E-Paper
Advertisement

నాకు వారి నుండి ప్రాణహాని ఉంది.. యరపతినేని శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్!

నాకు వారి నుండి ప్రాణహాని ఉంది.. యరపతినేని శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్!
Advertisement

Yarapathineni Srinivasa: కార్యకర్తల సమావేశం జరుగుతోంది. మైక్ అందుకున్న గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.. నేరుగా మాజీ సీఎం జగన్‌పైనే గురిపెట్టారు. తనను ఆయన టార్గెట్‌ చేశారని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉండొచ్చని.. ఒక మాజీ కేంద్రమంత్రి హెచ్చరించారని చెప్పారు. ఇక్కడితో ఆగకుండా మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు.

గురజాల రాజకీయం..

జాతీయ పార్టీలో చేరితే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని తనకు ఆఫర్‌ వచ్చిందని కూడా చెప్పారు. అంతపెద్ద పదవి ఆశ చూపినా.. తాను టీడీపీలోనే కొనసాగుతాననే సంకేతాలిచ్చారు. గురజాల రాజకీయం ముందునుంచీ మండుతూనే ఉంది. గత ఎన్నికల్లో 29 వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు శ్రీనివాసరావు. అప్పటి నుంచి యరపతినేని, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఆయన మంగళగిరిలో డీజీపీని కలిసి వైసీపీ హయాంలో గురజాల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేశారు.

ఆఫర్‌ ఇచ్చినా..

Advertisement

ఇప్పుడు ప్రాణహాని ఆరోపణలతో రాజకీయ వేడి మరింత పెరిగింది. అయితే యరపతినేని ఆరోపణలపై వైసీపీ నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదు. ఆఫర్‌ ఇచ్చిన జాతీయ పార్టీ పేరు కూడా ఆయన బహిర్గతం చేయలేదు. ప్రాణహాని ఆరోపణ, జాతీయ పార్టీ ఆఫర్‌.. యరపతినేని మాటలు పల్నాడు రాజకీయాల్లో కొత్త దుమారం రేపాయి. ఈ ఆరోపణలపై వైసీపీ ఎలా స్పందిస్తుందన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.

Also read: ట్రైలర్‌కు బాలయ్య.. ప్రీ రిలీజ్‌కు ఎన్టీఆర్.. అదిరిపోయే ప్లాన్!

Tags

Related News

మచిలీపట్నంలో హోరెత్తిన వీఆర్ఏ జేఏసీ ధర్నా.. వారి డిమాండ్లు ఇవే!

ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ.. అభ్యర్థి ఎవరంటే?

కేంద్ర ప్రభుత్వానికి బిగ్ షాక్.. సర్ వివాదంపై స్పష్టత కోరిన ఎన్డీయే మిత్రపక్షాలు!

నాగాలాండ్‌లో తీవ్ర విషాదం.. కల్తీ మద్యం తాగి 19 మంది మృతి!

రాజ్యాంగ వ్యవస్థ పై బాంబు పేల్చిన జర్నలిస్టులు.. వెలుగులోకి సంచలనాలు!

ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. ఆ కీలక సిస్టమ్‌కు గ్రీన్ సిగ్నల్!

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధానికి ఊహించని షాక్.. గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్!

Big Stories

Advertisement
×