BigTV English

Bangladesh Team: ఒక్కరు తప్ప.. అంతా వస్తున్నారు!: బంగ్లా జట్టు ప్రకటన

Bangladesh Team: ఒక్కరు తప్ప.. అంతా వస్తున్నారు!: బంగ్లా జట్టు ప్రకటన

Bangladesh announce Test squad for India tour: పాకిస్తాన్ ను వారి దేశంలోనే ఓడించిన బంగ్లాదేశ్ రెట్టించిన ఉత్సాహంతో ఇండియాలో అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో జట్టుని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే పాకిస్తాన్ వెళ్లిన టీమ్ ఏదైతే ఉందో, అదే ఇండియా కూడా రానుంది.


కాకపోతే రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో ఆడిన బంగ్లా పేసర్ షోరిఫుల్ గాయపడి, రెండో టెస్టు ఆడలేదు. అయితే అతని గాయం ఇంకా తగ్గకపోవడంతో ఇండియా టూర్ కి ఎంపిక చేయలేదని బీసీబీ తెలిపింది. ఇక పాక్ తో జరిగిన తొలి టెస్టులో 23 ఏళ్ల షోరిఫుల్.. ఆ బ్యాటర్లని వణికించాడు. తొలి టెస్టులో కీలకమైన 3 వికెట్లు తీసి, విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అయితే, పేసర్‌ స్థానంలో వికెట్‌ కీపర్‌, బ్యాటర్ అయిన జాకర్‌ అలీకి చోటు కల్పించారు. ఇప్పుడిదే నెట్టింట పెద్ద చర్చగా మారింది. బౌలర్ స్థానంలో బౌలర్ ని పెట్టాలిగానీ వికెట్ కీపర్ ని తీసుకురావడమేంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


అయితే పాక్ తో జరిగిన రెండో టెస్టులో షోరిఫుల్ లేకపోయినప్పటికి బంగ్లాదేశ్ అద్భుతంగా ఆడి విజయం సాధించిందని అంటున్నారు. అందువల్లే ఇక బౌలర్ అవసరం లేదని, స్టాండ్ బై గా ఉంటాడని వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ని తీసుకున్నట్టు చెబుతున్నారు.

ఈ నెల 19 నుంచి చెన్నైలో తొలి టెస్ట్‌, 27 నుంచి కాన్పూర్‌లో రెండో టెస్ట్‌ జరగనుంది. ఆల్రడీ భారత జట్టుని కూడా బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల శ్రీలంక వన్డే సిరీస్ ను ఓడిపోయి వచ్చింది. దాదాపు ఒకరిద్దరు తప్ప ఇదే జట్టు తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది.

ముఖ్యంగా అక్కడ శ్రీలంక స్పిన్నర్ల ధాటికి ఇండియా దగ్గర ఆన్సర్ లేదు. శ్రీలంక జట్టులోనే లేని వెటరన్ బౌలర్ కి కూడా వికెట్లు అప్పనంగా ఇచ్చుకున్నారు. అంటే మనవాళ్ల ఆట ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. ఇకపోతే బంగ్లాదేశ్ లో కూడా అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. వారే పాకిస్తాన్ ను మట్టి కరిపించారు. వారే ప్రధాన బలంగా మారారు.

బంగ్లా బ్యాటర్లు ఆడకపోయినా, బౌలర్లు మ్యాచ్ లను నిలబెట్టేస్తున్నారు. మరి మన టీమ్ ఇండియా సీనియర్లు హాయిగా రిలాక్స్ అవుతూ నవ్వుతూ వస్తున్నారు. క్రీజులోకి వెళ్లాక ఆడితే ఆడినట్టు, లేదంటే లేదన్నట్టుగా ఆడుతున్నారనే విమర్శలున్నాయి. మరి శ్రీలంక వన్డే సిరీస్ రిపీట్ కాదు కదా…అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: పారాలింపిక్స్ విజేతలకు.. మోదీ మార్క్ ఆతిథ్యం

బంగ్లాదేశ్ టెస్టు జట్టు వివరాలు: నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), ముష్ఫికర్ రహీమ్, జాకీర్ హసన్, నయీమ్ హసన్, నహీద్ రాణా, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖలీద్ అహ్మద్, జాకర్ అలీ అనిక్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా హసన్ జాయ్, షాద్మన్ ఇస్లాం, మొమినుల్ హక్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×