Comedy Series: ఓ ఇంట్లో ఇప్పటికే సమస్యలు చాలానే ఉన్నాయి. వాటిని సర్దుబాటు చేసుకునే లోపే కొత్త వ్యక్తి ఎంట్రీ ఇచ్చి, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు మరింత పెరిగితే… పైగా ఓ వ్యక్తి తీసుకున్న ఒక్క నిర్ణయం ఫ్యామిలీ మొత్తాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తే ? కటారియా కుటుంబం చుట్టూ జరిగే ఇలాంటి సరదా గందరగోళాలతో ‘బకైతి 2’ (Bakaiti 2) రెండో సీజన్ మొదలవుతుంది. మరి ఈ సీజన్ ను ఎక్కడ చూడవచ్చు ? తెలుగులోనూ ఉందా ? అనేది తెలుసుకుందాం.
సంజయ్, అజయ్, నైనాతో పాటు కటారియా కుటుంబ సభ్యులు తమ సమస్యలతో జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికీ వేర్వేరు ఆలోచనలు ఉండటంతో చిన్న విషయాలు కూడా పెద్ద చర్చలకు దారి తీస్తుంటాయి. ఒకరకంగా చెప్పాలంటే గొడవలు అవుతూ ఉంటాయి. రెండో సీజన్ ప్రారంభంలో సంజయ్, అజయ్‌తో పాటు కటారియా కుటుంబం కొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది. కుటుంబ గౌరవం, వ్యక్తిగత నిర్ణయాలు, ఒత్తిళ్లు, బాధ్యతలు… వీటన్నింటి మధ్య ఎవరి మాట నెగ్గుతుందనే విషయంలో ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది.
ఇదే సమయంలో నైనా ఇంటికి తిరిగి వస్తుంది. ఆమె రాకతో కుటుంబంలో ఇప్పటికే ఉన్న లెక్కలన్నీ మరోసారి మారిపోతాయి. నైనా ఎదుర్కొనే పరిస్థితులు కుటుంబ సభ్యులను కూడా ఆలోచనలో పడేస్తాయి. ఒకవైపు కుటుంబ గౌరవం కాపాడుకోవాలనే ఆలోచన… మరోవైపు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు… దీంతో ఇంట్లో గొడవలు, రాజీలు కామన్ అవుతాయి. మూడో ఎపిసోడ్‌లో సంజయ్ కు సర్‌ప్రైజ్ బర్త్ డే ప్లాన్ చేయడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తారు. కానీ నైనాకు కూడా ఊహించని ఓ సర్‌ప్రైజ్ ఎదురవుతుంది.
నాలుగో ఎపిసోడ్ లో కెవిన్ ఎంట్రీతో ఇంట్లో మరింత గందరగోళం మొదలవుతుంది. అదే సమయంలో బంటీ తీసుకునే ఓ నిర్ణయం కటారియా కుటుంబాన్ని షాక్ కు గురిచేస్తుంది. ఇలా ఒక్కో ఎపిసోడ్‌లో కుటుంబ సభ్యుల మధ్య కొత్త సమస్య, కొత్త పరిస్థితి, కొత్త కామెడీ పుడుతుంది. మార్పులు వచ్చినా కలిసి ఉండటం, కుటుంబం కోసం రాజీ పడటం, తమకు కావాల్సింది సాధించుకోవడం వంటి అంశాలతో కటారియాల ప్రయాణం సాగుతుంది. మరి ఈ ఫ్యామిలీ డ్రామాలో చివరికి ఏమైంది ? అన్నది తెలియాలంటే సిరీస్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే.
‘బకైతి 2’ ZEE5 ఒరిజినల్ హిందీ కామెడీ ఫ్యామిలీ సిరీస్. రెండో సీజన్ ఎపిసోడ్లు సెప్టెంబర్ 25 నుంచి అందుబాటులోకి వచ్చాయి. హిందీ, తమిళం, కన్నడ భాషల్లో సిరీస్ అందుబాటులో ఉంది. కానీ తెలుగులో మాత్రం స్ట్రీమింగ్ అవ్వట్లేదు. భాష అడ్డుకాదనుకునే ప్రేక్షకులు సిరీస్ ను ఇతర భాషల్లో చూడవచ్చు.
Read Also: భార్య బిజినెస్‌లో బిజీ… ముగ్గురు పిల్లలతో తండ్రి తిప్పలు… ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామాను డోంట్ మిస్