Big Stories

T20 : ఫీల్డ్ అంపైర్లు సరే.. థర్డ్ అంపైరూ అంతేనా..

T20 : T20 వరల్డ్ కప్ లో అంపైర్ల పొరపాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. టోర్నీలో తప్పు నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఇప్పటిదాకా ఫీల్డ్ అంపైర్ల మీదే ఉండగా… ఇప్పుడు థర్డ్ అంపైర్ కూడా ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పాక్-బంగ్లా మ్యాచ్ లో … కెప్టెన్ షకీబ్ ఔట్ కాకపోయినా… ఔటయ్యాడని ప్రకటించాడు… థర్డ్ అంపైర్. అంతే… అంపైరింగ్ పొరపాట్లపై మళ్లీ అభిమానులు భగ్గుమంటున్నారు.

- Advertisement -

బంగ్లా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 11వ ఓవర్ వేసిన పాక్ బౌలర్ షాదాబ్… నాలుగో బంతికి సౌమ్య సర్కార్ ను ఔట్ చేశాడు. ఐదో బంతి… ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన షకీబ్ షూకు తగిలింది. ఎల్బీడబ్ల్యూ కోసం పాక్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. దాంతో షకీబ్ రివ్యూ కోరాడు. బంతి ముందు బ్యాట్ ను తగిలి… ఆ తర్వాతే షకీబ్ షూను తాకినట్లు అల్ట్రా ఎడ్జ్‌లో స్పష్టంగా కనిపించింది. ఇన్ సైడ్ ఎడ్జ్ క్లియర్ గా ఉన్నా… థర్డ్ అంపైర్ కూడా ఎల్బీడబ్ల్యూ అయినట్లు ప్రకటించాడు. బ్యాట్ నేలను తాకడం వల్లే అల్ట్రా ఎడ్జ్ లో స్పైక్ వచ్చిందన్నాడు… థర్డ్ అంపైర్. కానీ, స్పైక్ వచ్చిన టైమ్ లో బ్యాట్ కు, నేలకు మధ్య ఖాళీ ఉన్నట్లు రీప్లేలో స్పష్టంగా కనిపిచింది. అయినా థర్డ్ అంపైర్ షకీబ్ ను ఔట్ గా ప్రకటించడం షకీబ్ తో పాటు బంగ్లా ఆటగాళ్లను, అభిమానులను షాక్ కు గురిచేసింది.

- Advertisement -

థర్డ్ అంపైర్ నిర్ణయంపై షకీబ్ ఫీల్డ్ అంపైర్లతో మాట్లాడాడు. కానీ వాళ్లు… థర్డ్ అంపైర్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పడంతో… అసహనం వ్యక్తం చేస్తూ పెవిలియన్ బాట పట్టాడు. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లా… ఆ తర్వాత ఒత్తిడికి లోనైంది. ధాటిగా ఆడే ప్రయత్నంలో వరుసగా వికెట్లు పడటంతో… పెద్దగా స్కోరు చేయలేకపోయింది. స్వల్ప స్కోరును ఛేదించి బంగ్లాపై పాక్ గెలవడంతో… ఇప్పుడు బంగ్లాదేశ్ ఫ్యాన్స్ అంపైర్ల తీరుపై మండిపడుతున్నారు. మొన్న ఇండియాతో మ్యాచ్ లోనూ అంపైర్లు చేసిన పొరపాట్లకే జట్టు ఓడిపోయిందని… పాక్ తో మ్యాచ్ లోనూ అంపైర్ల తప్పులకే బలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెగా టోర్నీల్లో ఇలాంటి అంపైరింగ్ పొరపాట్లు గతంలో ఎప్పుడూ చూడలేని సోషల్ మీడియాలో బంగ్లా ఫ్యాన్స్ గరంగరం అవుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News