ నేపథ్యంలో వచ్చిన ఒక హాలీవుడ్ సినిమా మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు ఆ సినిమా ఆస్కార్ ని కూడా గెలిచింది. ఒక నల్లజాతీయుడు తన తెల్లజాతి గర్ల్‌ఫ్రెండ్ తల్లిదండ్రులను కలవడాని వెళ్ళినప్పుడు, ఆ కుటుంబం దాచిపెట్టిన భయంకరమైన రహస్యం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఇక ఇందులో వర్ణవివక్షను, ఒక హారర్ థ్రిల్లర్ రూపంలో చూపించిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది.

ఈ సినిమాను ఎక్కడ చూడచ్చు అంటే

ఈ అమెరికన్ సైకలాజికల్ హర్రర్ చిత్రం పేరు ‘గెట్ అవుట్’ (Get out). 2017లో వచ్చిన ఈ సినిమాకి జోర్డాన్ పీలే తొలిసారి దర్శకత్వం వహించాడు. ఇందులో డేనియల్ కలుయుయా, అల్లిసన్ విలియమ్స్, లిల్ రెల్ హౌరీ, లకీత్ స్టాన్‌ఫీల్డ్, బ్రాడ్లీ విట్‌ఫోర్డ్, కాలేబ్ లాండ్రీ జోన్స్, స్టీఫెన్ రూట్, కేథరీన్ కీనర్, బెట్టీ గాబ్రియేల్ నటించారు. ఇది 2017 జనవరి 23న సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. 2017 ఫిబ్రవరి 24న యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా యునైటెడ్ స్టేట్స్‌ థియేటర్లలో విడుదలైంది. ఇది కమర్షియల్ గా పెద్ద విజయాన్ని సాధించింది. కేవలం 37 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. దీనిని నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ 2017 సంవత్సరంలో టాప్ పది చిత్రాలలో ఒకటిగా గుర్తించింది. ఈ సినిమాకు ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. ప్రస్తుతం ఇది Amazon Prime Video, Jio hotstar ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది

స్టోరీ ఏమిటంటే

Advertisement

క్రిస్ అనే నల్లజాతీయుడు రోజ్ అనే తెల్ల అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె ఆహ్వానం మేరకు ఆమె తల్లిదండ్రులను కలవడానికి వాళ్ల ఊరికి వెళ్తాడు. మొదట్లో అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా, అక్కడ పని చేసే వ్యక్తుల ప్రవర్తన క్రిస్‌కు చాలా వింతగా, అనుమానాస్పదంగా అనిపిస్తుంది. ఆ ఇంట్లో జరిగే ఒక పార్టీకి వచ్చిన వాళ్లంతా క్రిస్‌ను ఒక వస్తువులా చూడటం, అతని శరీరం గురించి వింత ప్రశ్నలు వేయడంతో అతనికి ఏదో తప్పు జరుగుతోందని అర్థమవుతుంది.

అసలు విషయం ఏమిటంటే, ఆ కుటుంబం ఒక భయంకరమైన వ్యాపారం చేస్తుంటుంది. ముసలివారైపోయిన తెల్లజాతీయుల మెదడును, శారీరకంగా బలంగా ఉండే నల్లజాతీయుల శరీరాల్లోకి మార్చి వాళ్లను బానిసలుగా మార్చేస్తుంటారు. ఈ క్రమంలో క్రిస్‌ను కూడా బంధించి అతని శరీరాన్ని వేరొకరికి ఇవ్వాలని చూస్తారు. చివరికి క్రిస్ ఆ ప్రమాదం నుండి తప్పించుకున్నాడా ? రోజ్ అతన్ని మోసం చేసిందా ? ఈ సినిమా క్లైమాక్స్ ఏంటి ? అనే విషయాలను, ఈ సినమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : కూతురి మిస్సింగ్ తో అడవిలో హడలెత్తిపోయే అడ్వెంచర్… ఓటీటీలోకి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×