EPAPER

PAK vs BAN: రెండో టెస్టులో పాకిస్తాన్ ఓటమి: బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్

PAK vs BAN: రెండో టెస్టులో పాకిస్తాన్ ఓటమి: బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్

PAK vs BAN: అనుకున్నదే జరిగింది. సొంత గడ్డపై బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టులో కూడా పాకిస్తాన్ పరాజయం పాలైంది. దీంతో సిరీస్ ను 2-0 తేడాతో కోల్పోయింది. బంగ్లాదేశ్ తో జరిగిన రెండు టెస్టుల్లో కూడా ఓటమి పాలు కావడంతో ఆ జట్టులోని లోపాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.


ఏం జరిగినా ప్రజలు, సీనియర్ల నుంచి వచ్చే తిట్లు, అవమానాల ధాటికి, ఆటగాళ్లు మానసికంగా కుంగిపోయి ఆటపై దృష్టి పెట్టలేకపోతున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా పాకిస్తాన్ క్రికెట్ వైభవం మసకబారుతుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

185 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ చాలా సాధికారికంగా ఆడింది. ఎక్కడా తడబాటు లేకుండా గెలిస్తే గెలిచాం.. లేదంటే లేదన్నట్టు ఆడింది. ఆటకు చివరి రోజైన ఐదో రోజున 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసి విజయం సాధించి సంచలనం సృష్టించింది.


Also Read: రోహిత్ శర్మ అంటే.. ఏమనుకున్నారు?: ఫీల్డింగ్ కోచ్ దిలీప్

బంగ్లాదేశ్ బ్యాటర్లలో జాకిర్ హాసన్ (40), కెప్టెన్ నజ్ముల్ హుసైన్ (38) ఇద్దరూ విజయానికి బాట వేశారు. ఇందులో జాకీర్ అయితే ఓపెనర్ గా వచ్చి టీ 20 తరహాలో ఆడి, పాకిస్తాన్ ను మానసికంగా దెబ్బ కొట్టాడు. 39 బాల్స్ లో 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇందులో 2 సిక్స్ లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఇక్కడే పాకిస్తాన్ నీరుగారిపోయింది. మ్యాచ్ ని వదిలేసింది.

పాక్ బౌలర్లలో మీర్ హంజా, షాజాద్, అబ్రార్ అహ్మద్, ఆఘా తలా ఒక వికెట్ పడగొట్టారు.

పాకిస్తాన్ తొలిఇన్నింగ్స్ లో 274 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అందుకు బదులుగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 262 పరుగులు మాత్రమే చేసింది. 12 పరుగుల లీడ్ తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్.. బంగ్లా బౌలర్ల ధాటికి 172 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మొత్తానికి బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 185 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగి సునాయాసంగా విజయం సాధించింది.

పాక్ కెప్టెన్ షాన్ మసూద్ కూడా ఫీల్డింగ్ ని కరెక్టుగా సెట్ చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బంగ్లా కెప్టెన్ చేసినంత పకడ్బందీగా, ప్రణాళిక బద్ధంగా ఫీల్డింగ్ సెట్ చేసి, బౌలింగ్ చేయించడంలో విఫలమయ్యాడని అంటున్నారు. మొత్తానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇక జట్టుని ప్రక్షాళన చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related News

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Cristiano Ronaldo: సోషల్ మీడియాలో అతని ఫాలోవర్స్.. 100 కోట్లు

Big Stories

×