BigTV English

Virat Kohli: వైట్ జెర్సీలో విరాట్ కోహ్లీ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!

Virat Kohli: వైట్ జెర్సీలో విరాట్ కోహ్లీ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!

Virat Kohli: టీమ్ ఇండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్ విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు. ఇంగ్లాండ్ తో కీలక సిరీస్ కి ముందు తన నిర్ణయాన్ని ప్రకటించాడు విరాట్ కోహ్లీ. ఈ మేరకు సోషల్ మీడియాలో.. “బ్యాగి బ్లూ ధరించి టెస్ట్ క్రికెట్ లో అడుగుపెట్టి ఇప్పటికి 14 ఏళ్లు గడిచాయి.


Also Read: ENG vs IND: రెండో టెస్ట్ కంటే ముందు టీమిండియా షాకింగ్ నిర్ణయం.. స్లిప్ నుంచి ఆ దరిద్రున్ని తప్పించారుగా!

ఈ ఫార్మాట్ లో సుదీర్ఘకాలం కొనసాగుతానని నేను నిజంగా ఊహించలేదు. ఈ ఫార్మాట్ ఆటగాడిగా నన్ను ఎంతో పరీక్షించింది. నన్ను తీర్చిదిద్ది ఎన్నో పాఠాలు నేర్పింది. వ్యక్తిగత జీవితంలోను నేను వాటిని అనుసరిస్తాను. వైట్ జెర్సీలో ఆడడం వ్యక్తిగతంగాను ఎంతో ప్రత్యేకం. సుదీర్ఘకాలంగా క్రీజ్ లో ఉండడం.. అందులోనూ గుర్తుండిపోయే చిన్న, పెద్ద జ్ఞాపకాలు ఎల్లకాలం నాతో పాటే ఉంటాయి. టెస్ట్ క్రికెట్ కి వీడ్కోలు పలకడం మనసుకు భారంగా ఉంది.


కానీ ఇందుకు ఇదే సరైన సమయం అని అనిపించింది. ఆట కోసం నా సర్వస్వాన్ని ధారబోశాను. అందుకు ఆట కూడా నాకు ఎంతగానో తిరిగి ఇచ్చింది. మనస్ఫూర్తిగా, కృతజ్ఞతా భావంతో నేను ఈ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నా. క్రికెట్ కి, నా సహచర ఆటగాళ్లకు, నా ఈ ప్రయాణాన్ని సుదీర్ఘకాలం కొనసాగించేలా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అని పేర్కొన్నారు విరాట్ కోహ్లీ.

ఇక రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ఫ్యామిలీ మెన్ గా తన పాత్రను మరింత బలంగా చూపిస్తూ, భార్య అనుష్క శర్మ, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ. నిజానికి కోహ్లీ – అనుష్క సాధారణంగా తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచేలా ప్రయత్నిస్తారు. కానీ తాజాగా కోహ్లీ కుటుంబానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్ తో కలిసి దిగినట్లు ఉన్న ఫోటో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ ఫోటోలో వామిక మినహా మిగతా ముగ్గురు టీమిండియా వైట్ జెర్సీ వేసుకొని ఉండడాన్ని చూడొచ్చు. కోహ్లీ ధరించిన టీ షర్ట్ ముందు భాగంలో బైజూస్ లోగో ఉండగా.. అనుష్క శర్మ ధరించిన టీ షర్ట్ మీద ఈ లోగో కనిపించలేదు. బైజుస్ 2019 జూలై నుండి 2023 చివరి వరకు బిసిసిఐకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది.

Also Read: Shivam Dube: CSK డేంజర్ ప్లేయర్ షాకింగ్ నిర్ణయం… ఏకంగా 27.5 కోట్లతో

అయితే కోహ్లీ కొడుకు ఆకాయ్.. 2024 ఫిబ్రవరిలో జన్మించిన విషయం తెలిసిందే. అలాంటప్పుడు ఈ మధ్యకాలంలో కోహ్లీ బైజూస్ లోగోతో ఉన్న టీ షర్ట్ ధరించడం అనేది సాధ్యం కాదు. అలాగే కోహ్లీ కూతురు వామిక కూడా ఈ ఫోటోలో తన వయసు కంటే పెద్దదానిలా కనిపించింది. అందువల్ల ఈ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించినట్లు అర్థం అవుతుంది. మొత్తానికి వైట్ జెర్సీలో విరాట్ కోహ్లీ ఫ్యామిలీ చూడచక్కగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

?utm_source=ig_web_copy_link

Related News

Samantha: సమంతకు దగ్గరైన టీమిండియా ప్లేయర్.. షాకింగ్ పోస్ట్ వైరల్ !

Nayanthara: ‘నయన్’ ఎ**ఫైర్ లిస్ట్ పెద్దదే..లిస్ట్ లో టీమిండియా సీనియర్ ఆటగాడు ?

WWE Ric Flair: 76 ఏళ్ల వయసులో ఇద్దరు లేడీలతో రొమాన్స్ చేస్తున్న మల్లయోధుడు

Kohli – Anushka: లండన్ వీధుల్లో కోహ్లీ-అనుష్కకు షాక్… ఎవరు పట్టించుకోవడం లేదుగా !

Rinku Singh: రింకు సింగ్ కు దరిద్రంగా మారిన ఆ లేడీ…టీమిండియాలో ఛాన్స్ దక్కడం కష్టమేనా ?

Adam Hose: క్రికెట్ లోనే తొలిసారి.. గ్రౌండ్ లో భయంకరమైన గాయం.. కాలు విరిగి.. వీడియో చూస్తే వణికి పోవాల్సిందే

Big Stories

×