Big Stories

Bangladesh Beats Zimbabwe : ఆఖరి బంతి దాకా బంగ్లా, జింబాబ్వేలతో ఆడుకున్న విజయం..

Bangladesh Beats Zimbabwe : T20 వరల్డ్ కప్ లో… చరిత్రలోనే ఇంతకు ముందెన్నడూ చూడని మ్యాచ్ జరిగింది. గెలిచామని ఓ జట్టు సంబరాలు చేసుకోవడం, ఓడిన జట్టు బాధగా మైదానాన్ని వీడటం జరిగిపోయాక… చివరి బంతిని అంపైర్ నోబాల్ గా ప్రకటించడంతో… తిరిగి ఆ ఒక్క బంతిని ఆడేందుకు రెండు జట్లు మళ్లీ మైదానంలోకి రావాల్సి వచ్చింది. అదృష్టం బంగ్లాదేశ్ వైపే ఉండటంతో… ఆ జట్టే విజేతగా నిలిచింది.

- Advertisement -

పాక్ పై ఉత్కంఠభరిత విజయం సాధించి ఊపుమీదున్న జింబాబ్వే… బంగ్లాదేశ్ తోనూ హోరాహోరీగా తలపడి… కేవలం 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ కు… ఓపెనర్ నజ్మల్ హుస్సేన్ అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. మరో ఓపెనర్ డకౌటైనా… ఏ మాత్రం దూకుడు తగ్గించని నజ్మల్… 55 బంతుల్లోనే 77 రన్స్ చేశాడు. ఇందులో ఒక సిక్స్, 7 ఫోర్లు ఉన్నాయి. మిడిలార్డర్ బ్యాటర్లలో షకిబుల్ హసన్, అఫీఫ్ హుస్సేన్ రాణించడంతో… 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి… 150 పరుగులు చేసింది… బంగ్లాదేశ్.

- Advertisement -

151 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వేను… బంగ్లా బౌలర్లు బెంబేలెత్తించారు. 35 పరుగులకే 4 వికెట్లు తీశారు. సీన్ విలియమ్స్, చకబ్వా జాగ్రత్తగా ఆడుతూ లక్ష్యం దిశగా సాగారు. చకబ్వా తక్కువ స్కోరుకే ఔటైనా… రేయాన్ బర్ల్ తో కలిసి విలియమ్స్ బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. సీన్ విలియమ్స్ బ్యాటింగ్ చూస్తే… జింబాబ్వేనే కచ్చితంగా గెలుస్తుందని అనిపించింది. కానీ… 42 బంతుల్లోనే 64 పరుగులు చేసిన విలియమ్స్…. 19 ఓవర్ 4వ బంతికి రనౌట్ కావడంతో… పరిస్థితి తారుమారైంది. విజయానికి చివరి 8 బంతుల్లో జింబాబ్వే 19 రన్స్ చేయాల్సి వచ్చింది. అప్పటికే 6 వికెట్లు పడ్డాయి. చివరి ఓవర్లో ఓ ఫోర్, సిక్స్ కొట్టినా… రెండు వికెట్లు పడటంతో… టెయిలెండర్లపై ఒత్తిడి పెరిగింది. చివరి బంతికి 5 రన్స్ చేయాల్సి వచ్చింది. కానీ… ఆ బాల్ కు జింబాబ్వే బ్యాటర్ స్టంపవుట్ కావడంతో… 4 రన్స్ తేడాతో బంగ్లా గెలిచినట్లు అంతా భావించారు. ఆటగాళ్లంతా మైదానాన్ని కూడా వీడారు. కానీ అంపైర్లు మాత్రం కదల్లేదు. చివరి బంతికి బ్యాటర్ స్టంపవుట్ అయిన విధానాన్ని థర్డ్ అంపైర్ కు నివేదించారు. రీప్లే చూస్తే… బంగ్లా కీపర్, బంతి వికెట్లు దాటకముందే పట్టుకుని స్టంపింగ్ చేసినట్లు కనిపించింది. దాంతో… దాన్ని నోబాల్ గా ప్రకటించి ఒక పరుగు అదనంగా ఇవ్వడమే కాదు… ఫ్రీ హిట్ కూడా ఇచ్చారు… అంపైర్లు. దాంతో… విజయానికి చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి వచ్చింది… జింబాబ్వే. కానీ ఆ అవకాశాన్ని కూడా బ్యాటర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఆఖరి బంతికి పరుగులేమీ చేయలేకపోయారు. దాంతో… 3 పరుగుల తేడాతో నెగ్గింది.. బంగ్లాదేశ్. 3 కీలక వికెట్లు తీసిన బంగ్లా బౌలర్ టస్కిన్ అహ్మద్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News