Nigar Sultana respect Pakistan flag: ఆసియా క్రీడలు 2026 టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మహిళల జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్ జాతీయ జెండా కింద పడుతుండగా ఆమె, వెంటనే అలర్ట్ అయి… దాన్ని చాక చక్యంగా అందుకున్నారు. అనంతరం ఎప్పటి లాగే… పాకిస్తాన్ జాతీయ జెండాను బంగ్లాదేశ్ ఫ్లాగ్ పక్కనే సెట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఇది చూసిన క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ రెండు దేశాలు ఒకటేనని మరోసారి రుజువు అయిందని పోస్టులు పెడుతున్నారు. పాకిస్తాన్ తరహా లోని బంగ్లాదేశ్ ను కూడా దూరం పెట్టాలని ఇండియన్ అభిమానులు కూడా రిక్వెస్ట్ పెడుతున్నారు. కుక్క తోక వంకర అన్నట్లుగానే వీళ్ళ వ్యవహారం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
పాకిస్తాన్ జాతీయ జెండా కింద పడుతుండగా పట్టుకున్న బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. పాకిస్తాన్ పరువు కాపాడేందుకు ఇంత దిగజారాలా? అంటూ ఇండియన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదం పై తాజాగా బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా క్లారిటీ ఇచ్చారు. పాకిస్తాన్ జాతీయ జెండా పడుతుండగా ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను… అందుకే దాన్ని పట్టుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అక్కడ ఎవరు ఉన్నా అదే పని చేస్తారని ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
జాతీయ జెండా పడుతున్నప్పుడు నేను అక్కడ లేకుంటే… మరో వ్యక్తి దాన్ని నిలబెట్టే వారని వెల్లడించారు. ఇందులో ఎలాంటి వివాదం లేదని క్లారిటీ ఇచ్చారు. జాతీయ జెండా ఎవరికైనా సమానమేనని తెలిపారు. బంగ్లాదేశ్ జాతీయ జెండాను తాను ఎంత గౌరవిస్తానో పక్క దేశాల వాళ్లను కూడా అదే తరహాలో ట్రీట్ చేస్తానని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఇందులో ఎలాంటి మత బేధాలు ఉండబోవు అని ఆమె స్పష్టం చేశారు. దీంతో బంగ్లాదేశ్ మహిళల జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా మాత్రం టీమిండియాను అలాగే కెప్టెన్ హర్మన్ ను నిగర్ సుల్తానా దారుణంగా అవమానించింది. ఆసియా కప్ టోర్నమెంట్ లో భాగంగా బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగినప్పుడు హర్మన్ షేక్ హ్యాండ్ ఇస్తే నిగర్ సుల్తానా రిజెక్ట్ చేశారు. దీనిపై అప్పట్లో తీవ్ర దుమారమే రాజుకుంది. అయితే ఈ సంఘటనకు అలాగే పాకిస్తాన్ జాతీయ జెండా వివాదానికి ముడి పెడుతూ ఇండియన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ జాతీయ జెండా కింద పడకుండా కాపాడిన నిగర్ సుల్తానా, టీమిండియా కెప్టెన్ కు ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని నిలదీస్తున్నారు.