E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode October 2nd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్ ఇచ్చిన మిస్సమ్మ – పార్థు టూర్ క్యాన్సిల్ అవుతుందా…?    

Nindu Noorella Saavasam Serial Today Episode October 2nd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్ ఇచ్చిన మిస్సమ్మ – పార్థు టూర్ క్యాన్సిల్ అవుతుందా…?    
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: పెళ్లయ్యాక పార్థు, మనోహరిని తీసుకుని వెళ్లిపోవడానికి సిద్దమవుతాడు. కానీ పార్థుతో వెళ్లడం ఇష్టం లేని మనోహరి కొత్తగా ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తుంది. కింద హాల్లో కూర్చున్న పార్థుకు జాగ్రత్తలు చెప్తుంటారు అమర్‌, మిస్సమ్మ. అమర్‌ వాళ్లను తమతో రమ్మని పార్థు అడిగితే కొత్తగా పెళ్లైన వాళ్లకు మేము వస్తే డిస్టర్బ్‌ అవుతుంది మేము తర్వాత వస్తాము కానీ మీరే వీలున్నప్పుడు ఇక్కడకు రండి అంటూ అమర్‌, మిస్సమ్మ చెప్తారు. అప్పుడే రాథోడ్‌ వచ్చి లగేజీ మొత్తం కారులో సర్దేశానని చెప్తాడు. పార్థు, మనోహరి ఇంకా రాలేదని ఎదురుచూస్తుంటే.. పైన రూంలో ఉందేమో నేను తీసుకొస్తాను అంటూ మిస్సమ్మ వెళ్తుంది.

రూంలో ఉన్న మనోహరి యాదమ్మతో రాత్రి శోభనం అయితే తప్పించుకున్నాను కానీ ఇప్పుడు పార్థుతో వెళ్లడం మాత్రం తప్పించుకునే పరిస్థితి కనిపించడం లేదు చంభా అని చెప్తుంది. అయితే కొద్ది రోజులు ఇక్కడే ఉందామని పార్థు సార్‌కు చెప్పలేకపోయావా మనోహరి అంటూ యాదమ్మ చెబితే.. ఎన్ని విధాలుగా చెప్పినా పార్థు వినడం లేదు.. అర్జెంట్‌గా వెళ్లిపోవాల్సిందే అంటున్నాడు ఇప్పుడే ఏం చేయాలో నాకు తోచడం లేదు.. అంటూ మనోహరి అయోమయంగా చూస్తుంటే.. యాదమ్మ బాధగా అయ్యో మనోహరి నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోతే నా పరిస్థితి ఏంటి అంటుంది. నేను ఇంకా వెళ్లలేదు కదా చంభా.. నేను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్లను ఏదో ఒకటి చేసి నేను ఇక్కడే ఉండిపోతాను అని చెప్తుంది.

Advertisement

అప్పుడే రూంలోకి వచ్చిన మిస్సమ్మ కోపంగా చూస్తూ.. ఇన్నాళ్లు ఇక్కడ ఉన్నా సరిపోలేదా..? కింద పార్థు గారు నీకోసం ఎదురుచూస్తున్నారు అంటూ చెప్పగానే.. మనోహరికి పార్థుతో వెళ్లడం ఇష్టం లేదని యాదమ్మ చెప్పగానే.. పెళ్లయ్యాక ఎవరైనా భర్తతో పాటు వెళ్లాల్సిందే కదా యాదమ్మ. మనోహరికి కూడా వెళ్లక తప్పదు ఈ రోజు కోసమే కదా మేమంతా ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నాము అంటుంది. ఆ మాటలకు మనోహరి కోపంగా నా మీద పగబట్టి పంతం నెగ్గించుకుంటున్నావు కదా భాగీ చూస్తాను నీ అంతు అంటూ తిడుతుంటే.. చూడు నీ మీద పగ బడితే నిన్ను ఎప్పుడో జైలు పంపించేదాన్ని అలా కాకుండా మంచిగా పెళ్లి చేసి కాపురానికి పంపిస్తున్నాను.. ఇప్పటికైనా మారి పార్థుతో కొత్త జీవితం మొదలుపెట్టు.. సంతోషంగా బతకడం అలవాటు చేసుకో అంటుంది మిస్సమ్మ.

మిస్సమ్మ మాటలకు మనోహరి కోపంతో రగిలిపోతుంది. నువ్వు నాకు జీవితాన్ని ఇవ్వడం ఏంటే అంటూ తిడుతుంది. అందుకు మిస్సమ్మ.. అవును మా అక్కను చంపిన నిన్ను జైలుకు పంపకుండా మా అక్క కోరిక ప్రకారం నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తున్నాను.. నువ్వు మంచిగా మారి పార్థు గారితో హ్యాపీగా ఉంటే.. నువ్వు ఊహించని గిఫ్ట్‌ ఇస్తాను అంటుంది. అందుకు మనోహర ఆశ్చర్యంగా చూస్తూ.. గిఫ్టా నాకా అంటుంది. అవును నీకే అంజును నీ కూతురుగా నీకు అప్పగిస్తాను అని మనసులో అనుకుంటుంది మిస్సమ్మ.

Advertisement

అప్పుడే పార్థు పిలిస్తే అందరూ కిందకు వెళ్లిపోతారు. మనోహరి వెళ్లగానే.. పార్థు అందరికీ సెండాఫ్‌ ఇచ్చి మనోహరిని తీసుకుని బయట కారు దగ్గరకు వెళ్లిపోతాడు. వాళ్లకు సెండాఫ్‌ ఇవ్వడానికి బయటకు వస్తున్న మిస్సమ్మ కాలు స్లిప్‌ అవుతుంది. దీంతో మిస్సమ్మ ఇదేంటి అపశకునం అంటూ పార్థు, మనోహరిలను వెళ్లొద్దని ఆపేస్తుంది. అమర్‌ ఏంటా మూఢనమ్మకం అంటున్నా వినకుండా పార్థు, మనోహరిలను ఇంట్లోకి పిలిచి కూర్చోబెడుతుంది. భయంతో వణుకుతూ మిస్సమ్మ కిచెన్‌లోకి వెళ్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

లవ్ స్టోరీ బయటపెట్టిన హైపర్ ఆది..ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనంటూ!

హైపర్ ఆది ఆస్తుల విలువ ఎంతో తెలుసా? మామూలు సంపాదన కాదుగా?

సామాన్లు బాగుండాలే..లిరిక్స్‌తో మళ్ళీ దొరికిపోయిన బషీర్ మాస్టర్!

ఏకంగా 50 కట్స్ తో టీవీలోకి ధురంధర్ 2.. ఎప్పుడు? ఏ ఛానల్ అంటే?

బిగ్ బాస్ సీజన్ 1 నుండి 10 వరకు.. హోస్టుల రెమ్యూనరేషన్లు తెలిస్తే షాక్!

మేము లవర్స్ కాదురా నాయనా..రీతు చౌదరి షాకింగ్ పోస్ట్..!

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో రికార్డ్.. మీనాకు రింగ్ గిఫ్ట్.. రోహిణికి షాక్…

Big Stories

Advertisement
×